భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనున్న డైమ్లర్

మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్‌కి చెందిన హెవీ డ్యూటీ ట్రక్ మరియు బస్సుల తయారీ సంస్థ డైమ్లెర్, భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయాలని యోచిస్తోంది. అంతర్జాతీయంగా ఎన్నోసార్లు పరీక్షించి, వచ్చే ఏడాది విజయవంతంగా అక్కడ లాంచ్ చేసిన తర్వాత, వెంటనే భారత్‌లో కూడా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనున్న డైమ్లర్

భారత్‌బెంజ్ మరియు ఫ్యూసో బ్రాండ్ల క్రింద మీడియం, హెవీ ట్రక్కులు మరియు బస్సులను తయారుచేసే జర్మన్ ఆటో దిగ్గజం, వచ్చే ఏడాదిలో ‘ఫ్యూచర్ మొబిలిటీ' పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనున్న డైమ్లర్

ఈ కార్యక్రమంలో భాగంగా, ఎలక్ట్రిక్ ట్రక్కు కోసం కంపెనీ తన ప్రణాళికలను వెల్లడిస్తుందని డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్ (డిఐసివి) అధికారి ఒకరు తెలిపారు.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనున్న డైమ్లర్

గత వారం, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రస్థావించారు. ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెర్సిడెస్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో తాను సంభాషించానని, భారత్‌లో వారు తమ ఎలక్ట్రిక్ ట్రక్కును ప్రయోగించాలని యోచిస్తున్నారని ఆయన తెలిపారు.

భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనున్న డైమ్లర్

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, డైమ్లర్ ప్రవేశపెట్టబోయే ఈ-సెంటర్ ట్రక్ 100 కిలోమీటర్ల డ్రైవ్ రేంజ్‌ను అందిస్తుంది మరియు 3,200 కిలోల వరకు పేలోడ్‌ను మోయగలదని తెలుస్తోంది.

MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]

భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనున్న డైమ్లర్

లగ్జరీ వాహనాలతో ప్రసిద్ది చెందిన మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ దాని మాతృ సంస్థ డైమ్లెర్ ఎజికి చెందినది. డైమ్లెర్ యొక్క వాణిజ్య వాహన విభాగం తయారు చేసే ట్రక్కులలో కూడా త్రీ-పాయింట్ స్టార్ లోగోను ఉపయోగిస్తారు.

భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనున్న డైమ్లర్

భారతదేశంలో చమురు దిగుమతులను తగ్గించి, దేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా డైమ్లర్ 2021లో తమ ఫుల్ ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనుంది.

MOST READ:కిడ్నీ తరలించడానికి లంబోర్ఘిని కారు ఉపయోగించిన పోలీసులు.. ఎక్కడో తెలుసా?

భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనున్న డైమ్లర్

భారతదేశంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంలో డైమ్లెర్ ముందంజలో ఉంటోంది. మనదేశంలో భారత్ స్టేజ్5 (బిఎస్-5) ట్రక్కులను విడుదల చేసిన ఏకైక సంస్థ కూడా డైమ్లర్ కావటం విశేషం. ఆ తర్వాత వీటిని బిఎస్-6కి మార్చడం జరిగింది.

భారత్‌లో పూర్తి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేయనున్న డైమ్లర్

డైమ్లెర్ భారతదేశంలో ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రిక్ ట్రక్కులు చాలా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ కంపెనీ వీటిని లాంచ్ చేస్తే అవి ఫస్ట్-మూవర్ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మరి మనదేశంలో ఇది ఎంత వరకూ విజయవంతం అవుతుందనేది కాలమే నిర్ణయించాలి.

MOST READ:డుకాటీ స్క్రాంబ్లర్ 1100 బైక్‌పై కనిపించిన బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలుసా ?

Most Read Articles

English summary
Daimler Plans To Launch First All Electric Truck In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X