2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థలలో హోండా ఒకటి. హోండా కంపెనీ నుంచి ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటికే విడుదలైన చాలా వాహనాలు మంచి ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు హోండా కంపెనీ తన 5 తరం కొత్త హొండా సిటీ కారుని వచ్చే నేలలో ఆవిష్కరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించింది. కొత్త హొండా గురించి మరిన్ని ఆసక్త్గీకరమైన విషయాలు మీకోసం..

2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

జపాన్‌కు చెందిన ఆటో తయారీ సంస్థ అయిన హొండా తన కొత్త బ్రాండ్ కారుని ఇండియన్ మార్కెట్లో మార్చి 16 న ఆవిష్కరించనుంది. ఆటోకార్ ఇండియా ప్రకారం ఆవిష్కరణ కార్యక్రమంలోనే వాహనాలను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తామని కంపెనీ తెలిపింది.

2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

రాబోయే హోండా సిటీ 2020 మోడల్ అంతర్జాతీయ మోడళ్లపై చేసిన చిన్న మార్పులను కలిగి ఉంటుంది. కొత్త హోండా సిటీ యొక్క ఫ్రంట్ ఫాసియాలో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు మరియు పునఃరూపకల్పన చేసిన బంపర్లు, ఫ్రంట్ గ్రిల్ మరియు ఫాగ్ లాంప్‌లు ఉన్నాయి.

2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

ఇంటీరియర్స్ ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అనుకూలమైనది ఉండటమే కాకుండా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, వంటివి అప్డేట్ చేయబడి ఉంటాయి.

2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

2020 కొత్త హోండా సిటీలోని భద్రతా లక్షణాలను గమనిస్తే ఇందులో ఎబిఎస్ విత్ ఇబిడి, క్రూయిజ్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమెరా మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సేఫ్టీ యాంకర్లు ఉంటాయి.

2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

హోండా ఐదవ తరం సెడాన్ లో బిఎస్ 6 కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 100 బిహెచ్‌పి మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మాత్రం 117 బిహెచ్‌పి మరియు 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ వంటివి ఉన్నాయి.

2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

భారతదేశంలో కూడా హోండా సిటీ ఆర్ఎస్ టర్బోను లాంచ్ చేయవచ్చని పుకార్లు కూడా ఉన్నాయి. ఆర్ఎస్ టర్బో వేరియంట్లో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 122 బిహెచ్‌పి మరియు 173 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

ప్రస్తుత తరం మోడళ్ల ధరలను గమనించినట్లయితే ఇవి రూ. 9.91 లక్షల నుంచి రూ. 14.31 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటాయి. కానీ కొత్త 2020 హోండా సిటీ మోడళ్ల ధర రూ. 10.5 లక్షల నుంచి రూ. 16.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని ఆశించవచ్చు.

2020 కొత్త మోడల్ హోండా సిటీ : ఆవిష్కరణ, ధరలు, ఇతర వివరాలు..

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 మోడల్ హోండా సిటీ మార్చి 16 న ఆవిష్కరించబడుతుంది. హోండా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటి. కొత్త హోండా సిటీ మునుపటి తరం మోడళ్ల కంటే మెరుగైనవిగా ఉంటాయని ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda City 2020 Model To Be Unveiled On 16 March: Details, Bookings And Expected Price. Read in Telugu.
Story first published: Tuesday, February 25, 2020, 10:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X