భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్లు ఇవే
సాధారణంగా వాహనదారులు వాహనాలను కొనేటప్పుడు ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే పెరుగుతున్న ఇంధన ధరలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఎంచుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందా.

1) హోండా జాజ్ :
భారతదేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్ల జాబితాలో ప్రధానమైనది హోండా జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. హోండా జాజ్ ప్రీమియం ఐదు సీట్ల కారును జూలై 2018 లో లాంచ్ చేశారు. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 7.45 లక్షలు.

హోండా జాజ్ ప్రీమియం కారు 1.2 లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్, ఒక లీటర్ పెట్రోల్ కి దాదాపు 18.2 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే విధంగా ఇందులో ఉన్న 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజిల్ ఇంజన్ ఒక లీటర్ డీజిల్ ద్వారా ఒక కిలోమీటర్ కి 27.3 కిమీ పరిధిని అందిస్తుంది.

2) హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ :
భారతదేశంలో విక్రయించబడుతున్న ఎక్కువ ఇంధన సామర్త్యం గల మరొక కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్. దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 5.05 లక్షలు. ఇది 15 వేరియంట్లలో లభిస్తుంద. వీటిలో 11 మాన్యువల్ మరియు నాలుగు ఎఎంటి.

ఈ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఒక లీటర్ పెట్రో ద్వారా 20.7 కిమీ పరిధిని అందిస్తుంది, మరియు 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ నుండి 26.2 కిమీ / లీటర్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

3) హోండా సిటీ :
హోండా కార్ ఇండియా యొక్క సిటీ సెడాన్ 1.5 లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ 17.4 కిలోమీటర్లు / లీ అందిస్తుండగా, 1.5 లీటర్ ఐ-డిటిఇసి ఇంజన్ 25.6 కిమీ / లీ ఇస్తుంది.

కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత 2020 లో హోండా సిటీ త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇది ప్రస్తుత మోడల్‌లో మాన్యువల్ మరియు సివిటి ఎంపికలతో రానుంది. ఇది అదే ఇంజిన్ లైనప్ ద్వారా శక్తిని పొందుతుంది కాని బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడి ఉంటుంది. ఈ సెడాన్ ధర రూ. 10 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంటుంది.

4) హోండా వ్యాగన్ ఆర్ - వి :
హోండా కార్ ఇండియా యొక్క వ్యాగన్ ఆర్ - వి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర రూ. 8.15 లక్షలు. ఈ ఎస్‌యూవీ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 17.5 కి.మీ / లీ సామర్థ్యం కలిగి ఉంటుంది. అదే విధంగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 25.5 కి.మీ / లీ మైలేజ్ అందిస్తుంది.

2020 హోండా వ్యాగన్ ఆర్-వి ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణమైన అప్‌డేట్స్‌తో అమ్మకాలు జరుపుతుంది. కంపెనీ 21,000 రూపాయలకు బుకింగ్ ప్రారంభించబడింది.

5) హ్యుందాయ్ ఆరా :
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆరా కాంపాక్ట్ సెడాన్ ప్రారంభ ధర భారతదేశంలో రూ. 5.8 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇది హ్యుందాయ్ యొక్క ఐ 10, గ్రాండ్ నియోస్ పై ఆధారపడింది.

ఇందులో 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. ఇందులో పెట్రోల్ వెర్షన్ ఒక లీటర్ కి 20.5 కిలోమీటర్ల పరిధిని అందిస్తే, డీజిల్ వెర్షన్ 25 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. హ్యుందాయ్ ఆరా లో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు అప్సనల్ 5-స్పీడ్ ఎఎంటి తో జతచేయబడతాయి. కాంపాక్ట్ సెడాన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో సిఎన్‌జి ఎంపికను కూడా పొందుతుంది.

6) టాటా ఆల్ట్రోజ్ :
టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఈ కారు గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో 5 స్టార్స్ అందుకోవడమే కాక, దేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం గల కార్లలో ఒకటిగా పేర్కొంది.

ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా 19 కి.మీ / లీటర్ మైలేజ్ అందించగా, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 25 కి.మీ / లీటర్ సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండు పవర్‌ట్రెయిన్‌లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతాయి. అంతే కాకుండా ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది.

7) హోండా అమేజ్ :
హోండా అమేజ్ సెడాన్ ప్రస్తుతం హోండా కార్ ఇండియా యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడల్. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో వస్తుంది. దీని 1.2 లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ 18.6 కిలోమీటర్లు / లీటర్ ఇవ్వగా, 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజిల్ యూనిట్ 24.7 కిమీ / లీటర్ (మాన్యువల్) లేదా 21 కిమీ / లీటర్ (సివిటి) మైలేజిని అందిస్తుంది.

8) మారుతి సుజుకి బాలెనో :
మారుతి సుజుకి యొక్క బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అధిక ఇంధన సామర్థ్యం కారణంగా ఒక ప్రసిద్ధ ఉత్పత్తిగా ఇండియన్ మార్కెట్లో నిలిచింది.
ఇందులోని 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 21 కి.మీ / లీటర్ మైలేజ్ ఇస్తుంది. మరియు 1.2-లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్ ద్వారా 23.87 కి.మీ / లీటర్ మైలేజ్ అందిస్తుంది. మారుతి సుజుకి ప్రస్తుత లైనప్‌లో డీజిల్ ఇంజన్లు లేవు.

9) టాటా టియాగో :
టాటా టియాగో ధర ఇండియాలో రూ. 4.60 లక్షలు. ఇది 1.2 లీటర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 85 బిహెచ్‌పి మరియు 112 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది పెట్రో ఇంజిన్ ద్వారా 23.84 కి.మీ/ లీటర్ మైలేజ్ అందింస్తుంది.

10) హ్యుందాయ్ వెన్యూ :
హ్యుందాయ్ మోటార్ ఇండియా యొక్క హ్యుందాయ్ వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అనేక రకాల ఇంజిన్ ఎంపికలతో పనిచేస్తుంది: 1.2-లీటర్ పెట్రోల్ (18.27 కిమీ / లీటర్), 1.0-లీటర్ టర్బో పెట్రోల్ (18.15 కిమీ / లీటర్) మరియు 1.5-లీటర్ డీజిల్ (23.7 కిమీ / లీటర్).

హ్యుందాయ్ ఇండియా త్వరలో బిఎస్ 6 కంప్లైంట్ వెన్యూ డీజిల్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications








