త్వరలో ప్రారంభం కానున్న బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలకు ఒక శాపంగా తయారైంది. ఈ వైరస్ వల్ల కేవలం ప్రజలు మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమలు కూడా నష్టాలపాలయ్యాయి. ఈ వైరస్ వల్ల కొంతమంది ప్రజలు మరణించగా ఆటో పరిశ్రమలు మూసివేయబడ్డాయి.

సాధారణంగా బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ కారుని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయాల్సి ఉంది కానీ ఈ వైరస్ వ్యాప్తివల్ల విడుదల చేయనప్పటికీ ఈ కారు యొక్క పేరును మాత్రం అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ ఇప్పటికే ముగిసిన ఆటో ఎక్స్‌పో 2020 లో తొలి భారత్‌లోకి అడుగుపెట్టింది.

త్వరలో ప్రారంభం కానున్న బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే

కొత్త ఎక్స్ 7 మరియు 7 సిరీస్ లాంచ్ అయిన వెంటనే బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ లాంచ్ చేయాలనీ ఊహించింది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఈ కారణంగా దీని కోసం ఓఇంకా కొంతకాలం వేచి ఉండక త[ప్పదు.

త్వరలో ప్రారంభం కానున్న బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే

కొన్నేళ్ల క్రితం బిఎమ్‌డబ్ల్యూ తన వాహనాల పేరు మార్చారు. అందుకని వాటి పేర్లు 6 సిరీస్ మరియు 8 సిరీస్‌లుగా మార్చబడ్డాయి. 6 సిరీస్ టూ డోర్ కూపే మరియు గ్రాండ్ కూపే మోడల్స్ భారతదేశంలో అమ్ముడవుతున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ వెబ్‌సైట్‌లో చూసినట్లుగా కొత్త కూపే 12 రంగులలో విక్రయించబడుతుంది. ఈ కారును 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు అదనంగా 20-అంగుళాల అల్లాయ్ వీల్స్‌లో విక్రయించనున్నారు

త్వరలో ప్రారంభం కానున్న బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే

ఈ కారులో అడ్జస్టబుల్ ప్రెంట్ సీట్లు, వింగ్ మిర్రర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ స్లీవ్ డాష్‌బోర్డ్ ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ కారును సమర్థవంతమైన కూపేగా విడుదల చేస్తోంది.

త్వరలో ప్రారంభం కానున్న బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే

అంతర్జాతీయంగా బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ మూడు ఇంజన్ ఆప్షన్ల ఎంపికతో అందించబడుతుంది. ఇందులో 840 ఐ, 850 డి మరియు ఎమ్850ఐ ఉన్నాయి. ఏదేమైనా భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత, బిఎమ్‌డబ్ల్యూ కేవలం బేస్ 840ఐ వేరియంట్‌ను తీసుకురాగలదు. ఇది స్ట్రెయిట్-సిక్స్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో 340 బిహెచ్‌పి మరియు 500 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

త్వరలో ప్రారంభం కానున్న బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే

8 సిరీస్ కూపే ముందు భాగంలో ఐ-ఆకారపు హెడ్‌ల్యాంప్‌లు మరియు డిఆర్‌ఎల్ సిస్టమ్‌తో పెద్ద గ్రిల్ అందించబడుతుంది. వీటితో పాటు పెద్ద చక్రాలు, లాంగ్‌బోర్డ్ మరియు వాలుగా ఉన్న పైకప్పు కొత్త బిఎమ్‌డబ్ల్యూని మరింత ఆకర్షణీయంగా కనిపించేట్లు చేస్తాయి.

త్వరలో ప్రారంభం కానున్న బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే

బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే ప్రామాణిక కూపే కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది. దీని రెండవ వరుసలో ముగ్గురు వ్యక్తులు కూర్చునే సామర్థ్యంతో నాలుగు-డోర్ల కాన్ఫిగరేషన్‌తో రావడానికి అనుమతిస్తుంది. ఏదేమైనా, రెండవ వరుస తక్కువ దూరాలకు మాత్రమే సరిపోతుందని బిఎమ్‌డబ్ల్యూ సంస్థ స్వయంగా ప్రకటించింది.

త్వరలో ప్రారంభం కానున్న బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే

భారతీయ మార్కెట్లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే, పోర్స్చే పనామెరా మరియు రాబోయే మెర్సిడెస్ బెంజ్ జిటి 4-డోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే ధర రూ. 1.5 కోట్లు (ఎక్స్‌షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
BMW 8 Series Gran Coupe India Launch Expected Soon: Will Rival The Porsche Panamera. Read in Telugu.
Story first published: Thursday, March 26, 2020, 15:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X