మారుతి సుజుకి మరియు టాటా మోటార్స్‌కు భారీ షాకిచ్చిన వోక్స్‌వ్యాగన్
జర్మనీకి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఢిల్లీ వేదికగా జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన ఈవెంట్‌లో వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ తొలి ఆవిష్కరణ చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో లభించే టి-క్రాస్ ఎస్‌యూవీలో పలు మార్పులు చేర్పులు చేసి ఇండియన్ వెర్షన్‌గా తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, అతి త్వరలో దేశీయ మార్కెట్లోకి పరిచయం కానున్న వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ ఎస్‌యూవీలో ఎన్నో రకాల క్రోమ్ ఎలిమెంట్లు, అప్‌గ్రేడెడ్ సస్పెన్ సిస్టమ్ మరియు పొడవాటి వీల్ బేస్ (100ఎమ్ఎమ్ వరకు అధికం). పొడవాటి వీల్-బేస్ 5 మంది సౌకర్యంవతంగా ప్రయాణించడానికి విశాలమైన క్యాబిన్ స్పేస్ కల్పిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దంగా ఉన్న టి-క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని వోక్స్‌వ్యాగన్ MQB A0 ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. టి-క్రాస్ లభించే అన్ని వేరియంట్లలో కేవలం టుర్భో-ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌లను మాత్రమే అందివ్వనున్నట్లు సమాచారం. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. 1.0-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 115బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల టుర్బో పెట్రోల్ ఇంజన్ 128బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టి-క్రాస్ ఎస్‌యూవీని సీఎన్జీ ఇంజన్ వేరియంట్లో కూడా లాంచ్ చేస్తారనే వార్తలున్నాయి. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

వోక్స్‌వ్యాగన్ తమ టి-క్రాస్ ఎస్‌యూవీని తొలుత 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించి, 2020-21 మధ్య కాలంలో విక్రయాలకు సిద్దంగా పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉంది. వీలైనంత మేర తక్కువ ధరలో అందించే ఉద్దేశంతో దేశీయంగా తయారైన విడి భాగాలను విరివిగా ఉపయోగించుకోనున్నారు. దీంతో టి-క్రాస్ ఎస్‌యూవీని రూ. 11 నుండి 15 లక్షల మధ్య ధరల శ్రేణిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
దేశీయ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. ఈ సెగ్మెంట్లో మెరుగైన అవకాశాలున్న నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్ టి-క్రాస్ ఎస్‌యూవీని ప్లాన్ చేసింది. పూర్తి స్థాయిలో విడుదలైతే కంపెనీ యొక్క తొలి అత్యంత సరసమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








