2020 క్రెటా ఎస్‌యూవీని ఆవిష్కరించిన హ్యుందాయ్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హ్యుందాయ్ క్రెటా ఎట్టకేలకు 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. హ్యుందాయ్ క్రెటా యొక్క బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. క్రెటా ధరలు ఈ సంవత్సరం మార్చి కల్లా ప్రకటించనున్నారు.

సరికొత్త హ్యుందాయ్ క్రెటా పూర్తిగా పునరుద్ధరించిన డిజైన్‌తో వస్తుంది, ఇది ఐఎక్స్ 25 మోడల్ నుండి ప్రేరణ పొందింది. హ్యుండై క్రెటా గత సంవత్సరం బీజింగ్ జరిగిన ఆటో షోలో ప్రదర్శించబడింది. ముందు నుండి ప్రారంభించిన క్రెటా ఇప్పుడు పెద్ద అప్‌డేటెడ్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది.

2020 హ్యుందాయ్ క్రెటా లో వెనుక ప్రొఫైల్ కూడా బాగా అప్డేట్ చేయబడింది. ఈ కొత్త క్రెటాలోని ఎల్‌ఈడీ టైల్లైట్‌లు హెడ్‌ల్యాంప్‌ల మాదిరిగానే ఉంటాయి. ఈ కారు బూట్ మధ్యలో ఒక సన్నని ఎల్ఈడి స్క్రిప్ ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ ప్రాంతానికి కొంచెం పైన 'సి ఆర్ ఇ టి ఎ' అనే పేరుని కలిగి ఉంటుంది. వెనుక ఉండే బంపర్లు బూడిదరంగులో ఉంటాయి.

హ్యుందాయ్ క్రెటాలో ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే ఇందులో బిఎస్-6 కంప్లైంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇంజిన్ల విషయంలో ఇది కియా సెల్టోస్ ని అనుసరిస్తుంది.

క్రెటాలో 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇది 115 బిహెచ్‌పి మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ కూడా 1.5 లీటర్ డీజిల్ ని కలిగి ఉండి 115 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉన్న 1.4 లీటర్ టి-జిడిఐ టర్బో-పెట్రోల్ యూనిట్ కూడా 140 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మాదిరిగానే నాలుగు ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ యూనిట్ కి జతచేయబడి ఉంటుంది.

కొత్త హ్యుందాయ్ క్రెటాలో ఫీచర్స్ మరియు భద్రతా లక్షణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఎయిర్ ప్యూరిఫైయర్, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యువిలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. అదే విధంగా అధికంగా అమ్ముడైన మిడ్ సైజు ఎస్‌యువిగా కూడా నిలిచింది. కియా సెల్టోస్ ప్రారంభించినప్పటినుంచి హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. 2020 కొత్త హ్యుండై క్రెటాని మార్కెట్లో విడుదల చేసిన తర్వాత మళ్ళీ అమ్మకాలలో అగ్రస్థానాన్ని పొందుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








