నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి

నవంబర్ 2020 నెలలో జరిగిన అన్ని విభాగాల వాహన రిజిస్ట్రేషన్ డేటాను ఎఫ్ఏడిఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్) విడుదల చేసింది. ఎఫ్ఏడిఏ విడుదల చేసిన డేటా ప్రకారం, గడచిన నెలలో ప్యాసింజర్ వాహన విభాగం (ఫోర్-వీలర్) మరియు ట్రాక్టర్ వాహన విభాగం మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి.

నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి

ప్యాసింజర్ వెహికల్స్ (పివి) విభాగాన్ని గమనిస్తే, ఈ విభాగం వార్షికంగా 4.17 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్యాసింజర్ వాహన విభాగంలో గడచిన నవంబర్ 2020 నెలలో మొత్తం 2,91,001 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయని ఎఫ్ఏడిఏ తెలిపింది. గడచిన సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 2,79,365 యూనిట్లుగా ఉంది.

నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి

నవంబర్ 2020 నెలలో, ద్విచక్ర వాహన (టూ వీలర్) విభాగంలో 14,13,378 వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, నవంబర్ 2019 నెలలో వీటి సంఖ్య 17,98,201 యూనిట్లుగా నమోదై 21.40 శాతం పడిపోయినట్లు ఎఫ్ఏడిఏ తెలిపింది. కాగా, ద్విచక్ర వాహనాల ఇన్వెంటరీ కాలం ఇంకా 45 - 50 రోజులు ఉందని, అయితే ప్యాసింజర్ వాహన విభాగం మాత్రం 21 రోజుల వ్యవధిని మాత్రమే కలిగి ఉందని ఎఫ్ఏడిఏ వివరించింది.

MOST READ: ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి

మూడు చక్రాల (త్రీ-వీలర్) వాహన విభాగంలో కూడా రిజిస్ట్రేషన్లు భారీగా క్షీణించాయి. వార్షికంగా చూసుకుంటే నవంబర్ 2019లో మొత్తం 69,056 యూనిట్ల త్రీ వీలర్ రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, ఈ ఏడాది నవంబర్ (2020)లో కేవలం 24,185 యూనిట్ల త్రీ వీలర్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే, ఈ విభాగం 64.98 శాతం క్షీణతను నమోదు చేసింది.

నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి

అదేవిధంగా, వాణిజ్య వాహన (సివి) విభాగంలో కూడా రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్నాయి. నవంబర్ 2020లో మొత్తం 50,113 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లను కాగా, గడచిన సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 72,863 యూనిట్లగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఈ విభాగం వార్షికంగా 31.22 శాతం క్షీణతను నమోదు చేసింది.

MOST READ: భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి

ఈ ఏడాది నవంబర్ 2020 నెలలో వృద్ధిని నమోదు చేసిన విభాగంలో ట్రాక్టర్ విభాగం కూడా ఒకటి. భారతదేశంలో గడచిన నవంబర్ 2020 నెలలో ట్రాక్టర్ రిజిస్ట్రేషన్లు వార్షికంగా 8.47 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత నెలలో మొత్తం 49,313 యూనిట్ల ట్రాక్టర్లు రిజిస్టర్ కాగా, నవంబర్ 2019లో వీటి సంఖ్య 45,460 యూనిట్లుగా నమోదైంది.

నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి

ఎఫ్ఏడిఏ ఈ గణంకాలతో పాటుగా 2020లో 42 రోజుల పండుగ సీజన్ సమయంలో ప్రతి విభాగానికి చెందిన రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం కూడా ప్యాసింజర్ వాహనాలు మరియు ట్రాక్టర్లు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి. మిగిలిన వాహన విభాగలు క్షీణించాయి. పండుగ సీజన్ 2020లో మొత్తం వాహన రిజిస్ట్రేషన్లు (అన్ని విభాగాలలో కలిపి) 25.15 లక్షలుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే 42 రోజుల కాలంతో పోలిస్తే ఇవి 4.47 శాతం క్షీణించాయి.

MOST READ: టోల్ ప్లాజాల వద్ద ఇకపై క్యాష్ ట్రాన్సాక్షన్లు ఉండవ్.. 100 శాతం నగదు రహితం!

నవంబర్ 2020లో ఆ రెండు విభాగాలు మాత్రమే వృద్ధి చెందాయి

ఎఫ్ఏడిఏ వాహన రిజిస్ట్రేషన్ గణాంకాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ పండుగ సీజన్‌లో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాలు (నాలుగు చక్రాల వాహనాలు) మరియు ట్రాక్టర్ వాహనాల అమ్మకాలు మరియు రిజిస్ట్రేషన్లు మాత్రమే జోరుగా సాగాయని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది.

Most Read Articles

English summary
FADA (Federation Of Automobile Dealers' Association) has released the vehicle registration numbers for the month of November 2020, across all segments. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X