న్యూ హోండా సిటీ : స్పెక్స్, వేరియంట్స్, ఇతర వివరాలు

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు అయిన హోండా సంస్థ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో చాల వాహనాలను విడుదల చేసింది. ఇప్పుడు హోండా బ్రాండ్ నుంచి మరో న్యూ వెర్షన్ కార్ ఇండియన్ మార్కెట్లో కోసం విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది. ఈ హోండా యొక్క న్యూ బ్రాండ్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..!

న్యూ హోండా సిటీ : స్పెక్స్, వేరియంట్స్, ఇతర వివరాలు

హోండా ఐదవ తరం సిటీ సెడాన్‌ను మార్చి 16 న మార్కెట్లో ఆవిష్కరించడానికి హ్యుందాయ్ కార్స్ ఇండియా సిద్ధమైంది. కొత్త (2020) హోండా సిటీ 2019 నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించబడింది. త్వరలో భారత మార్కెట్లోకి రానుంది.

న్యూ హోండా సిటీ : స్పెక్స్, వేరియంట్స్, ఇతర వివరాలు

భారతదేశంలో 2020 హోండా సిటీ ప్రారంభించటానికి ముందు, టీమ్ బిహెచ్‌పి దేశంలో కొత్త సెడాన్‌లో అందించాలని భావిస్తున్నారు. ఈ కొత్త సెడాన్ యొక్క ఇంజిన్ లక్షణాలు, కొలతలు మరియు వేరియంట్‌లను వెల్లడించే పత్రాన్ని కంపెనీ విడుదల చేసింది.

న్యూ హోండా సిటీ : స్పెక్స్, వేరియంట్స్, ఇతర వివరాలు

కంపెనీ విడుదల చేసిన దాని ప్రకారం కొత్త హోండా సిటీ ఒకే పెట్రోల్ ఇంజన్ ఎంపికతో అందించబడుతుంది. ఇది 1.5-లీటర్ బిఎస్ 6 కంప్లైంట్ ఐ-విటిఇసి పెట్రోల్ యూనిట్ రూపంలో వస్తుంది. ఇది 6,600 ఆర్‌పిఎమ్ వద్ద 119 బిహెచ్‌పి గరిష్ట పవర్ ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. కానీ కంపెనీ వారు డీజిల్ యూనిట్ యొక్క ఏ ఎంపికను వెల్లడించలేదు. కొత్త హోండా సిటీలోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానించబడి ఉంటుంది.

న్యూ హోండా సిటీ : స్పెక్స్, వేరియంట్స్, ఇతర వివరాలు

భారతదేశంలో ఒకసారి లాంచ్ అయిన 2020 హ్యుందాయ్ సిటీని వి, విఎక్స్ మరియు జెడ్ఎక్స్ అనే మూడు వేరియంట్ల పరిధిలో అందించవచ్చని కూడా తెలిపారు. మూడు వేరియంట్లు ఒకే ఇంజన్ ద్వారా శక్తిని పొందుతాయి మరియు అప్సనల్ సివిటి గేర్‌బాక్స్‌ను కూడా అందుకుంటాయి.

న్యూ హోండా సిటీ : స్పెక్స్, వేరియంట్స్, ఇతర వివరాలు

కొత్త (2020) హోండా సిటీ యొక్క కొలతలను గమనించినట్లయితే దీని పొడవు 4549 మిమీ, 1748 మిమీ వెడల్పు మరియు 1489 మిమీ ఎత్తు మరియు 2600 మిమీ వీల్‌బేస్ ఉంటుంది. కానీ కొత్త హోండా సిటీ యొక్క సివిటి-అమర్చిన వేరియంట్లు 4569 మిమీ వద్ద 20 మిమీ పొడవు కలిగి ఉండి మిగిలిన కొలతలు యధావిధిగా ఉంటాయి.

న్యూ హోండా సిటీ : స్పెక్స్, వేరియంట్స్, ఇతర వివరాలు

కొత్త హోండా సిటీ మునుపటి మోడల్‌ కంటే అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. 2020 సిటీ సెడాన్ లోపల మరియు వెలుపల దాని స్టైలింగ్‌లో కొన్ని మార్పులతో కొత్త డిజైన్‌ను కలిగి ఉంది.

న్యూ హోండా సిటీ : స్పెక్స్, వేరియంట్స్, ఇతర వివరాలు

కొత్త హోండా, సివిక్ మరియు అమేజ్ వంటి బ్రాండ్ నుండి ఇతర మోడళ్ల మాదిరిగానే కొత్త విలక్షణమైన స్టైలింగ్‌తో వస్తుంది. లోపల పూర్తిగా కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంది. భారతీయ మార్కెట్లో ప్రస్తుత అమ్మకాల మోడల్ కంటే ఎక్కువ ప్రీమియం మరియు ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంటుంది.

న్యూ హోండా సిటీ : స్పెక్స్, వేరియంట్స్, ఇతర వివరాలు

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త హోండా సిటీ భారత మార్కెట్లో సి-సెగ్మెంట్ సెడాన్ గా కొనసాగుతుంది. ప్రస్తుత అవుట్గోయింగ్ మోడల్‌తో పోలిస్తే ఇది కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతే కాకుండా శక్తివంతమైన ఇంజిన్ కూడా ఉంటుంది. కొత్త హోండా సిటీ ధరలు కూడా కొంత వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ కార్ యొక్క బుకింగ్స్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

Source: Team bhp

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New Honda City Engine Specs, Variants & Dimension Details Leaked Ahead Of India Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X