ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేంద్రం నుండి భారీ సబ్సిడీ; ఎక్కడో తెలుసా?

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం నడుస్తున్న ఫేమ్ పథకం రెండవ దశలో భాగంగా, చండీగడ్ రాష్ట్రం కోసం 80 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రతి బస్సుకు కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షలు చెల్లిస్తుంది.

ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేంద్రం నుండి భారీ సబ్సిడీ; ఎక్కడో తెలుసా?

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఏప్రిల్ 1, 2019వ తేదీన ఫేమ్ -2 పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం త్వరలో తాజా టెండర్లను జారీ చేయనున్నట్లు చండీగ సీనియర్ సీనియర్ అధికారి తెలిపారు.

ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేంద్రం నుండి భారీ సబ్సిడీ; ఎక్కడో తెలుసా?

ఆ రాష్ట్రం ఇప్పటికే హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే పనిలో ఉంది. చండీగడ్‌లో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలతో సహా 12 లక్షలకు పైగా రిజిస్టర్ అయిన వాహనాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి సగటున రెండేసి వాహనాలను ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటి కారణంగా వాహన కాలుష్యం పెరిగి, గాలి నాణ్యత గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలని చండీగడ్ రాష్ట్రం నిర్ణయించింది.

MOST READ:కొత్త హ్యుందాయ్ ఐ 20 ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేంద్రం నుండి భారీ సబ్సిడీ; ఎక్కడో తెలుసా?

కాలుష్య స్థాయిలను తగ్గించడానికి, చండీగడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్టేకింగ్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సులను తమ జాబితాలో చేర్చనుంది. ప్రస్తుతం, నగరంలో సుమారు 3,000 ఇ-రిక్షాలు పనిచేస్తున్నాయి. ఈ సంవత్సరం 40 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేయబడినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది.

ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేంద్రం నుండి భారీ సబ్సిడీ; ఎక్కడో తెలుసా?

అంతకుముందు, కిలోమీటరుకు 74 రూపాయల చొప్పున బస్సులను నడపడానికి బిడ్ చాలా ఎక్కువగా ఉందని అధికారులు కనుగొన్న తరువాత, అప్పటి టెండర్‌ను రద్దు చేయటం జరిగింది. ట్రాన్స్‌పోర్ట్ డివిజన్ అధికారులు పూణేను సందర్శించి అక్కడ కిలోమీటరుకు 56 రూపాయల చొప్పున ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతున్నారని గుర్తించిన మీదట కొత్త టెండర్‌ను ప్రతిపాదించారు.

MOST READ:రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేంద్రం నుండి భారీ సబ్సిడీ; ఎక్కడో తెలుసా?

మహారాష్ట్ర, గోవా, గుజరాత్ మరియు చండీగడ్‌లలో 670 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం తన ఫేమ్ 2 పథకం యొక్క రెండవ దశలో ఆమోదించింది. అదే సమయంలో, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్ మరియు పోర్ట్ బ్లెయిర్లలో 241 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణాన్ని ప్రారంభించడానికి కూడా ఆమోదం తెలిపింది.

ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేంద్రం నుండి భారీ సబ్సిడీ; ఎక్కడో తెలుసా?

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు అభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల మంత్రిత్వ శాఖ 2015 ఏప్రిల్‌లో FAME (ఫాస్ట్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వాహనాల) పథకాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను తయారు చేసింది.

MOST READ:వాహనాలకు HSRP నెంబర్ ప్లేట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా ?

ఎలక్ట్రికల్ బస్సుల కోసం కేంద్రం నుండి భారీ సబ్సిడీ; ఎక్కడో తెలుసా?

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెంచడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించడం మరియు టెక్నాలజీ సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను మెరుగుపరచడం వంటివి ఈ పథకం యొక్క లక్ష్యాలు. ఫేమ్ పథకం యొక్క మొదటి దశను ఏప్రిల్ 2015లో రెండేళ్ల కాలానికి అమలు చేశారు. కానీ ఈ పథకం యొక్క వ్యవధి చాలాసార్లు పొడిగించబడింది మరియు ఈ దశ మార్చ్ 31, 2019న పూర్తయింది.

Most Read Articles

English summary
Central government sanctioned Rs 50 lakhs each for 80 electric buses in Chandigarh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X