జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

లాక్‌డౌన్ తర్వాత కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ప్రజలు వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడంతో కార్ల అమ్మకాలు పంజుకున్నాయి. ప్రత్యేకించి బడ్జెట్ కార్ విభాగంలో అమ్మకాలు ఎక్కువగా పెరిగాయి. ఈ అమ్మకాలు గడచిన సంవత్సరం జూన్ (2019) నెలతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఇవి ప్రోత్సాహకరంగానే ఉన్నాయని చెప్పాలి.

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

తాజాగా జూన్ 2020 నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌ల జాబితా విడుదలైంది. ఈ జాబితా ప్రకారం, మారుతి సుజుకి ఆల్టో గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా మారింది. ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ దేశంలో అత్యధిక అమ్మకాలను నమోదు చేయగా, ఇదే సెగ్మెంట్లోని వ్యాగన్ఆర్, బాలెనో కార్లు కూడా అత్యధికంగా అమ్ముడుపోయి ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి.

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి సుజుకి ఆల్టో హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత పాపులర్ అయిన మోడళ్లలో ఒకటి. జూన్ 2020 నెలలో, మారుతి ఆల్టో 7,298 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, ‘భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్' టైటిల్‌ను దక్కించుకుంది. అయితే, జూన్ 2019 తో పోలిస్తే మారుతి ఆల్టో అమ్మకాలు 61 శాతం తగ్గాయి, ఆ సమయంలో మొత్తం 18,733 ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి.

MOST READ: మద్యం మత్తులో మహిళపై కారు నడిపిన పోలీస్ ఇన్స్పెక్టర్, తర్వాత ఏం జరిగిందంటే?

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

ఈ జాబితాలో ద్వితీయ స్థానంలో నిలిచిన మారుతి వ్యాగన్ఆర్ గత నెలలో 6,972 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరుగా పొందిన ఈ మోడల్ గత 2019 జూన్‌లో 10,228 యూనిట్ల అమ్మకాల నమోదు చేసుకొని 32 శాతం క్షీణతను నమోదు చేసింది.

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఈ మోడల్ జూన్ 2020లో 4,300 యూనిట్లను నమోదు చేసింది, ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలతో పోలిస్తే ఇది 69 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఆ సమయంలో మొత్తం 13,689 యూనిట్లు అమ్ముడయ్యాయి.

MOST READ: కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

ఇక ఈ జాబితాలో నాల్గవ మోడల్ కూడా మారుతి బ్రాండ్ కావటం విశేషం. మారుతి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ జూన్ 2020లో 4,145 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 15 శాతం క్షీణతను నమోదు చేసుకొని 4,871 యూనిట్లు అమ్మకాలను నమోదు చేసింది.

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్. టాటా టియాగో ఇటీవలే ఫేస్‌లిఫ్ట్‌ను అందుకుంది, ఈ మోడల్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్లను అప్‌గ్రేడ్ చేయటంతో అమ్మకాలు పెరిగాయి. జూన్ 2020 నెలలో, టాటా టియాగో 4,067 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది; గత ఏడాది ఇదే నెల అమ్మకాలు 5,537 యూనిట్లతో పోలిస్తే 27 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

Rank Model June 2020 June 2019 Growth (%)
1 Maruti Alto 7,298 18,733 -61
2 Maruti WagonR 6,972 10,228 -32
3 Maruti Baleno 4,300 13,689 -69
4 Maruti Celerio 4,145 4,871 -15
5 Tata Tiago 4,069 5,537 -27
6 Maruti Swift 4,013 16,330 -75
7 Hyundai Grand i10 3,593 6,907 -48
8 Maruti S-Presso 3,160 - -
9 Tata Altroz 3,104 - -
10 Hyundai Elite i20 2,718 9,271 -71
11 Renault Kwid 2,441 4,360 -44
12 Hyundai Santro 1,513 4,141 -63

MOST READ: మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

ఈ జాబితాలో మారుతి స్విఫ్ట్ జూన్ 2020లో 4,013 యూనిట్ల అమ్మకాలతో ఆరవ స్థానంలో నిలిచింది. మంచి జనాదరణ పొందిన ఈ మారుతి హ్యాచ్‌బ్యాక్ జూన్ 2019తో పోలిస్తే 75 శాతం క్షీణతను నమోదు చేసింది, ఆ సమయంలో అమ్మకాలు 16,000 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇకపోతే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఈ లిస్ట్‌లో ఏడవ స్థానంలో ఉంది. జూన్ 2020లో హ్యుందాయ్ మొత్తం 3,593 యూనిట్ల గ్రాండ్ ఐ10 కార్లను విక్రయించింది. జూన్ 2019లో ఈ అమ్మకాలు 6,907 యూనిట్లుగా నమోదయ్యాయి, అప్పటితో పోల్చుకుంటే అమ్మకాలు 48 శాతం తగ్గాయి.

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

మారుతి ఎస్-ప్రెసో ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. మారుతి సుజుకికి చెందిన ఈ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ గత నెలలో 3,160 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. జూన్ 2020 నెలలో 2,441 యూనిట్ల అమ్మకాలతో దేశంలో కెల్లా టాప్-10 కార్లలో ఒకటిగా నిలిచింది.

MOST READ: క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

ఇకపోతే తొమ్మిదవ స్థానంలో టాటా ఆల్ట్రోజ్, పదవ స్థానంలో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లు నిలిచాయి. జూన్ 2020లో టాటా ఆల్ట్రోజ్ 3,104 యూనిట్లను నమోదు చేయగా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2,718 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

జూన్ 2020లో ఇండియాలో అత్యధికంగా సేల్ అయిన టాప్ 10 కార్లు ఇవే

భారతదేశంలో జూన్ 2020లో టాప్ 10 కార్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

తాజా ఫలితాలను చూస్తుంటే, దేశంలో కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత భారత మార్కెట్లో అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, అమ్మకాల సంఖ్య పరంగా చూసుకుంటే, తయారీదారులు మునపటిలా సాధారణ స్థితికి రావడానికి ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Sources: GaadiWaadi.com

Most Read Articles

English summary
The list of India's best-selling hatchbacks for the month of June 2020 has been released. As per the list, the Maruti Suzuki Alto has become the country's best-selling hatchback for the previous month. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more