భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా, భారత మార్కెట్లో తమ సరికొత్త "ఆర్ఎస్ క్యూ8" ఎస్‌యూవీని విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్లో అందిస్తున్న స్టాండర్డ్ ఆడి క్యూ8 మోడల్‌కు పెర్ఫార్మెన్స్ వెర్షనే ఈ కొత్త 2020 ఆడి ఆర్ఎస్ క్యూ8.

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఆడి ఆర్ఎస్ క్యూ8 ప్రస్తుతం 7 నిమిషాల 42 సెకన్ల సమయంతో నూర్‌బర్గ్‌రింగ్ నార్డ్స్‌క్లీఫ్ ట్రాక్‌ను చుట్టిన ఎస్‌యూవీగా రికార్డు సృష్టించింది. ఆడి ఇండియా, దేశీయ మార్కెట్లో తమ ‘ఆర్‌ఎస్' మోడళ్లను విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఈ పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ పనితీరు విషయానికి వస్తే, ఇందులో 4.0 లీటర్ ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ అత్యధికంగా 600 బిహెచ్‌పి శక్తిని మరియు 800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆడి లైనప్‌లో ఇదే అత్యంత శక్తివంతమైన 'క్యూ' సిరీస్ ఎస్‌యూవీ.

MOST READ: కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఈ ఇంజన్ 8-స్పీడ్ టిప్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఆడి బ్రాండ్ సిగ్నేచర్ క్వాట్రో (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్ ద్వారా ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తిని మొత్తం నాలుగు చక్రాలకు సమానంగా శక్తిని పంపిణీ చేయబడుతుంది.

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

కొత్త 2020 ఆడి ఆర్ఎస్ క్యూ8 గరిష్ట వేగాన్ని (టాప్-స్పీడ్) యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. అయితే, ఆడి ఈ ఎస్‌యూవీని ఆప్షనల్ ఆర్ఎస్ డైనమిక్ ప్యాకేజీ ప్లస్‌తో అందిస్తుంది, దీంతో ఆర్ఎస్ క్యూ8 టాప్ స్పీడ్ గంటకు 305 కిలోమీటర్లకు పెరుగుతుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 3.8 సెకన్లలోనే గంటకు 0 - 100 కి.మీ వేగంతో పరుగులు తీయగలదు.

MOST READ: భారత్‌లో డ్యుకాటి పానిగేల్ వి2 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఆడి ఆర్ఎస్ క్యూ8 అత్యుత్తమ పనితీరు మరియు స్పోర్ట్‌నెస్‌తో కేవలం సందర్భానుసారంగా డ్రైవ్ చేయటానికే కాకుండా, రోజువారీ వినియోగానికి కూడా ఉద్దేశించబడినది. ఇందులోని ఇంజన్ 48వి మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ (ఎమ్‌హెచ్‌ఈవి) తో జతచేయబడి ఉంటుంది. ఇది అధిక సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆర్ఎస్ క్యూ8 కూడా సిలిండర్-డీయాక్టివేషన్‌తో లభిస్తుంది. ఆడి దీనినే ‘సిలిండర్ ఆన్ డిమాండ్ (సిఓడి)' టెక్నాలజీ అని కూడా పిలుస్తుంది. ఈ టెక్నాలజీలో తక్కువ శక్తిని ఉత్పత్తి చేయడానికి మరియు ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సిలిండర్లను స్విచ్ ఆఫ్ చేసే సౌలభ్యం ఉంటుంది.

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

స్టాండర్డ్ ఆడి క్యూ8 కారులో కనిపించే చాలా వరకు ఫీచర్లు, పరికరాలు మరియు టెక్నాలజీలను కొత్త ఆడి ఆర్ఎస్ క్యూ8 కారులోనూ కనిపిస్తాయి. అయితే, ఇది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మోడల్ అయిన నేపథ్యంలో, దీనికి మరింత అదనపు స్పోర్టీ లుక్‌ని ఇచ్చేందుకు ఇందులో కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి.

MOST READ: ముంబైలో విడుదల కానున్న రివోల్ట్ ఆర్‌వి300, ఆర్‌వి400 ఎలక్ట్రిక్ బైక్స్

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఇందులో ప్రధానంగా ఆల్-వీల్ స్టీరింగ్, ఆర్ఎస్ రూఫ్ స్పాయిలర్, క్వాట్రో విత్ సెల్ఫ్ లాకింగ్ డిఫరెన్షియల్, స్పోర్ట్ అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, పర్సనలైజ్డ్ డ్రైవ్ సెట్టింగ్ కోసం రెండు ఆర్ఎస్ మోడ్స్, 23 ఇంచ్ ఫైవ్-స్పోక్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆడిస్ వర్చువల్ కాక్‌పిట్ వంటి వాటిని చెప్పుకోవచ్చు.

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

వీటికి అదనంగా ఆప్షనల్ ఎక్స్‌ట్రా ఫీచర్లుగా, ఆడి ఆర్ఎస్ క్యూ8 బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీని కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, మ్యాట్రిక్స్ ఎల్‌ఈడి హెడ్‌లైట్స్, స్పోర్ట్స్ ఎగ్జాస్ట్, 3డి సౌండ్‌తో కూడిన బి అండ్ ఓ సౌండ్ సిస్టమ్ మరియు ఆర్ఎస్ డైనమిక్ ప్యాకేజీ (టాప్ స్పీడ్ పెంచుకోవటానికి) వంటి ఆప్షనల్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

MOST READ: మహీంద్రా మరాజో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఇక అసలు విషయం, అదేనండి ధర విషయానికి వస్తే, భారత మార్కెట్లో ఈ మోడల్ ధర రూ.2.07 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) మాత్రమే. ఈ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని ఆడి డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి.

భారత్‌లో ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదల, ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఆడి ఆర్ఎస్ క్యూ8 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ క్యూ8 ఎస్‌యూవీకి హైపెర్ఫార్మెన్స్ ఇంజన్ జోడించిన అధిక పనితీరు వేరియంటే ఈ కొత్తఆడి ఆర్‌ఎస్ క్యూ8. ఈ మోడల్ ఇప్పటికే రేస్ ట్రాక్‌పై రికార్డ్ సృష్టించి ఉంది. ఇది ఈ విభాగంలో బెంట్లీ బెంటెగా మరియు లంబోర్ఘిని ఉరుస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi has launched the RS Q8 SUV in the Indian market. The new Audi RS Q8 is essentially the performance-oriented version of the standard Q8 and is priced at Rs 2.07 crore, ex-showroom (India). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X