టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

బజాజ్ ఆటో గడచిన సంవత్సరం భారత మార్కెట్లో విడుదల చేసిన భారతదేశపు మొట్టమొదటి క్వాడ్రిసైకిల్ 'బజాజ్ క్యూట్'లో కంపెనీ ఇప్పుడు బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, సిఎన్‌జి ఇంధనంతో నడిచే వేరియంట్‌ను కంపెనీ తమ ప్లాంట్ సమీపంలో పరీక్షిస్తోంది.

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ బిఎస్6 వెర్షన్‌లో ఇంజన్ అప్‌గ్రేడ్స్ మినహా డిజైన్ మరియు ఫీచర్లు దాని మునుపటి బిఎస్4 మోడల్ మాదిరిగానే ఉంటాయని అంచనా. తాజాగా, రష్‌లేన్ విడుదల చేసిన స్పై చిత్రాల ప్రకారం, పూణేలోని బజాజ్ కంపెనీ ప్లాంట్ సమీపంలో క్యూట్ సిఎన్‌జి వేరియంట్‌ను కంపెనీ పరీక్షిస్తోంది.

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

ఈ మోడల్‌ను ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే, ఇందులో డిజైన్, ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టంగా తెలుస్తోంది. ఇంజన్ విషయానికి వస్తే, బిఎస్6 మోడల్‌లో కూడా ఇదివరకటి బిఎస్4 ఇంజన్‌నే కొత్తగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించనున్నారు.

MOST READ:భారత్‌లో కవాసకి జెడ్900 విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాలు

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

ఈ క్వాడ్రిసైకిల్‌లోని 216.6 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 13 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 18.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కాన్‌స్టాంట్ మెష్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

బజాజ్ ఆటో ఫ్యాక్టరీలో అమర్చిన సిఎన్‌జి కిట్‌తో కూడా క్యూట్‌ను అందిస్తోంది. సిఎన్‌జి మోడ్‌లోని ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.8 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ క్యూట్ గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. ఇది భారతదేశపు వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

బిఎస్4 మోడల్‌లో కనిపించిన ఫీచర్లు మరియు పరికరాలు బిఎస్6 మోడల్‌ను అలానే కొనసాగనున్నాయి. ఇందులో స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్, బ్లాక్-అవుట్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ మరియు బ్లాక్-అవుట్ రూఫ్ ఉంటుంది.

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

బిఎస్6 మోడల్ క్యూట్ ఇంటీరియర్స్‌లో కూడా దాని బిఎస్4 మోడల్ మాదిరిగానే ఉండొచ్చని అంచనా. ఇందులో డ్రైవర్‌తో పాటుగా మరో ముగ్గురు ప్రయాణీకులు కూర్చునేలా కంఫర్టబల్ సీట్స్ ఉంటాయి. డ్యాష్ బోర్డులోనే అమర్చిన గేర్ లివర్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రైమరీ ఆడియో సిస్టమ్ ఉంటాయి.

MOST READ:ఇది చూసారా.. ప్రమాదకరమైన స్థలంలో పార్కింగ్ చేయడానికి ఎగబడుతున్న ప్రజలు

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

బజాజ్ క్యూట్ 2752 మిమీ పొడవు, 1312 మిమీ వెడల్పు, 1652 మిమీ ఎత్తు మరియు 1925 మిమీ వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ క్వాడ్రిసైకిల్ టర్నింగ్ రేడియ్ 3.5 మీటర్లు. రద్దీగా ఉండే నగర వీధుల్లో డ్రైవ్ చేయటానికి చాలా అనువుగా ఉంటుంది. బజాజ్ క్యూట్‌లో ఇంజన్ వెనుక వైపు ఉంటుంది, కాబట్టి ముందు భాగంలో బోనెట్ కింద స్టోరేజ్ స్థలాన్ని కలిగి ఉంటుంది.

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

బజాజ్ క్యూట్‌ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, క్యూట్ టర్కీలో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ క్వాడ్రిసైకిల్‌ను శ్రీలంకతో పాటుగా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వేగంగా విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

బజాజ్ క్యూట్ బిఎస్4 పెట్రోల్ మోడల్ గతంలో రూ.2.48 లక్షలు మరియు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి వేరియంట్ రూ.2.78 లక్షలకు లభ్యమయ్యేది. అయితే, అప్‌డేటెడ్ మరియు క్లీనర్ ఇంజన్‌తో రానున్న బిఎస్6 బజాజ్ క్యూట్ ధర బిఎస్4 వేరియంట్ల కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది.

టెస్టింగ్ దశలో బిఎస్6 బజాజ్ క్యూట్; త్వరలో విడుదలయ్యే ఛాన్స్!

బజాజ్ క్యూట్ బిఎస్6 మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో లభిస్తున్న ఏకైక క్వాడ్రిసైకిల్ బజాజ్ క్యూట్. ఇది దేశంలోని ప్రైవేట్ వినియోగదారులకు మరియు వాణిజ్య కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. బజాజ్ క్యూట్ దాని అసాధారణమైన ఇంధన సామర్థ్యం (మైలేజ్) మరియు లో-మెయింటినెన్స్‌కు ప్రసిద్ది చెందింది. నగర ప్రయాణాలు మరియు రైడ్-హెయిలింగ్ సేవలకు ఇది అనువుగా ఉంటుంది.

Source: Rushlane

Most Read Articles

English summary
The Bajaj Qute BS6 CNG variant has been spied testing ahead of launch in the Indian market. The BS6 model of the quadricycle is not expected to change in terms of design or features over its BS4 counterpart. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X