Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 23 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Sports
IPL 2021: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం! ఆడేది అనుమానమే!
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
40 రోజుల్లోనే 30 వేల బుకింగ్స్ దక్కించుకున్న కొత్త హ్యుందాయ్ ఐ20
హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న సరికొత్త 2020 హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌కు మార్కెట్ నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన 40 రోజుల్లోనే 30,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 కోసం అక్టోబర్ 28, 2020వ తేదీ నుండి అధికారికంగా బుకింగ్‌లను ప్రారంభించారు. దీంతో, ఈ మోడల్ విడుదల సమయం నాటికే 10,000కి పైగా ప్రీ-బుకింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత నవంబర్ 5, 2020వ తేదీన ఈ కారును భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ మరో 20,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు, వెరసి మొత్తంగా 30,000 యూనిట్లకు బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ వివరించింది.

హ్యుందాయ్ విడుదల చేసిన ఈ సరికొత్త ఐ20 కారు ప్రస్తుతం మార్కెట్లో మూడవ తరానికి చెందిన మోడల్. హ్యుందాయ్ ఐ20 కారుని కంపెనీ పూర్తిగా సరికొత్త స్టైలింగ్‌తో దాని సరికొత్త గ్లోబల్ డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా రూపొందించింది. ఫలితంగా, ఇది మునుపటి కన్నా మరింత స్టైలిష్‌గా, ప్రీమియంగా మరియు స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో విశిష్టమైన ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది. పెట్రోల్ ఇంజన్లలో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ యూనిట్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే, ఇందులో 1.5 లీటర్ డీజిల్ యూనిట్ కూడా అందుబాటులో ఉంది.

ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అదేవిధంగా, ఇందులోని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి లేదా 6-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇకపోతే, డీజిల్ వెర్షన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.
MOST READ:టైటానికి షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

మార్కెట్లో కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా మరియు ఆస్టా (ఆప్షనల్) అనే నాలుగు వేరియంట్లలో అందిస్తున్నారు. వీటి ధరలు రూ.6.79 లక్షల నుండి రూ.11.17 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. కొత్తగా ఈ కారును బుక్ చేసుకోవాలనుకునే వారు రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 కారులో ముందు భాగంలో పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్, షార్ప్‌గా కనిపించే ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, జెడ్ ఆకారంలో ఉండే ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఫ్రంట్ బంపర్‌పై త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వనున్న సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్పోర్టి స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ స్పీకర్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఇప్పటి వరకూ 10,000 యూనిట్లకు పైగా కొత్త తరం ఐ20 కార్లను డెలివరీ చేసినట్లు పేర్కొంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు గాను కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది. కొత్త తరం ఐ20 మార్కెట్లో ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]