హైబ్రిడ్ వెర్షన్‌లో 2020 హోండా సిటీ.. రిలీజ్ ఎప్పుడంటే?
జపాన్ దిగ్గజం హోండా మోటార్స్ గత ఏడాది నవంబరులో థాయిలాండ్‌లో జరిగిన థాయ్ మోటార్ ఎక్స్‌పోలో ఐదో తరానికి చెందిన సీ-సెగ్మెంట్ సెడాన్ కారును ఆవిష్కరించింది. కొత్త తరం 2020 హోండా సిటీ కారును ఇండియన్ మార్కెట్లోకి మార్చిలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు దేశీయ రోడ్లు మీద దీనిని పరీక్షించారు.

ఇందులో మరో ప్రత్యేకం ఏమిటంటే.. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లో మాత్రమే లభించే సిటీ మోడల్ ఇక మీదట హైబ్రిడ్ వేరియంట్లో కూడా లభించనుంది. అంతే కాదు ప్రస్తుతం ఉన్న సిటీ పోల్చుకుంటే కొత్త సిటీ మోడల్ సైజులో కూడా పెద్దగా ఉంటుంది.

సరికొత్త హోండా సిటీలో అత్యాధునిక ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లైట్లు, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఫీచర్ గల 8-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగులు, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ ఇంకా ఎన్నో కొత్త ఫీచర్లు వస్తున్నాయి.

థాయి మోటార్ షోలో వచ్చిన 2020 హోండా సిటీలో చాలా వరకు కొత్త ఫీచర్లు మిస్సయ్యాయి. ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డిజిటల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే మరియు రియర్ ఏసీ వెంట్స్ వంటివి ఇండియన్ వెర్షన్ హోండా సిటీలో వచ్చే అవకాశం ఉంది.

2020 హోండా సిటీలో సాంకేతికంగా 1.5-లీటర్ కెపాసిటీ గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లు యధావిధిగా వస్తాయి. రెండింటినీ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ (ఆటోమేటిక్) గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

హోండా మోటార్స్ 2020 సిటీ సెడాన్ కారులో శక్తివంతమైన 1.0-లీటర్ టర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కూడా అందించే ఛాన్స్ ఉంది. సుమారు 122బిహెచ్‌పి పవర్ మరియు 173ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేసే ఈ వేరియంట్‌ను "సిటీ ఆర్ఎస్ టుర్భో" పేరుతో పరిచయం చేసే అవకాశం ఉంది.

సరికొత్త 2020 హోండా సిటీ పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే విపణిలో ఉన్న మారుతి సుజుకి సియాజ్, 2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్, 2020 స్కోడా ర్యాపిడ్ మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








