కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

హోండా నుంచి ఓ సరికొత్త సిటీ సెడాన్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఇప్పటికే హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) భారత్‌లో తమ సరికొత్త 5వ తరం 'హోండా సిటీ' సెడాన్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న హోండా ప్లాంట్‌లో ఈ కొత్త కారును తయారు చేస్తున్నారు.

కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, దాని నివారణకు ప్రభుత్వం ప్రకటించిన అన్ని నిబంధనలను అనుసరించి హెచ్‌సిఐఎల్ ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. కాగా.. ఈ సరికొత్త హోండా సిటీ సెడాన్ వచ్చే నెలలో మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

హోండా సిటీ సెడాన్ ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో ప్రారంభించబోయే ఆల్-న్యూ ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ ఉత్పత్తిని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, గడచిన 22 ఏళ్లలో 4 తరాలను చూసిన ఈ మోడల్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించిందని అన్నారు.

కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

వైరస్ వ్యాప్తి తర్వాత ప్రస్తుత మార్కెట్‌లో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ 5వ తరం హోండా సిటీ ప్రీ-లాంచ్ దశకు చేరుకోవటం తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. ఈ సరికొత్త హోండా సిటీ సెడాన్ డిజైన్, టెక్నాలజీ మరియు ఫీచర్లను డిజైన్ చేయటంలో తమ ఇంజనీర్లు అద్భుతంగా పనిచేశారని, ఇది ఆధునిక యుగపు వినియోగదారులను గట్టిగా ఆకర్షిస్తుందని గోయెల్ ధీమా వ్యక్తం చేశారు.

కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

హోండా విడుదల చేయనున్న ఈ సరికొత్త 5వ తరం సిటీ సెడాన్‌లో పూర్తి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ (సిరీస్‌లో ఉంచిన తొమ్మిది లైట్లతో), అందులోనే అమర్చిన ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్‌ఎల్), ముందు భాగంలో L-ఆకారపు ఎల్ఈడి టర్న్ సిగ్నల్స్, వెనుక వైపు Z ఆకారపు వ్రాప్-అరౌండ్ ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్ మరియు డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో 19 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి కీలక మార్పులు ఉన్నాయి.

కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

ఈ కారు లోపలి భాగంలో మార్పుల విషయానికి వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే‌ ఫీచర్లను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, సరికొత్త డాష్‌బోర్డ్ డిజైన్ వంటి మార్పులు ఉన్నాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సెగ్మెంట్‌లో కెల్లా తొలిసారిగా అలెక్సా రిమోట్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌తో వస్తుంది. మరియు హోండా బ్రాండ్ యొక్క సరికొత్త కనెక్టింగ్ టెక్నాలజీ అయిన టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్ (టిసియు)ను కూడా సపోర్ట్ చేస్తుంది, ఇది 32కి పైగా కనెక్టింగ్ ఫీచర్లను అందిస్తుంది.

కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

ఇంటీరియర్స్ ఫీచర్లలోని మరికొన్ని మార్పులను గమనిస్తే, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఇరువైపులా అనలాగ్ డయల్స్ ఉన్న 7-ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే, ప్యాడల్ షిఫ్టర్స్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రివైజ్ చేసిన క్లైమేట్ కంట్రోల్, రియర్ సన్ షేడ్ మరియు యాంబియెంట్ లైటింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

హోండా సిటీలోని ఫీచర్లను గమనిస్తే, ఇందులో హ్యాండ్లింగ్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డ్యూయెల్ ఫ్రంట్ ఐ-ఎస్ఆర్ఎస్ ఎయిర్‌ బ్యాగ్స్, లెఫ్ట్-వింగ్ మిర్రర్‌పై లేన్-మానిటరింగ్ కెమెరా (ఇది సెంటర్ స్క్రీన్‌కు ఫీడ్‌ను రిలే చేస్తుంది), వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లున్నాయి.

కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2020 హోండా సిటీకి కారులో 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లను బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఆఫర్ చేస్తున్నారు. ఇందులోని 1.5-లీటర్ ఐ-విటెక్ (డిఓహెచ్‌సి) పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 120bhp శక్తిని మరియు 145Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజిల్ యూనిట్ 100bhp శక్తిని మరియు 200Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు యూనిట్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. పెట్రోల్ వేరియంట్‌లలో 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షనల్‌గా లభ్యం కానుంది.

కొత్త హోండా సిటీ ఉత్పత్తి ప్రారంభం, త్వరలో విడుదల - వివరాలు

సరికొత్త తరం 2020 హోండా సిటీ సెడాన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

గడచిన 22 ఏళ్ల హోండా సిటీ కారును ఇప్పటి వరకూ 4 సార్లు పూర్తిగా రీడిజైన్ చేశారు. కాగా.. ఇప్పుడు 5వ సారి అప్‌డేట్ కానున్న కొత్తం 2020 హోండా సిటీ సెడాన్ కారుపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగా హోండా బెస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లతో ఈ కారును తయారు చేసింది. కొత్త హోండా సిటీ ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ వెర్నా, స్కోడా రాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, టొయోటా యారిస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 24, 2020, 15:31 [IST]
English summary
Honda Cars India Ltd. (HCIL) has commenced the production of the all-new 5th Generation Honda City in India. The car is being manufactured at its production plant in Greater Noida plant, Uttar-Pradesh. Read in Telugu.
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+