బొలెరో పికప్ ట్రక్ కస్టమర్ల కోసం కరోనా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించిన మహీంద్రా

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ పికప్ ట్రక్ 'బొలెరో పిక్-అప్' వినియోగదారుల కోసం కంపెనీ ఓ కొత్త కరోనా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించింది. మహీంద్రా అందిస్తున్న ఈ ఉచిత కరోనా ఇన్సూరెన్స్ ఫ్లోటర్ ఆరోగ్య బీమా క్రింద రూ.1 లక్ష వరకూ కస్టమర్, అతని / ఆమె జీవిత భాగస్వామి మరియు కస్టమర్ యొక్క ఇద్దరు పిల్లలను కవర్ చేస్తుంది.

బొలెరో పికప్ ట్రక్ కస్టమర్ల కోసం కరోనా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించిన మహీంద్రా

కొత్త వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి 9.5 నెలల వరకు బీమా చెల్లుబాటులో ఉంటుంది. ఈ కరోనా భీమా బొలెరో పికప్ శ్రేణి వాహనాలకు వర్తిస్తుంది, ఇందులో బొలెరో పిక్-అప్, బొలెరో మాక్సి ట్రక్, బొలెరో సిటీ పికప్ మరియు బొలెరో క్యాంపర్ మోడళ్లు ఉన్నాయి. అక్టోబర్ 1, 2020వ తేదీ నుండి నవంబర్ 30, 2020వ తేదీ వరకు కొనుగోలు చేసే వాహనాలపై ఈ పాలసీ చెల్లుబాటులో ఉంటుంది. కస్టమర్లకు కరోనా ఇన్సూరెన్స్ పాలసీని అందించడం కోసం కంపెనీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

బొలెరో పికప్ ట్రక్ కస్టమర్ల కోసం కరోనా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించిన మహీంద్రా

ఈ ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, సేల్స్ అండ్ కస్టమర్ కేర్, ఆటోమోటివ్ డివిజన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సతీందర్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. "పిక్-అప్ విభాగంలో మార్కెట్ నాయకులుగా, మేము ఈ 'వారియర్స్ ఆన్ వీల్స్'కు నమస్కరించాలనుకుంటున్నాము, సవాలుగా మారిన ప్రస్తుత సమయాల్లో వారి ప్రయాణాల్లో వారితో భాగస్వామ్యం అయి, వారికి అదనపు మద్దతును మరియు మనశ్శాంతిని అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టాము. మా బొలెరో పిక్-అప్ రేంజ్‌లో ఫస్ట్ ఆఫ్ కైండ్‌గా ఈ కరోనా భీమా ప్రణాళిక ఉంటుంది మరియు మా వాటాదారుల జీవితాలలో మరియు మన చుట్టూ పనిచేస్తున్న సమాజాలలో సానుకూల మార్పును కలిగించడానికి ప్రయత్నిస్తుంద"ని అన్నారు.

MOST READ:ఈ స్టార్ కపుల్స్ పెళ్లి రోజు కొన్న కారు ధర రూ. 2.65 కోట్లు.. ఇంతకీ వారు ఎవరో తెలుసా ?

బొలెరో పికప్ ట్రక్ కస్టమర్ల కోసం కరోనా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించిన మహీంద్రా

మహీంద్రా తమ బొలెరో పికప్ రేంజ్ వాహనాలపై అందిస్తున్న ఈ కరోనా భీమా ప్లాన్‌ను పొందడం కోసం కస్టమర్లు వారి కుటుంబ సభ్యులతో సహా వారి పేరు, పుట్టిన తేదీ మరియు చిరునామాను కంపెనీతో నమోదు చేసుకోవాలి. కోవిడ్-19 పాజిటివ్‌గా పరీక్షించబడిన డ్రైవర్ మరియు అతని / ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేరినప్పుడు లేదా గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ఈ ఆరోగ్య బీమాను ఉపయోగించుకోవచ్చు.

బొలెరో పికప్ ట్రక్ కస్టమర్ల కోసం కరోనా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించిన మహీంద్రా

ఇక మహీంద్రా బొలెరో పికప్ వాహనాల విషయానికి వస్తే, కొత్త మహీంద్రా బొలెరో ఫేస్‌లిఫ్ట్ బిఎస్6 మోడల్‌లో 1.5 లీటర్, త్రీ సిలిండర్, ఎమ్‌హాక్ 75 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మీటియోర్' విడుదల మరింత జాప్యం; కొత్త వివరాలు

బొలెరో పికప్ ట్రక్ కస్టమర్ల కోసం కరోనా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రకటించిన మహీంద్రా

బొలెరో పికప్ ట్రప్ కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన కొత్త కరోనా ఇన్సూరెన్స్ ప్లాన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మన మార్కెట్లో బొలెరో పికప్ ట్రక్కులు చాలా ప్రసద్ధి చెందినవి మరియు విభాగంలో పెద్ద సంఖ్యలో అమ్ముడైన మోడల్. కొత్త కరోనా ఇన్సూరెన్స్ పథకంతో, మహీంద్రా మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని ప్లాన్ చేస్తోంది. ఈ పథకం ద్వారా కస్టమర్ మరియు వారి కుటుంబం మొత్తం కవర్ అవుతారు.

Most Read Articles

English summary
Mahindra & Mahindra has announced a Corona Insurance plan for the customers of its Bolero pick-up range. So what is this insurance plan about? The Free Corona Insurance is a floater health insurance cover for up to Rs. 1 lakh that will cover the customer, his/ her spouse and up to two of the customer's children. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X