ప్రొడక్షన్‌కు సిద్దమైన సుజుకి జిమ్నీ: విడుదల ఎప్పుడంటే?

మారుతి 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన టాప్ మోడళ్లలో సుజుకి జిమ్నీ సియెర్రా ఒకటి. మారుతి సుజుకి జిమ్నీ సియెర్రా మినీ ఎస్‌యూవీ విడుదల గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది, తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి సుజుకి గుర్గావ్ ప్రొడక్షన్ ప్లాంటులో జిమ్నీ ప్రొడక్షన్ ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మారుతి జిమ్నీ మినీ ఎస్‌యూవీ గురించి కంప్లీట్ డిటైల్స్ ఇవాళ్టి స్టోరీలో...

ప్రొడక్షన్‌కు సిద్దమైన సుజుకి జిమ్నీ: విడుదల ఎప్పుడంటే?

3-డోర్ల సుజుకి జిమ్నీ మినీ ఎస్‌యూవీని దేశీయంగా ఉత్పత్తి చేసి, ఇండియన్ మార్కెట్ అవసరాలతో పాటు భారత్ సమీపంలో ఉన్న విదేశీ మార్కెట్లకు ఎగుమతి కూడా చేయనున్నారు. మారుతి ప్రస్తుతం విక్రయిస్తున్న కార్ల నుండి సేకరించిన ఇంజన్, ఫ్లాట్‌ఫామ్ మరియు పలు ఇతర ఫీచర్లను సుజుకి జిమ్నీలో అందించారు.

ప్రొడక్షన్‌కు సిద్దమైన సుజుకి జిమ్నీ: విడుదల ఎప్పుడంటే?

ఎగుమతులకు సిద్దం చేస్తున్న సుజుకి జిమ్నీ తరహాలో కాకుండా, జిమ్నీ ఆధారంగా ఓ ప్రత్యేక మినీ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్ కోసం సిద్దం చేస్తున్నట్లు మారుతి సుజుకి గతంలో ఓ ప్రకటన చేసింది. 33ఏళ్ల పాటు ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి జిప్సీ తరహాలో పూర్తి స్థాయిలో దేశీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త మినీ ఎస్‌యూవీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ప్రొడక్షన్‌కు సిద్దమైన సుజుకి జిమ్నీ: విడుదల ఎప్పుడంటే?

సుజుకి జిమ్నీ సియెర్రా మినీ ఎస్‌యూవీలో సాంకేతికంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇంజన్ గరిష్టంగా 102బిహెచ్‌పి పవర్ మరియు 130ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ప్రొడక్షన్‌కు సిద్దమైన సుజుకి జిమ్నీ: విడుదల ఎప్పుడంటే?

జపాన్ మార్కెట్లో లభిస్తున్న సుజుకి జమ్నీలో 658సీసీ కెపాసిటీ గల మూడు సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 64బిహెచ్‌పి పవర్ మరియు 96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ప్రొడక్షన్‌కు సిద్దమైన సుజుకి జిమ్నీ: విడుదల ఎప్పుడంటే?

నాలుగో తరానికి చెందిన సుజుకి జిమ్నీ అత్యంత కఠినమైన ఆఫ్-రోడింగ్‌లో తన ధీటైన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. రిజిడ్ త్రీ-లిక్ యాక్సిల్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ సుజుకి జిమ్నీలో ప్రధానంగా నిలిచాయి.

Most Read Articles

English summary
Exclusive: Suzuki Jimny Production To Begins In Maruti’s Gurgaon Plant Very Soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X