దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు: ఆంధ్రాకే పెద్దపీఠ!

పరిశుభ్రమైన మరియు ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దేవ్యాప్తంగా 62 నగరాల్లో 2,636 ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రజా వ్యాపార మంత్రిశాఖ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు: ఆంధ్రాకే పెద్దపీఠ!

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహన రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించి ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియా) స్కీమ్ రెండో దశ ద్వారా ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు: ఆంధ్రాకే పెద్దపీఠ!

2,636 ఛార్జింగ్ స్టేషన్లను ఇండియాలోని 24 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. సంభందింత మంత్రిత్వ శాఖ ప్రకారం, మహారాష్ట్రకు 317, ఆంధ్రప్రదేశ్‌కు 266, తమిళనాడుకు 256, గుజరాత్‌కు 228, రాజస్థాన్‌కు 205, ఉత్తరప్రదేశ్‌కు 207 మరియు కర్ణాటకు 172 ఛార్జింగ్ స్టేషన్లను కేటాయించారు.

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు: ఆంధ్రాకే పెద్దపీఠ!

అదనంగా, మధ్యప్రదేశ్‌కు 159, పశ్చిమ బెంగాల్‌కు 141, తెలంగాణకు 138, కేరళకు 131, ఢిల్లీకి 72, ఛంఢీగర్‌కు 70, హర్యాణకు 50, మేఘాలయకు 40, బీహార్‌కు 37, సిక్కిం రాష్ట్రానికి 29, జమ్మూ&శ్రీనగర్‌కు 25, అస్సాంకు 20, ఒరిస్సాకు 18, పాండిచ్చేరి, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లకు వరసగా 10 చొప్పున ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లను కేటాయించారు.

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు: ఆంధ్రాకే పెద్దపీఠ!

మొత్తం 2,636 ఛార్జింగ్ స్టేషన్లలో 1,633 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కాగా, 1,003 సాధారణ ఛార్జింగ్ స్టేషన్లు. "దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక గ్రిడ్ చొప్పున ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. దీంతో ప్రజలు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబరుస్తారని" మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు: ఆంధ్రాకే పెద్దపీఠ!

కేంద్రం ప్రభుత్వం చొరవతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడంతో కార్ల తయారీ కంపెనీలు కూడా పెట్రోల్ మరియు డీజల్‌తో నడిచే కార్లకు స్వస్తి పలికి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి చేపట్టి, మార్కెట్లోకి నూతన ఎలక్ట్రిక్ కార్లను తీసుకొస్తాయని కేంద్రం నమ్మకం వ్యక్తం చేసింది.

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు: ఆంధ్రాకే పెద్దపీఠ!

అంతే కాకుండా, ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండేలా ఇ-హైవేలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెప్పారు. ఢిల్లీ-ముంబాయ్ మధ్య 12 లైన్ల జాతీయ రహదారిని నిర్మించే ఆలోచనలో కేంద్రం ఉంది. బహుశా ఈ మార్గాన్ని ఇ-హైవేగా పరిగణించే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు: ఆంధ్రాకే పెద్దపీఠ!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పరిశుభ్రమైన రవాణాను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను పెంచేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజల్ మరియు సీఎన్జీ వాహనాలు విడుదల చేసే వాయువులు అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలు. దేశవ్యాప్తంగా ఢిల్లీతో పాటు ఎన్నో నగరాలు వాతావరణ కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెంచడమే. ఈ నేపథ్యంలోనే కేంద్రం పెద్ద ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ప్రజలు కూడా అతి త్వరలో ఎలక్ట్రిక్ కార్లవైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 7, 2020, 13:18 [IST]
English summary
Central Ministry Sanctions 2,636 Charging Stations Across 62 Cities In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+