Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 23 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Sports
IPL 2021: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం! ఆడేది అనుమానమే!
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెట్రోల్ బంక్‌లోనే బ్యాటరీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ప్రారంభించనున్న హెచ్‌పి ; వివరాలు
హిందుస్తాన్ పెట్రోలియం సంస్థ తన ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ పంపుల వద్ద స్వాపబుల్ బ్యాటరీ స్టేషన్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ వోల్ట్ అప్ బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వోల్ట్ అప్ త్వో వీలర్స్ మరియు త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలను మార్చుకునే సదుపాయాన్ని అందిస్తుంది.

ఈ భాగస్వామ్యంలో, జైపూర్‌లోని హిందూస్తాన్ పెట్రోలియం యొక్క రెండు పెట్రోల్ స్టేషన్లలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ నిర్వహించబడుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో అతిపెద్ద సమస్య వాటి ఛార్జింగ్ సమయం ఎంత వరకు ఉంటుందో కచ్చితంగా తెలియదు.

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 1 గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇంత సమయం తీసుకోవడం వల్ల ఒక సాధారణ డ్రైవర్ కి కొంత సమస్యగానే ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ప్రజలు ఏక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి కొంత వెనుకాడతారు.

ఈ సమస్యకు పరిష్కారం బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ. ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించిన బ్యాటరీని తొలగించడానికి లేదా భర్తీ చేయడానికి మరియు మరొక బ్యాటరీని ఉపయోగించుకునే సౌకర్యం ఇవ్వబడుతుంది. ఇది బ్యాటరీని ఛార్జ్ చేసే సమస్యను నివారించవచ్చు. ఇందుకోసం చాలా ఎలక్ట్రిక్ వాహన సంస్థలు మెట్రో నగరాల్లో తమ వాహనం కోసం స్వాపింగ్ స్టేషన్లను నిర్మిస్తున్నాయి.

బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల తయారీకి ఇంతకుముందు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సన్ మొబిలిటీతో చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసే సమస్యను పెద్ద ఎత్తున బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఓపెన్ చేయడం ద్వారా నివారించవచ్చు. ఈ విధంగా చేయాడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా వాహనతయారీదారులు దేశంలోని అనేక నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతి పెట్రోల్ పంపు వద్ద ఛార్జింగ్ స్టేషన్‌ను నిర్మించాలని రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని మొత్తం 69,000 పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ స్టేషన్ నిర్మించే ప్రణాళికను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సిద్ధం చేశారు. ఇవే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం జీఎస్టీని కూడా ప్రభుత్వం ఆమోదించింది.

ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రభుత్వేతర పెట్రోల్ పంపుల వద్ద ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మిస్తారు. ఛార్జింగ్ స్టేషన్లు దశలవారీగా నిర్మించబడతాయి, ఇందులో మొదటి ప్రాధాన్యత మెట్రో నగరాలకు ఇవ్వడం జరుగుతుంది.

ప్రస్తుతం మనదేశంలో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించకపోవడానికి ప్రధాన కారణం దేశంలో తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడమే. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు అతిపెద్ద సవాలు ఏమిటంటే దానికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే.

వాహనదారులు ప్రయాణించే సమయంలో వాహనంలో ఛార్జింగ్ అయిపోతే అదే సమయంలో సమీపంలో ఛార్జింగ్ స్టేషన్ లేనట్లయితే, డ్రైవర్ ఎక్కువ ఇబ్బందిపడాల్సి ఉంటుంది. ప్రతి పెట్రోల్ పంపు వద్ద ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్ చేస్తే, ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇప్పుడు ప్రతి కొత్త పెట్రోల్ బంక్ నిర్మాణంతో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ నిర్మించడం తప్పనిసరి అవుతుంది. అయితే, ఇప్పటికే నడుస్తున్న పెట్రోల్ పంపులపై ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించినప్పుడు మాత్రమే ఈ మార్పు పెద్ద ఎత్తున జరుగుతుంది.

కొన్ని నివేదిక ప్రకారం ప్రకారం, దేశంలో సుమారు 69,000 పెట్రోల్ బంక్ లు ఉన్నాయి. అన్ని పెట్రోల్ పంపుల వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సౌలభ్యం కల్పించినట్లయితే, ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. ఈ మౌలిక సదుపాయాలను కల్పించినట్లయితే రాబోయే కాలంలో ఎక్కువ ఎలక్ట్రిక్ వినియోగిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు.