బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్

నేడు ప్రపంచదేశాలను వణికిస్తున్న భయంకరమైన వైరస్ కరోనా. ఈ భయానకమైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలలో వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇటలీ వంటి దేశాలలో మృత్యువు విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ నుండి ప్రజలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.

బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్

కరోనా ప్రభావం వల్ల చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఈ ప్రభావం కేవలం ప్రజల మీద మాత్రమే కాదు, ఆటో మొబైల్ పరిశ్రమలపై కూడా పడింది. ఈ కరోనా వైరస్ నివారించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ చేయడం జరిగింది.

బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్

భారతదేశంలో చాల ఆటో పరిశ్రమలు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. ఇప్పటికే మారుతి సుజుకి, మహీంద్రా, టాటా మోటార్స్, కియా మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ వంటి బ్రాండ్లు నిరవధికంగా మూసివేసాయి.

బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్

ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పుడు ఆటో పరిశ్రమకు వచ్చిన ప్రధాన సమస్య బిఎస్ 4 వాహనాల అమ్మకం. సాధారణంగా భారత ప్రభుత్వం అన్ని కంపెనీల వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయడానికి మార్చి 31 గడువు నిర్ణయించింది.

కానీ కరోనా వైరస్ ప్రభావం వల్ల సంస్థలన్నీ మూతపడ్డాయి. ఈ కారణంగా ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం దాదాపు 6,400 కోట్ల రూపాయల విలువైన బిఎస్ 4 వాహనాలు ఇప్పటికి అమ్ముడుపోలేదు. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్.

బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్

బిఎస్ 6 అమలు గడువును 31 మే 2020 వరకు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) సుప్రీంకోర్టును కోరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్

కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ బ్రాండ్లను చాలా ప్రభావితం చేసింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రధాన కార్ బ్రాండ్ కార్యకలాపాలను నిలిపివేసింది. చాలా మంది తయారీదారులు వైద్య సిబ్బందికి మరియు వైద్యులకు సహాయాన్ని అందించే మార్గాల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు.

బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్

మహీంద్రా, రెనాల్ట్ వంటి సంస్థలు ఆరోగ్య అధికారులకు మద్దతుగా వెంటిలేటర్లు మరియు ఇతర వైద్య పరికరాలను తయారు చేసే మార్గాలపై పరిశోధనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్

కోవిడ్ -19 అధికంగా వ్యాప్తి చెందటం వల్ల అమ్మకాలు మందగించాయి. ఈ సమయంలో కొత్త వాహనాల కొనుగోలు కోసం చాలా మంది కస్టమర్లు తమ ప్రణాళికలను వాయిదా వేస్తున్నారు. ఆటోమోటివ్ బ్రాండ్లు ఏప్రిల్ గడువుకు ముందే బిఎస్ 4 మోడళ్లపై భారీ తగ్గింపులు మరియు ఆఫర్లను అందిస్తున్నాయి.

బిఎస్ 4 వాహన అమ్మకాలకు శాపంగా మారిన కరోనా వైరస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

భారతదేశంలో కరోనా వ్యాప్తి ఆటో పరిశ్రమ పట్ల శాపంగా మారింది. ఈ కారణంగా కస్టమర్లు కొత్త వాహనాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. కాబట్టి తక్కువ వాహనాల అమ్మకం కారణంగా ఆటోమొబైల్ బ్రాండ్లపై పెద్ద ఆర్థిక భారం పడింది. ఏది ఏమైనా బిఎస్ 4 వాహనాల యొక్క అమ్మకాలకు కరోనా పెద్ద శాపంగా మారింది అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Coronavirus Lockdown: BS4 Vehicles In India Worth Rs 6,400 Crore Remain Unsold. Read in Telugu.
Story first published: Wednesday, March 25, 2020, 18:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X