భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!

భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్ వాహనాన్ని నిలిపివేసింది. ఎందుకు నిలిపివేసింది అనే దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!

మారుతి సుజుకి భారత మార్కెట్లో తన సియాజ్ సెడాన్ నుండి డీజిల్ పవర్ట్రెయిన్‌ను నిలిపివేసింది. మారుతి సియాజ్ డీజిల్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదని కంపెనీ అధికారికంగా తెలిపింది.

భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!

మారుతి సియాజ్‌ డీజిల్ పవర్‌ట్రైన్ 1.5 లీటర్ నాలుగు సిలిండర్ యూనిట్ రూపంలో వచ్చింది. ఇది 94 బిహెచ్‌పి మరియు 225 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది ఏప్రిల్ 2020 నాటికి డీజిల్ ఇంజిన్ లను దశలవారీగా మార్చాలని మారుతి సుజుకి ప్రణాలికను సిద్ధం చేసింది. అంతే కాకుండా బిఎస్ 6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌లకు మంచి డిమాండ్ ఉంటే వారు దానిని చేయగలరని కంపెనీ పేర్కొంది.

భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!

డీజిల్ పవర్‌ట్రెయిన్‌ను నిలిపివేయడంతో, మారుతి సుజుకి సియాజ్‌ను ఇప్పుడు ఒకే బిఎస్ 6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్‌తో అందిస్తున్నారు. ఇది 1.5 లీటర్ యూనిట్ రూపంలో 103 బిహెచ్‌పి మరియు 138 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!

సియాజ్‌లో డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేయడం మినహా, ఇతర మార్పులు చేయలేదు. కానీ మారుతి సుజుకి ఇటీవల సియాజ్ ఎస్ అని పిలువబడే సెడాన్ యొక్క స్పోర్టియర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.

భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!

కొత్త మారుతి సుజుకి సియాజ్ ఎస్ టాప్-స్పెక్ ‘ఆల్ఫా' వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ వేరియంట్ యొక్క ధర రూ. 10.08 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద అందించబడుతుంది. కొత్త సియాజ్ ఎస్ సెడాన్ అనేక నవీనీకరణలను పొందింది. ఫీచర్స్ కూడా కొంత వరకు అప్డేట్ చేయబడి ఉంటాయి.

భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!

మారుతి సుజుకి సియాజ్ కాకుండా,సుజుకి కొత్త 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎర్టిగా ఎమ్‌పివిలో కూడా అందిస్తున్నారు. కంపెనీ దీనిని ప్రముఖ విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో కూడా ప్రవేశపెట్టనుంది. ఇది త్వరలో అమ్మకాలకు సిద్ధం కానుంది. కొత్త మారుతి విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్‌ను తొలిసారిగా ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించారు. అంతే కాకుండా త్వరలో దీనిని విడుదల చేయనున్నారు.

భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతీ సుజుకి బిఎస్-6 ఉద్గార ప్రమాణాల తర్వాత డీజిల్ ఇంజిన్ ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే కొత్త నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజన్లను నవీకరించడానికి అవసరమైన అదనపు ఖర్చులే దీనికి ప్రధాన కారణం. కానీ వీటికి మార్కెట్లో తగినంత డిమాండ్ ఉంటే తరువాతి దశలో బిఎస్ 6-కంప్లైంట్ డీజిల్ యూనిట్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నమని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 19, 2020, 9:40 [IST]
English summary
Maruti Suzuki Ciaz Diesel Powertrain Discontinued In India: Unlisted From Company Website. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+