2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, వచ్చే ఏడాది భారత మార్కెట్లో తమ సరికొత్త 2021 'ఎక్స్‌యూవీ500' ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని విడదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసినదే. మహీంద్రా ఇప్పటికే, ఈ కొత్త తరం మోడల్‌ను తుదిదశ టెస్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

కాగా, ఇప్పుడు అందిన తాజా సమాచారం ప్రకారం, కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో అబ్బురపరచే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. హై-ఎండ్ లగ్జరీ కార్లలో కనిపించే కొన్ని రకాల సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఫీచర్లు ఈ కొత్త ఎక్స్‌యూవీ500లో కూడా లభించే అవకాశం ఉంది.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

ప్రస్తుతం మార్కెట్లో హై-టెక్ ఫీచర్లు కలిగిన కార్లకు డిమాండ్ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా కూడా తమ కార్లు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లపై పనిచేస్తోంది, ఇలాంటి ఫీచర్లు ఇంతకు ముందు భారతదేశంలో ఏ కారులోనూ అందించబడలేదు.

MOST READ:రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్‌జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

మహీంద్రా అభివృద్ధి చేస్తున్న సాంకేతికతలు మరియు ఫీచర్లు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. బహుశా ఇందులో అన్ని ఫీచర్లు ఉత్పత్తి దశకు చేరుకోకపోవచ్చు. కానీ, రాబోయే కొన్నేళ్లలో మహీంద్రా తమ భవిష్యత్ వాహనాల్లో ఈ ఫీచర్లను ఉపయోగించే అవకాశం మాత్రం లేకపోలేదు.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

మహీంద్రా అభివృద్ధి చేస్తున్న ఆధునిక ఫీచర్లలో ఒకటి పాట్‌హోల్స్ (రోడ్డుపై గుంతలను) గుర్తించే టెక్నాలజీ. ఇందుకోసం కంపెనీ ఓ హైటెక్ రాడార్ యూనిట్‌ను అభివృద్ధి చేస్తోంది. రియల్ వరల్డ్‌లో అయితే, ఈ ఫీచర్ డ్రైవర్ అవసరం లేని ఆటోమేటిక్ కార్లకు అనువుగా ఉంటుంది. ఇలాంటి అలెర్ట్స్ వలన డ్రైవర్ పరధ్యానానికి గురయ్యే ప్రమాదం ఉంది.

MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

అంతేకాకుండా, ఇంలాంటి హెచ్చరికలు డ్రైవర్‌ను భయాందోళనలకు గురిచేసి, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఫలితంగా ప్రమాదాలు మరింత పెరిగే ఆస్కారం ఉంది. ట్రాఫిక్, వేగం, డ్రైవింగ్ పరిస్థితులు మొదలైన గణాంకాలను అధ్యయనం చేసే సెల్ఫ్ డ్రైవ్ అటానమస్ కార్లయితే ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

ఇక మహీంద్రా అభివృద్ధి చేస్తున్న మరో అద్భుతమైన టెక్నాలజీ అటానమస్ బ్రేకింగ్. డ్రైవర్ అవసరం లేకుండానే, పరిస్థితులను అధ్యయనం చేసి ఆటోమేటిక్‌గా బ్రేక్ వేయటం దీని ప్రత్యేకత. ఆటోమొబైల్ పరిశ్రమలో ఈ తరహా టెక్నాలజీ కొత్తది కాకపోయిప్పటికీ, ఇది భారతదేశంలో లభించే మధ్యతరహా ఎస్‌యూవీ విభాగంలో మాత్రం మొదటిదనే చెప్పాలి.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

ఇందులో మరొక టెక్నాలజీ కనురెప్పలను ట్రాక్ చేసే విధానం. బహుశా ఇది కూడా ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. డ్రైవర్ నిద్రపోతున్నాడో లేదో అనే విషయాన్ని గుర్తించి, వారిని అప్రమత్తం చేసేందుకు ఈ టెక్నాలజీ సహకరిస్తుంది. ఇందులోని సెన్సార్లు డ్రైవర్ కనురెప్పలను నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఇది నిద్ర సంకేతాలను గుర్తించి, వాయిస్ కమాండ్స్‌తో డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

మహీంద్రా అభివృద్ధి చేస్తున్న మరియు ఆచరణాత్మకమైన మరొక ఫీచర్ 3డి పానోరమిక్ విజన్. ఇది కారు చుట్టుప్రక్కల ఉండే పరిసరాల గురించి స్పష్టమైన అవగాహన పొందడంలో డైవర్‌కి సహకరిస్తుంది. అలాగే, నెక్స్ట్-జెన్ ఎక్స్‌యూవీ500 యూజర్ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసిన ప్రీ-సెట్ ప్రాధాన్యతలతో కారులోని ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో పాటు వివిధ ఫంక్షన్లను కూడా నియంత్రించే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది.

MOST READ:ఇటీవలి కాలంలో కార్లలో అత్యంత పాపులర్ అయిన టాప్-5 టెక్నాలజీలు

2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500లో అధునాత టెక్నాలజీ ఫీచర్లు!

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 విషయానికి వస్తే, దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ మాత్రం చిరుత నుండి ప్రేరణ పొందిన మొదటి తరం మోడల్ డిజైన్ సిల్హౌట్ మాదిరిగానే కొనసాగించే అవకాశం ఉంది. అయితే దీని బోనెట్, బంపర్, గ్రిల్, ల్యాంప్ సెటప్, అల్లాయ్ వీల్స్ మరియు వెనుక డిజైన్లలో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. అలాగే, ఇంటీరియర్స్ మరియు ఇంజన్ ఆప్షన్లలో కూడా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.

Most Read Articles

English summary
According to the recent reports, All-New 2021 Mahindra XUV500 will get some advanced electronic features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X