ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, అరెనా మరియు నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మార్కెట్లో విక్రయించిన వ్యాగన్ఆర్ 1.0 మరియు బాలెనో మోడళ్లలో తలెత్తే ఫ్యూయెల్ పంప్ సమస్య కారణంగా కంపెనీ వీటిని వెనక్కి పిలిపిస్తోంది.

ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

మొత్తం 1,34,885 యూనిట్లలో ఈ సమస్యను గుర్తించామని కంపెనీ పేర్కొంది. ఇందులో 56,663 వ్యాగన్ఆర్ కార్లు ఉన్నాయి. ఇవన్నీ నవంబర్ 15, 2018 మరియు అక్టోబర్ 15, 2019 మధ్య కాలంలో తయారైనవిగా కంపెనీ పేర్కొంది.

ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

ఇకపోతే, మిగిలిన 78,222 యూనిట్లు బాలెనో హ్యాచ్‌బ్యాక్‌లు. ఇవన్నీ జనవరి 8, 2019 నుండి నవంబర్ 4, 2019 మధ్య కాలంలో తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు మోడళ్లలోనూ ఇంధన పంపులో లోపం తలెత్తే సమస్య ఉన్నందను కంపెనీ ఈ రీకాల్ జారీ చేసినట్లు వివరించింది.

MOST READ:బహుశా ఇది దేశంలో మొదటి రిమోట్ కంట్రోల్ బోట్.. చూసారా ?

ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

రీకాల్ చేసిన వాహనాలకు సంబంధించిన యజమానులను రాబోయే కొద్ది నెలల్లో కంపెనీ డీలర్‌షిప్‌లు సంప్రదిస్తాయని, మరియు లోపభూయిష్టమైన భాగాలను యజమానులకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ తెలిపింది.

ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

లేదంటే, వ్యాగన్ఆర్ మరియు బాలెనో వాహనాల యజమానులు తమ వాహనాలు రీకాల్ జాబితాలో ఉన్నాయో లేదో కూడా సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు. పైన పేర్కొన్న కాలంతో తయారైన కార్లను కలిగి ఉన్న యజమానులు బ్రాండ్ల అధికారిక వెబ్‌సైట్‌ను (వరుసగా అరేనా మరియు నెక్సా) సందర్శించి, 'Imp Customer Info' విభాగాన్ని సందర్శించాలి.

MOST READ:స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

తమ కార్లు రీకాల్‌కు గురయ్యాయో లేదో తెలుసుకోవటానికి వాహన యజమానులు వాహనం యొక్క ఛాసిస్స్ నెంబర్ (వ్యాగన్ఆర్ కోసం MA3 సిరీస్, మరియు బాలెనో కోసం MBH సిరీస్, తరువాత 14 అంకెల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్)ను వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.

ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

వాహనం ఐడెంటిఫికేషన్ ప్లేట్‌పై కారు ఛాస్సిస్ సంఖ్య ముద్రించబడి ఉంటుంది లేదంటే ఇది వాహనం యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలలో కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రీకాల్ జాబితాలో సదరు యజమాని వాహనం లిస్ట్ చేయబడి ఉంటే, యజమానులు వెబ్‌సైట్‌లో చూపించిన విధంగా సూచనలను పాటించాల్సి ఉంటుంది.

MOST READ:టైర్ల ఉత్పత్తి కోసం కొత్త యూనిట్ ప్రారంభించిన అపోలో

ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

జనవరి 1, 2019 మరియు నవంబర్ 21, 2019 మధ్య తయారైన సియాజ్, ఎర్టిగా మరియు ఎక్స్‌ఎల్ 6 యొక్క పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్ల కోసం మారుతి సుజుకి గత సంవత్సరం రీకాల్ జారీ చేసిన సంగతి తెలిసినదే.

ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

ఆయా వాహనాల్లో మోటార్ జనరేటర్ యూనిట్‌లో తలెత్తే సమస్యల కారంణంగా కంపెనీ అప్పట్లో ఈ రీకాల్‌ను జారీ చేసింది. ఆ సమయంలో మొత్తం 63,493 వాహనాలను రీకాల్ చేశారు.

MOST READ:భారత్‌లో ఈ కార్ల రిజిస్ట్రేషన్ చట్ట విరుద్ధం కాదు

ఫ్యూయెల్ పంప్ సమస్య - 1.35 లక్షల మారుతి సుజుకి కార్లు రీకాల్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్, బాలెనో కార్ల రీకాల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి పాత వాహనాల్లో తయారీ లోపాలను గుర్తించడం, వాటిని త్వరితగతిన పరిష్కరించడంలో కంపెనీ చూపుతున్న శ్రద్ధకి మేము ఫిదా అయ్యాము. మారుతి వాహనాల యజమానుల పట్ల ఆ బ్రాండ్ కస్టమర్ కాన్షియస్‌గా ఉంటోందనటానికి ఇదే నిదర్శనం. వాహనాల యజమానలు తమ కారును సమీపంలోని డీలర్‌షిప్‌కు తీసుకువెళ్తే, వారు ఉచితంగా ఈ సమస్యను తనిఖీ చేసి, అవసరమైతే ఉచితంగా ఫ్యూయెల్ పంప్‌ను రీప్లేస్ చేస్తారు.

Most Read Articles

English summary
India's largest carmaker, Maruti Suzuki India has issued a recall for the WagonR 1.0 and the Baleno models that are sold via its Arena and NEXA dealerships, respectively. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X