బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్‌టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) మరియు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) బిఎస్ 4 వాహనాల అమ్మకాలను పొడిగించాలని కోరుతూ భారత సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బిఎస్ 4 వాహనాల అమ్మకాల గడువు ప్రస్తుతం మార్చి 31 కి ముగియనుంది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ వల్ల ఈ గడువును పొడిగించాలని ఆశిస్తున్నారు.

బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్‌టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?

సాధారణంగా బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా వాహనాలు అప్డేట్ చేయడానికి నిర్దేశించిన గడువు 2020 ఏప్రిల్ 1. అంటే ఈ గడువు తరువాత బిఎస్ 4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయలేము. దీని కారణంగా ఆటో తయారీదారులు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందువల్ల ముందుగానే బిఎస్-6 వాహనాలను ముందుగానే మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్‌టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?

కరోనా వైరస్ ప్రభావం వల్ల బిఎస్-4 వాహనాలను బిఎస్-6 వాహనాలుగా మార్చడం కష్టంతో కూడుకున్న పని. కానీ ఈ వైరస్ ప్రభావం వల్ల బిఎస్-4 వాహనాలను తొందరగా విక్రయించలేకపోతున్నారు. ఈ కారణంగా డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్‌టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?

దీనికి ప్రతిస్పందనగా మార్చి 31 వరకు కాకుండా ఇంకా కొంత ఈకువ సమయాన్ని, బిఎస్ 4 వాహనాల అమ్మకాలు మరియు రిజిస్ట్రేషన్ కొనసాగించడానికి అనుమతి కోరుతూ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) పిటిషన్ దాఖలు చేశారు. బిఎస్ 4 నమోదు కోసం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దరఖాస్తులను నిరాకరిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొంది.

బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్‌టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) నుండి వచ్చిన పిటిషన్ ప్రకారం బిఎస్ 4 గడువును మే 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఆటోమోటివ్ మందగించడం మరియు ఇటీవల కొరోనావైరస్ వ్యాప్తి చెందడం వల్ల డీలర్లు తక్కువ అమ్మకాలను మాత్రమే చేపడుతున్నారు.

బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్‌టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?

ప్రస్తుత పరిస్థితిలో కరోనా వైరస్ అకస్మాత్తుగా వ్యాపించడం వల్ల దేశంలో ఆటో పరిశ్రమకు కొంత తీవ్ర ఇబ్బంది కలిగించింది. ఇది ఆటో పరిశ్రమ బిఎస్ 6 కు మారడాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఆపరేషన్లను నిలిపివేయాలని భారత ప్రభుత్వం ఆటో షోరూమ్‌లు, తయారీ కర్మాగారాలను కోరింది.

బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్‌టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?

ప్రస్తుత అమ్మకాలను గమనించినట్లయితే చాల తగ్గుదల కనిపిస్తుంది. ఈ వాహనాలను విక్రయించడానికి ఇంకా కొంత సమయం కావలసి వస్తున్నది. ఈ కారణంగా కొత్త వాహనాల కోసం వేచి ఉండాల్సిన సమయం ఇంకా కొంత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది.

బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్‌టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?

ప్రస్తుతం ఆటో మొబైల్ కి సంబంధించిన వార్తల ప్రకారం వోక్స్ వ్యాగన్ గ్రూప్ తన యూరోపియన్ కార్యకలాపాలను తదుపరి నోటీసు విడుదలయ్యే వరకు నిలిపివేసింది. జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్ మరియు స్లోవేకియాలో ఉత్పత్తి సౌకర్యాలు ఈ వారం నిలిపివేయబడతాయి.

బిఎస్ 4 వెహికల్ సేల్స్ ఎక్స్‌టెన్షన్ : జరుగుతుందా, లేదా.. ?

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ కేవలం ప్రజలను మాత్రమే కాకుండా వ్యాపారాలను కూడా ప్రభావితం చేసింది. ఈ కారణంగా వాహనాలు ఎక్కువగా అమ్ముడు కాలేదు కాబట్టి ఇంకా కొంత గడువును పొడిగించాలని డీలర్లు కోరారు. ఏది ఏమైనా భారతదేశంలో బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ గడువు కేవలం రెండు వరాలు మాత్రమే ఉంది. కానీ ఈ గడువును ఇంకొంత వరకు పెంచాలని ఆటో మొబైల్ సంస్థల వారు పిటీషన్లు దాఖలు చేసారు. ఈ పిటిషన్ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అని ఎదురు చూడాలి.

Most Read Articles

English summary
BS4 Vehicle Sales Extension Plea Filed By FADA & SIAM To Supreme Court: Details. Read in Telugu.
Story first published: Thursday, March 19, 2020, 10:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X