ఆగస్టు 27 న భారత్‌లో అడుగుపెట్టనున్న ఆడి ఆర్ఎస్ క్యూ 8

లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన హై పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ ఆడి ఆర్‌ఎస్ క్యూ 8 కోసం గత వారం బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు ఆడి ఇండియా ఈ కొత్త పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని విడుదల చేసిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ పేజీలో పంచుకుంది. దీని గురించి పూర్తి సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం.

ఆగస్టు 27 న భారత్‌లో అడుగుపెట్టనున్న ఆడి ఆర్ఎస్ క్యూ 8

ఆడి ఆర్‌ఎస్ క్యూ 8 పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని 2020 ఆగస్టు 27 న ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఆడి కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వెల్లడించింది. కానీ ఈ కారు ధర గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

ఆగస్టు 27 న భారత్‌లో అడుగుపెట్టనున్న ఆడి ఆర్ఎస్ క్యూ 8

ఆడి ఆర్ఎస్ క్యూ 8 ఎస్‌యూవీని కంపెనీ డీలర్‌షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి రూ.15 లక్షలతో ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇటీవల సంస్థ తన ఆర్ఎస్ క్యూ 8 టీజర్‌ను కూడా విడుదల చేసింది.

MOST READ:సెక్యూరిటీ లేకుండా రోడ్ మీద బెంజ్ కారు డ్రైవ్ చేస్తున్న రతన్ టాటా [వీడియో]

ఆగస్టు 27 న భారత్‌లో అడుగుపెట్టనున్న ఆడి ఆర్ఎస్ క్యూ 8

ఆడి ఆర్ఎస్ క్యూ 8 సంస్థ యొక్క పెర్ఫార్మెన్స్ వెర్షన్. 2019 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఆడి ఆర్ఎస్ క్యూ 8 ను కంపెనీ ప్రదర్శించింది. ఈ ఎస్‌యూవీ ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీగా నిలిచింది.

ఆగస్టు 27 న భారత్‌లో అడుగుపెట్టనున్న ఆడి ఆర్ఎస్ క్యూ 8

ఆడి ఆర్ఎస్ క్యూ 8 ఎస్‌యూవీ 4.0 లీటర్ ట్విన్-టర్బో వి 8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 600 బిహెచ్‌పి శక్తిని మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. సచిన్ టెండూల్కర్ మొదటి కార్, ఇదే

ఆగస్టు 27 న భారత్‌లో అడుగుపెట్టనున్న ఆడి ఆర్ఎస్ క్యూ 8

ఈ కారులో సంస్థ తన సిగ్నేచర్ క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టంను ఉపయోగించింది. ఈ కారు కేవలం 3.8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు యొక్క వెలుపలి భాగాన్ని రెగ్యులర్ మోడల్ నుండి వేరు చేయడానికి కంపెనీ కొన్ని మార్పులు చేసింది.

ఆగస్టు 27 న భారత్‌లో అడుగుపెట్టనున్న ఆడి ఆర్ఎస్ క్యూ 8

ఈ మార్పులలో ఫ్రంట్ ఫాసియా, కొత్త సింగిల్-ఫ్రేమ్ గ్రిల్, పునఃరూపకల్పన చేసిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్స్ మరియు ఆర్ఎస్-స్పెక్ స్పాయిలర్ ఉన్నాయి. లోపల స్పోర్ట్ సీట్లు, ఆర్ఎస్-స్పెక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వంటివి ఇందులో ఉంటాయి.

MOST READ:ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉపయోగించనున్న కొత్త కార్స్ : ఫోర్స్ ట్రాక్స్ టైఫూన్

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi India Revealed Launch Date Of RS Q8 Performance SUV Features Engine Details. Read in Telugu.
Story first published: Thursday, August 20, 2020, 16:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X