క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

ఏదైనా కారు కొనడానికి ముందు కస్టమర్ చూసే మొదటి కొన్ని అంశాల్లో భద్రతా (సేఫ్టీ) ఫీచర్లు కూడా ఒకటి. వాహనాల భద్రతా ఫీచర్లలో కార్ల తయారీదారులు మునపటితో పోల్చుకుంటే ఎంతో గొప్పగా అభివృద్ధి చెందారనే చెప్పాలి. కొత్త వాహనాల భద్రతా పనితీరును తనిఖీ చేసేందుకు కార్ కంపెనీలు ప్రతి మోడల్‌లో ఒక యూనిట్‌ని యాదృచ్ఛికంగా ఎన్నికొని క్రాష్ టెస్ట్‌కు పంపుతారు.

క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

ఈ క్రాష్ టెస్టులో సదరు మోడల్ తెచ్చుకున్న ఫలితాల ఆధారంగా, ఆపద సమయాల్లో ఆ కారులోని ప్రయాణీకులకు ఎంత మేర భద్రత లభిస్తుందనే విషయాన్ని అంచనా వేస్తారు. గ్లోబల్ ఎన్‌సిఎపి అనేది కార్ల భద్రతకు సంబంధించిన పనితీరును వెల్లడించే కార్యక్రమం, ఇందులో నిర్వహించే క్రాష్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఏదేనై మోడల్‌కు సేఫ్టీ రేటింగ్ ఇవ్వటం జరుగుతుంది.

గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో ఎక్కువ రేటింగ్ తెచ్చుకున్న కార్లు ప్రమాదాల్లో ప్రయాణీకులకు ఎక్కువ భద్రతను అందిస్తాయని చెబుతారు. తాజాగా.. 4 డ్రైవ్ టైమ్స్ పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఇది వరకు మార్కెట్లో ఉన్న పురాతన మోడళ్లు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అధునాత కార్లను ఒకదానితో ఒకటి క్రాష్ చేస్తూ సేఫ్టీని కొలిచే ప్రక్రియ చేశారు.

MOST READ: మీకు తెలుసా.. వడోదరలో ఇప్పుడు స్మార్ట్ సిటీ బస్ సర్వీస్

క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

ఈ వీడియోలో ముందుగా 1992 నిస్సాన్ సురు మరియు 2016 నిస్సాన్ వెర్సాల మధ్యలో క్రాష్ టెస్ట్ చేయటాన్ని మనం చూస్తాము. ఆ తర్వాత 1956 షెవర్లే బెల్ ఎయిర్, 2009 మాలిబు మోడళ్ల మద్య, అనంతరం 1997 రోవర్ 100 మరియు 2015 హోండా జాజ్ మోడళ్ల మధ్య క్రాష్ టెస్ట్ చేయటాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు.

క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

పైన పేర్కొన్న అన్ని క్రాష్ టెస్ట్‌లలో, కొత్త వాహనాలతో పోల్చితే పాత కార్లు పూర్తిగా విఫలమవ్వటాన్ని గమనించవచ్చు. అదే వీడియోలో, గ్లోబల్ ఎన్‌సిఎపి సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్డ్ వచ్చి 1998 ఫోర్డ్ ఫియస్టా మరియు 2018 ఫోర్డ్ ఫియస్టా మధ్య క్రాష్ వ్యత్యాసాన్ని గురించి వివరించడాన్ని మనం చూడొచ్చు.

MOST READ: మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

ఈ రెండు కార్లకు గరిష్టంగా గంటకు 64 కి.మీ వేగం వద్ద క్రాష్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో 1998 ఫోర్డ్ ఫియస్టా కారులో బాడీ షెల్ పూర్తిగా కూలిపోయి, ప్రయాణీకులు కూర్చునే ప్రాంతం డ్యామేజ్ అయ్యి, వారికి తీవ్రమైన గాయాలను కలిగించేలా చేస్తుంది. మరోవైపు, కొత్త ఫోర్డ్ ఫియస్టా బాడీ షెల్ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది, అన్ని ఎయిర్‌బ్యాగులు సంపూర్ణంగా విచ్చుకున్నాయి మరియు కారు విండ్‌షీల్డ్‌ పగుళ్లను కూడా ఎదుర్కొంది. ఈ కారులో అయితే క్రాష్ తరువాత, ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడే అవకాశం ఉంది.

క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

కార్లకు క్రాష్ టెస్ట్ నిబంధనలను 1998లో అమల్లోకి తీసుకువచ్చారు. ఆ తర్వాతి కాలంలో క్రమక్రంగా ఈ నిబంధనలు అప్‌డేట్ చేస్తూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. ఫలితంగా కార్ కంపెనీలు కూడా సేఫ్టీ విషయంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం ఎక్కువగా పెట్టుబడులు చేస్తున్నారు. ఈ అధునాత సేఫ్టీ ఫీచర్ల ఫలితంగా, దేశంలో నిత్యం జరిగే వాహన ప్రమాదాల్లో కొన్నిసార్లు ప్రజలు చిన్నపాటి గీతలో బయటపడుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి మేడ్ ఇన్ ఇండియా కారు టాటా నెక్సాన్ కావటం విశేషం.

MOST READ: 22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో, ఎందుకంటే?

క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

పాత మరియు కొత్త కార్ల క్రాష్ టెస్ట్ వీడియోపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

వీడియోలో చూసినట్లుగా, పాత కార్లు క్రాష్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాయి. ఇప్పటికీ ఎవరైనా ఇలాంటి కార్లను ఉపయోగిస్తుంటే, దురదృష్టవశాత్తు అవి ప్రమాదానికి గురైతే అందులోనిని ప్రయాణీకులకు సేఫ్టీ చాలా తక్కువుగా ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి మీరు కొత్త వాహనం కొనడానికి ప్లాన్ చేస్తుంటే, ముందుగా ఆ కారులో ఏమేమీ సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారో తెలుసుకోండి.

Most Read Articles

English summary
One of the things that a customer sees before buying a car is its safety. Car manufacturers have come a long way as far as the safety of the vehicles is concerned. Read in Telugu.
Story first published: Sunday, July 5, 2020, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X