బుడుగుల కోసం బుల్లి జీప్..!!

సాధారణంగా జీపులు రహదారి కార్య కలాపాలకు ఉపయోగిస్తారు. ఇవి కఠినమైన భూభాగాలలో ప్రయాణించడానికి బాగా ఉపయోగపడతాయి. జీపులు మామూలుగా పెద్దవారు మాత్రమే డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు కనిపించే జీప్ కేవలం పిల్లలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయడం జరిగింది. పిల్లల కోసం తయారు చేయబడిన ఈ జీప్ ఎలా ఉంటుందనే మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం!

చూసారా.. పిల్లలకోసం తయారుచేయబడిన మినీ జీప్

పిల్లలకు బొమ్మ వాహనాలంటే చాలా ఇష్టం. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ జీప్ ని పెద్దవారికోసం కాకుండా పిల్లలకోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ జీప్ వల్ల చాల మంది పిల్లలు ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంది. మినీ జీప్ ఎలా కనిపిస్తుంది అని దానికోసం ఇక్కడ మనం వీడియోని చూడవచ్చు.

చూసారా.. పిల్లలకోసం తయారుచేయబడిన మినీ జీప్

ఈ వీడియో అంకితా జీప్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. జీప్ రూపకల్పనను వివరిస్తూ వీడియో ప్రారంభమవుతుంది. ఈ మినీ జీప్ ముందు భాగంలో సాధారణ జీప్, వీల్ ఆర్చ్, ఫ్రంట్ గ్రిల్ మీద నిలువు స్లాట్లు లభిస్తాయి. జీప్‌కు ఇరువైపులా రౌండ్ హెడ్‌ల్యాంప్‌లతో ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది. ఇందులో మామూలు లైట్స్ కి బదులుగా ఎల్ఇడి లైట్స్ ఉంటాయి.

చూసారా.. పిల్లలకోసం తయారుచేయబడిన మినీ జీప్

ఇది సాధారణ జీప్ లాగానే సైడ్ ప్రొఫైల్ కలిగి ఉంటుంది. కానీ టైర్లు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇది పెద్ద జీప్ లో మాదిరిగా కాకుండా, వివిధ కారణాల వల్ల మినీ జీప్ అల్లాయ్ వీల్స్ చుట్టూ మోటారుసైకిల్ టైర్లను పొందుతుంది. వెనుక వైపున ఒక జెర్రీ కెన్ మౌంట్ మరియు వెనుక తలుపుపై ఒక అల్లాయ్ వీల్ కూడా అమర్చబడి ఉంటుంది.

చూసారా.. పిల్లలకోసం తయారుచేయబడిన మినీ జీప్

ఈ మినీ జీప్ యొక్క లోపలి భాగంలో పరిశీలించినట్లయితే ఇందులో డిజిటల్ మీటర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బాడీ కలర్ మ్యాచింగ్ సీట్లు ఉంటాయి. ఈ జీప్ పైకప్పును తొలగించి ఓపెన్ టాప్ జీప్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనికి పెట్రోల్ లేదా డీజిల్ వంటివి అవసరం లేదు, ఎందుకంటే ఇది పూర్తిగా బ్యాటరీతో నడిచే కారు.

చూసారా.. పిల్లలకోసం తయారుచేయబడిన మినీ జీప్

ఈ మినీ జీప్ లో 4 బ్యాటరీలు ఉంటాయి. ఇది 80-100 కిలోమీటర్ల మధ్య పరిధిని అందిస్తుంది భావించవచ్చు. దీనికి ఒక ఫార్వర్డ్ మరియు ఒక రివర్స్ గేర్ ఉంది. ఈ మినీ జీప్ యొక్క ఖచ్చితమైన టాప్-స్పీడ్ తెలియదు, కానీ ఇది పిల్లలను లక్ష్యంగా చేసుకున్న తయారు చేసినది కనుక ఎక్కువ వేగంగా ఉండే అవకాశం ఉండదు.

మనకు వీడియోలో కనిపించే ఈ జీప్ ని తయారు చేయడానికి 3 నెలల కాలం పట్టింది. దీనిని తయారు చేయడానికి మొత్తం ఖర్చు సుమారుగా 3 లక్షల రూపాయలు. కానీ ఈ ధర నిర్దిష్టంగా ఉండదు. ఎందుకంటే కస్టమర్ చేయాలనుకుంటున్న ఆమార్పును బట్టి ధర కూడా మారె అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో కేరళకు చెందిన ఒక వ్యక్తి 2-స్ట్రోక్ మోటార్ సైకిల్ ఇంజిన్‌లో పనిచేసే మినీ వోక్స్వ్యాగన్ బీటిల్ కారును నిర్మించిన ఇలాంటి వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.

Image Courtesy: Ankita Jeep's/YouTube

More from DriveSpark

Article Published On: Monday, February 24, 2020, 12:47 [IST]
English summary
This mini Jeep runs on electricity, & is perfect for your kids [Video]. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+