Just In
Don't Miss
- Movies
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- News
అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎమ్‌డబ్ల్యూ కారుని ఢీ కొన్న ట్రైన్, తర్వాత ఎం జరిగిందంటే.. ?
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. ప్రపంచంలో జరిగే ప్రమాదాలతో భారతదేశంలోనే అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదాలు జరగటానికి వివిధ కారణాలు ఉన్నాయి. కానీ ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వల్ల ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ట్రాఫిక్ నియమాలను ఉలంఘించడం వల్ల అనుకోని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ విధంగా ఉల్లంఘించడం వల్ల రోజు రోజుకి ప్రమాదాల సంఖ్య ఎక్కువవుతూనే ఉంది.

సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఈ ట్రాఫిక్ నియమాలకు వ్యతిరేఖంగా ప్రయాణించడం మనం చూస్తూ ఉంటాము. ఈ కారణం వల్ల జరిగే ప్రమాదాల వీడియోస్ మనం ఇంటర్నెట్ లో చూస్తూ ఉంటాము. ఇందులో కొన్ని ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయి.

ప్రజలలో సామజిక అవగాహన కల్పించడానికి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయబడతాయి. ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాల వీడియోలు కూడా ఇంటర్నెట్లో అప్‌లోడ్ చేయడం జరిగింది.

ఇప్పుడు మనం చూస్తున్న సంఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. ఈ సంఘటనలో రైల్వే క్రాసింగ్ వద్ద ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి రైలుని ఢీ కొట్టింది.

పోలీసుల కథనం మేరకు బ్లాక్ బిఎమ్‌డబ్ల్యూ కారు వేగంగా రైల్వే క్రాసింగ్‌ను దాటుతోంది. ఆ సమయంలో వేగంగా వెళ్తున్న ట్రైన్ కారుని ఢీ కొట్టింది. కానీ అదృష్టవ శాత్తు కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. డ్రైవర్ ని హాస్పిటల్ కి తరలించారని తెలిపారు.

లాస్ ఏంజిల్స్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ పేజీలో క్రాష్ జరిగిన దృశ్యాన్ని పోస్ట్ చేశారు. రైల్వే క్రాసింగ్‌లు దాటేటప్పుడు వాహనదారులు అదనపు జాగ్రత్తలను కూడా పాటించాలని సూచించారు.