భారత్‌లో లాంచ్ అయిన కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ ; దీని రేటెంతో తెలుసా ?

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ఆడి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తన బ్రాండ్ ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌ను విఫణిలో విడుదల చేసింది. కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 1.94 కోట్లు (ఎక్స్‌షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

 కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ : ధర & ఇతర వివరాలు

ఇప్పటికే మార్కెట్లో ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కొత్త స్పోర్ట్‌బ్యాక్‌ను ఆన్‌లైన్ ద్వారా లేదా భారతదేశం అంతటా ఏదైనా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 10 లక్షలకు బుక్ చేసుకోవచ్చు.

 కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ : ధర & ఇతర వివరాలు

భారతదేశంలో ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ డెలివరీలు ఆగస్టు 2020 నుండి ప్రారంభమవుతాయని ఆడి సంస్థ ధృవీకరించింది. సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ భారత మార్కెట్లోకి దిగుమతి అవుతుంది.

MOST READ:భారత్‌లో లాంచ్ కానున్న కొత్త యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్.. చూసారా !

 కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ : ధర & ఇతర వివరాలు

కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌లో 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 8 పెట్రోల్ ఇంజన్. ఇది 592 bhp మరియు 800 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

 కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ : ధర & ఇతర వివరాలు

ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కూడా బ్లిస్టరింగ్ వేగాన్ని అందిస్తుందని పేర్కొంది, ఇది కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ / గం చేరుకోగలదు. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకి 250 కిలోమీటర్లు. అప్సనల్ డైనమిక్ లేదా డైనమిక్ ప్లస్ ప్యాకేజీలతో టాప్ స్పీడ్‌ను 280 కి.మీ / గం లేదా 305 కి.మీ / గం వరకు పెంచుకోవచ్చు.

MOST READ:గుంటలో పడిన కారును బయటకు తీసిన ఏనుగు [వీడియో]

 కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ : ధర & ఇతర వివరాలు

ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ లోపల మరియు వెలుపల అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఎయిర్ డ్యామ్, ఎల్‌ఈడీ లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఎల్‌ఈడీ టైల్లైట్స్, జంట ఓవల్ ఆకారపు ఎగ్జాస్ట్ టిప్స్ తో వెనుక డిఫ్యూజర్ మరియు ఇతరుల హోస్ట్ వంటివి ఉంటాయి.

 కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ : ధర & ఇతర వివరాలు

ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ లోపల వర్చువల్ కాక్‌పిట్‌తో వస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్పోర్టి అల్కాంటారా అప్హోల్స్టరీ, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఆర్ఎస్ స్పోర్ట్స్ సీట్లు, అల్యూమినియం పాడిల్ షిఫ్టర్లు, హెడ్స్-అప్ డిస్ప్లే కూడా ఉన్నాయి.

MOST READ:ఇప్పుడే చూడండి.. కైలాష్ యాత్రకు కొత్త రహదారి ఇదే

 కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ : ధర & ఇతర వివరాలు

దీని గురించి ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, భారతదేశంలో కొత్త ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌ను విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఇది అద్భుతమైన, శక్తివంతమైన వాహనం. ఇందులో ఉన్న వి 8 ట్విన్-టర్బో 4.0 ఎల్ టిఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ హార్ట్ 3.6 సెకన్లలో కారును 100 కిలోమీటర్ల వేగంతో నడిపిస్తుందన్నారు. ఇది వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

 కొత్త ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ : ధర & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ భారత మార్కెట్లో వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఒకటి. ఈ ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ బిఎండబ్ల్యూ ఎమ్ 5 పోటీ మరియు మెర్సిడెస్ ఎఎంజి ఇ 63 ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:టాటా సుమో గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi RS7 Sportback Launched In India At Rs 1.94 Crore. Read in Telugu.
Story first published: Thursday, July 16, 2020, 15:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X