ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, భారత మార్కెట్లో మరో సరికొత్త స్పోర్టీరియర్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆడి తమ సరికొత్త 'ఆర్‌ఎస్ క్యూ8' మోడల్ టీజర్‌ను విడుదల చేసింది. కంపెనీ షేర్ చేసిన టీజర్‌ను చూస్తుంటే, త్వరలోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదల అవుతుందని తెలుస్తోంది.

ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఆడి గతంలో తమ ఆర్‌ఎస్7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, భారత మార్కెట్ కోసం మరిన్ని ఆర్‌ఎస్ మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ జర్మన్ బ్రాండ్ నుంచి రానున్న సరికొత్త ఆడి ఆర్ఎస్ క్యూ8 ఎస్‌యూవీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెగ్యుల్ ఆడి క్యూ8 కన్నా అధిక పనితీరు అందించే పెర్ఫార్మెన్స్ వేరియంట్‌గా ఉంటుంది.

ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

స్టాండర్డ్ ఆడి క్యూ8 కారును 2019లో లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఆవిష్కరించారు. ఈ మోడల్ ప్రస్తుతం 7 నిమిషాల 42.2 సెకన్ల ల్యాప్ టైమ్‌తో జర్మన్‌లోని నూర్‌బర్గింగ్ సర్క్యూట్లో అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీ రికార్డును స్థాపించింది.

MOST READ:కెమెరాకు చిక్కిన బిఎస్ 6 ఇసుజు వి క్రాస్, ఎలా ఉందో చూసారా !

ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

రెగ్యులర్ క్యూ8తో పోల్చుకుంటే ఆర్ఎస్ క్యూ8 భిన్నంగా కనిపించేందుకు దీని ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా సింగిల్-ఫ్రేమ్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్ మరియు ఆర్ఎస్-స్పెక్ స్పాయిలర్ వంటివి చెప్పుకోవచ్చు. ఆడి ఆర్ఎస్ క్యూ8 మోడల్ చాలా అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ ఫాసియాతో రానుంది.

ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఆడి ఆర్ఎస్ క్యూ8 కారులో లో 22 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కూడా స్టాండర్డ్‌గా రానున్నాయి, ఇందులో 23 ఇంచ్ వీల్స్ కూడా ఆప్షనల్‌గా లభిస్తాయి. ఇంటీరియర్స్ విషయానికి వస్తే, స్పోర్టీ సీట్స్, లెథర్ అండ్ అల్కాంటారా ఎలిమెంట్స్, ఆర్ఎస్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు వర్చువల్ కాక్‌పిట్ వంటి మార్పులు ఉండనున్నాయి.

MOST READ:కొత్త కారును దొంగిలించడానికి హ్యుందాయ్ మాజీ ఉద్యోగి స్కెచ్ ; ఇలాంటి దొంగతనం ఇప్పటివరకు చూసి ఉండరు

ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఆడి ఆర్ఎస్ క్యూ8 కారులో 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్‌‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 600 బిహెచ్‌పి శక్తిని మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది. ఈ గేర్‌బాక్స్ బ్రాండ్ యొక్క పాపులర్ క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఇంజన్ నుంచి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపణీ చేస్తుంది.

ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఇక ఆడి బ్రాండ్‌కి సంబంధించిన ఇతర వార్తను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవల తమ అధునాతన ఆర్ఎస్7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.1.94 కోట్ల ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదలైన ఈ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇక్కడి మార్కెట్‌కు దిగుమతి చేసుకోనున్నారు.

MOST READ:సైక్లిస్ట్ కల సహకారం చేసుకోవడానికి స్కూల్ విద్యార్థికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన భారత రాష్ట్రపతి

ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఆడి ఆర్ఎస్7 స్పోర్ట్‌బ్యాక్ ముందు భాగంలో బ్లాక్-అవుట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్‌లు, 21-ఇంచ్ వీల్స్, రియర్ డిఫ్యూజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో వర్చువల్ కాక్‌పిట్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆర్‌ఎస్ స్పెసిఫిక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు అల్యూమినియం పాడిల్ షిఫ్టర్లు మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఆడి ఆర్ఎస్ క్యూ8 టీజర్ రిలీజ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆడి ఆర్ఎస్ క్యూ8 నూర్‌బర్గ్‌రింగ్‌లో అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీగా పేరు దక్కించుకోవటం నిజంగా గొప్ప విషయం.

కలిగి ఉండటం వేరే విషయం. ఈ కారు చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది, ఇది ఆడి బ్రాండ్‌కు ఖచ్చితంగా మరిన్ని విజయాలను తెచ్చిపెట్టగలదనేది మా అభిప్రాయం.

MOST READ:కొడుకు ఇచ్చిన ఐడియాతో తండ్రి సృష్టించిన ఎలక్ట్రిక్ సైకిల్ ; చూసారా..!

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
German auto manufacturer Audi has released a teaser of the new RS Q8 model ahead of its India launch. The teaser shared by the company hints that a launch is expected soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X