Just In
- 10 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 11 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 14 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 14 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా ?
ప్రపంచదేశాలతో పాటు భారతదేశం కూడా రోజు రోజుకి అభువృద్ది చెందుతోంది. ఈ తరుణంలో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. వాహనతయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ అవాహనాలను తయారు చేసి అమ్మకాలను కొనసాగిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రభుత్వాలు కూడా తమ మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచనలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో రూ. 30,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు దాదాపు 60,000 ఉద్యోగాలను సృష్టించడం కోసం సన్నాహాలను సిద్ధం చేస్తోంది. 2024 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి తయారీ విభాగాల సహకారంతో సమగ్ర పరిశోధన, అభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక కమిషన్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై తన ప్రణాళికలను సమర్పించింది.
MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ ; దీని ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

2929 నాటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన 11,000 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రవాణా, పారిశ్రామిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2024 నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరుతో సహా నాలుగు నగరాల్లో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిలిపివేయాలని జగన్ ప్రభుత్వం తెలిపింది. 2030 నాటికి అన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా నిలిపివేయనున్నారు. అంతే కాకుండా 2024 నాటికి లక్ష ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు.
MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ స్టేషన్ల కొరత ఉంది. ఈ కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి కొంతవరకు వెనుకాడతారు. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని సమావేశానికి హాజరైన అధికారులు తెలిపారు. సాధారణంగా పెట్రోల్, డీజిల్ వాహనాలు పర్యావరనానికి ఎక్కువ నష్టం కలిగిస్తాయి. తద్వారా రాబోయే కాలంలో ఎక్కువ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ కారణంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది.
MOST READ:టైటానికి షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా ముడి చమురు దిగుమతులను కూడా తగ్గించవచ్చు. దిగుమతులు తగ్గడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కొంతవరకు ముందుకు వెళ్తుంది. ఈ కారణంగా, కర్ణాటక, కేరళ, ఢిల్లీ వంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి దారులు, కొనుగోలుదారులకు వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నారు.
Note: Images used are for representational purpose only.