నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన మాగ్నైట్ కస్టమర్ల నుండి అనూహ్య స్పందనను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ విడిభాగాల కంపెనీలు కూడా నిస్సాన్ మాగ్నైట్‌తో అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు క్యూ కడుతున్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

తాజాగా, భారతదేశపు ప్రముఖ టైర్ల తయారీ సంస్థ, సియాట్ టైర్స్, నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం నిస్సాన్ ఇండియాతో ఓ అనుబంధాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ అనుబంధంలో భాగంగా, నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలో సియాట్ సెక్యూరాడ్రైవ్ రేంజ్ టైర్లను ఉపయోగించనున్నారు.

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

సియాట్ అందిస్తున్న ఈ సెక్యూరాడ్రైవ్ టైర్లను ప్రత్యేకంగా ప్రీమియం సెడాన్ విభాగం మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీల కోసం రూపొందించబడ్డాయి. సియాట్ సెక్యూరాడ్రైవ్ టైర్ల పనితీరును నిస్సాన్ యొక్క జపాన్ విభాగం ధృవీకరించింది.

MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

ఈ టైర్లు దృఢమైన బాహ్య బ్లాకులతో పాటు అసమానమైన థ్రెడ్ ప్యాటర్న్‌ను కలిగి ఉండి, రోడ్డుపై మంచి గ్రిప్‌ను ఇస్తాయి మరియు వాహన నియంత్రణలో భద్రతను నిర్ధారిస్తాయి. సియాట్ సెక్యూరాడ్రైవ్ టైర్లలో అధునాతన సిలికా పాలిమర్ మెటీరియల్‌ను ఉపయోగించారు. ఇది తక్కువ రోలింగ్ నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ టైర్లు టైర్ శబ్దాన్ని తగ్గించడంలో సహాయపడే ఆప్టిమైజ్ చేసిన ట్రెడ్ ప్యాటర్న్‌ను కలిగి ఉంటాయి.

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

ఇక నిస్సాన్ మాగ్నైట్ విషయానికి వస్తే, ఇందులో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి 16-ఇంచ్ స్టీల్ వీల్స్ లేదా డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీ యొక్క అన్ని వేరియంట్‌లకు టైర్ ప్రొఫైల్ ఒకేలా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్‌లో 195/60 ఆర్16 టైర్లను ఉపయోగిస్తారు.

MOST READ:ఒక్క ఫోటో ద్వారా లాక్‌డౌన్ ఫీలింగ్స్ పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆ ఫోటో మీరు చూడండి

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

డిసెంబర్ 2, 2020వ తేదీన నిస్సాన్ ఇండియా తమ మాగ్నైట్‌ను భారత మార్కెట్లో విడుదల చేశింది. మార్కెట్లో ఇది ఎక్స్‌ఇ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ డిసెంబర్ నెల మొత్తం నిస్సాన్ మాగ్నైట్‌ను రూ.4.99 లక్షల, (ఎక్స్-షోరూమ్, ఢల్లీ) ప్రత్యేక పరిచయ ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

నిస్సాన్ మాగ్నైట్ టాప్-ఎండ్ ఎక్స్‌వి ప్రీమియం వేరియంట్ ధర రూ.9.35 లక్షలు, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ మోడల్ మొత్తం ఎనిమిది కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 5 మోనోటోన్ మరియు 3 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

MOST READ:చెట్టుని డీ కొన్న ఖరీదైన టెస్లా కార్.. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా ?

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. బేస్ వేరియంట్లలో 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 71 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

MOST READ:వరదనీటిలో చేపలా ఈదుతున్న లంబోర్ఘిని సూపర్ కార్ [వీడియో]

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

నిస్సాన్ ఇండియాతో అనుబంధం గురించి సియాట్ టైర్స్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ తోలాని మాట్లాడుతూ, రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ శరవేగంగా వృద్ధి చెందుతుందని, సియాట్ అందిస్తున్న సెక్యూరాడ్రైవ్స్ రేంజ్ టైర్లు ఈ విభాగంలోనే అత్యుత్తమమైనవని అన్నారు. నిస్సాన్ మాగ్నైట్‌తో అనుబంధం కుదుర్చుకోవటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ టైర్ పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

నిస్సాన్ మాగ్నైట్‌తో సియాట్ టైర్స్ అనుబంధం గురించి డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టైర్ బ్రాండ్లలో సియాట్ ఒకటి. పనితీరు మరియు వాహనం యొక్క సామర్థ్యానికి అనుగుణంగా టైలర్ మేడ్ టైర్ మోడల్‌ను అందించడానికి ఈ బ్రాండ్ అనేక ఆటోమోటివ్ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇందులో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు మరియు డ్యూయెల్ టెర్రైన్ టైర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
CEAT Tyres has announced that they have associated with Nissan for its newly launched Compact SUV Magnite. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X