వనరులను గౌరవిద్దాం, భవిష్యత్తు కోసం ఆదా చేద్దాం: బిఎమ్‌డబ్ల్యూ

జపనీస్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ తమ వాహనాలను చెన్నైలోని ప్లాంటులో తయారు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. కాగా.. ఇప్పుడు బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ చెన్నై ప్లాంట్ సస్టైనబల్ మ్యాన్యుఫాక్చరింగ్‌లో ఓ సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసి ఆటోమొబైల్ పరిశ్రమలోని ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలిచింది. వనరులను పునర్వినియోగించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, సౌరశక్తిని వినియోగించుకోవటం, వర్షపు నీటిని నిల్వచేయటం వంటి అనేక ప్రణాళికలతో ఈ ప్లాంట్ ముందుకెళ్తోంది.

వనరులను గౌరవిద్దాం, భవిష్యత్తు కోసం ఆదా చేద్దాం: బిఎమ్‌డబ్ల్యూ

భవిష్యత్ తరాల కోసం వనరులను ఆదా చేసే దిశగా ప్రత్యామ్నాయ వనరులతో ప్లాంటు కార్యకలాపాలను నిర్వహించడం, మొక్కలను పెంచడం నీటిని పునర్వినియోగించడం వంటి కొత్త ప్రణాళికలతో బిఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంట్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా 100 శాతం గ్రీన్ ఎలక్ట్రిసిటీని సాధించాలనే లక్ష్యంతో ఉంది.

వనరులను గౌరవిద్దాం, భవిష్యత్తు కోసం ఆదా చేద్దాం: బిఎమ్‌డబ్ల్యూ

ఈ సందర్భంగా.. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ చెన్నై ప్లాంట్ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ డోస్ మాట్లాడుతూ.. తమ ప్లాంట్‌కి 'సస్టైనబల్ ప్రొడక్షన్' అంటే అర్థం భవిష్యత్ తరాలపై పెట్టుబడి పెట్టడం లాంటిదేనని అన్నారు. గత 2007 నుంచి తమ ప్లాంట్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పునరుత్పాదక పెంచుకుంటూ వస్తుందని అన్నారు. తమ వ్యాపార విధానం మరియు ఉత్పత్తి విధానాలకు కట్టుబడి హరిత భవిష్యత్తే (గ్రీన్ ఫ్యూచర్) లక్ష్యంగా బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ చెన్నై ప్లాంట్ అడుగులు వేస్తోందని డోస్ చెప్పారు.

MOST READ: బీఎమ్‌డబ్ల్యూ X1 విడుదల: ధర టయోటా ఫార్చ్యూనర్‌ రేంజ్‌లోనే!

వనరులను గౌరవిద్దాం, భవిష్యత్తు కోసం ఆదా చేద్దాం: బిఎమ్‌డబ్ల్యూ

భవిష్యత్ తరాలు మరికొన్ని కాలాల పాటు హాయిగా జీవించాలంటే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ప్రకృతి సిద్ధమైన వనరులను ఉపయోగించుకుంటూ, మనం తిరిగి వాడుకోలేని వనరులను భావి తరాల కోసం ఆదా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వివరించారు. వనరులను గౌరవించడం బిఎమ్‌డబ్ల్యూ విధివిదానాల్లో ఓ భాగమని, పునరుత్పాద ప్రక్రియలను ప్రవేశపెట్టడంలో యాజమాన్యం కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే వాటిని కార్యాచరణలోకి తీసుకురావటంలో తమ కంపెనీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారాని థామస్ డోస్ తెలిపారు.

వనరులను గౌరవిద్దాం, భవిష్యత్తు కోసం ఆదా చేద్దాం: బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ చెన్నై ప్లాంట్‌లో తమ ఉత్పత్తి కార్యకలాపాలాకు అసరమైన విద్యుత్తులో 40 శాతం విద్యుత్తును సౌరశక్తి (సోలార్ ఎనర్జీ) ద్వారా గ్రహిస్తున్నారు. ఇందులో ప్లాంట్ పైభాగంలో 1350 కిలోవాట్ సోలార్ ఫొటోవోల్టాయిక్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా 100 శాతం సౌరశక్తితో తమ ప్లాంట్‌ను నిర్వహించాలని కంపెనీ యోచిస్తోంది. అలాగే ప్లాంటులో లైటింగ్ సిస్టమ్‌ను పూర్తిగా ఎల్ఈడికి మార్చడం ద్వారా 50 శాతం విద్యుత్‌ని ఆదా చేయగలిగింది. వెంటిలేషన్ సిస్టమ్‌లో కూడా హై వాల్యూమ్ లో స్పీడ్ (హెచ్‌విఎల్ఎస్) ఫ్యాన్లను ఉపయోగించడం ద్వారా 30 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తున్నారు.

MOST READ: బిఎండబ్ల్యు వాహనప్రియులకు గుడ్ న్యూస్, ఏంటో తెలుసా ?

వనరులను గౌరవిద్దాం, భవిష్యత్తు కోసం ఆదా చేద్దాం: బిఎమ్‌డబ్ల్యూ

నీటి వినియోగంలో కూడా ఈ ప్లాంట్ కొత్త విధానాలను అమలు చేస్తోంది. ఈ ప్లాంట్ వర్షం ద్వారా వచ్చిన నీటిని నిల్వ చేసి ఉపయోగించడం, తక్కువ మోతాదులో తాజా నీటిని వినియోగించడం మరియు వినియోగించిన నీటిని వాటర్ ట్రీట్‌మెంట్ చేసి పునర్వినియోగించడం చేస్తోంది. వర్షపు నీటి నిల్వ కోసం ఈ ప్లాంట్‌లో రెండు చోట్ల 14,25,000 లీటర్ల సామర్థ్యం కలిగిన స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ సుమారు 3,40,000 లీటర్ల వర్షపు నీటిని సేకరించి, వాటర్ లీక్ టెస్టుల కోసం మరియు ఇతర పనుల కోసం ఆ నీటిని వినియోగించారు.

వనరులను గౌరవిద్దాం, భవిష్యత్తు కోసం ఆదా చేద్దాం: బిఎమ్‌డబ్ల్యూ

అంతేకాకుండా ఈ ప్లాంటులో సుమారు 7.7 ఎకరాల్లో పచ్చని మొక్కలు నాటి పర్యావరణానికి మేలు చేస్తున్నారు. ఇది ప్లాంటు మొత్తంలో దాదాపు 25 శాతం ఉంటుంది. మొత్తం 31 జాతులకు చెందిన 2,000 మొక్కలను ఈ గ్రీన్ బెల్టులో నాటారు. పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన చేపట్టిన ఈ ప్రోగ్రామ్‌లో ఇటీవలే మరో 4,000 మొక్కలను నాటారు. ప్రతి ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కంపెనీలోని వర్కర్లు ప్లాంట్ లోపల మరియు వెలుపల మొక్కలు నాటి పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేస్తున్నారు.

MOST READ: రూ. 55.40 లక్షలకే బిఎమ్‌డబ్ల్యూ 530 ఐ స్పోర్ట్ కార్

వనరులను గౌరవిద్దాం, భవిష్యత్తు కోసం ఆదా చేద్దాం: బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ చెన్నై ప్లాంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రకృతి ప్రసాధించే వనురులను వినియోగించుకుంటూ, అందుబాటుల్లో ఉన్న వనురులను వీలైనంత వరకూ తిరిగి వినియోగించుకున్నట్లయితే, ఉత్పాదక వ్యయం తగ్గడమే కాకుండా భావి తరాల కోసం వనరులను ఆదా చేసిన వాళ్లం అవుతాం. ఈ విషయంలో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ చెన్నై ప్లాంట్ పనితీరు దేశంలోని ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
At the BMW Group Plant Chennai, sustainability is the top priority. Through a host of initiatives, BMW Group Chennai is taking an active lead towards a green and sustainable future. While significant savings have already been achieved with dedicated efforts, the plant is committed to convert to 100% green electricity by the end of the year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more