2020 ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ బీఎస్6 మోడళ్లు విడుదల

అమెరికాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా విభాగం దేశీయ మార్కెట్లోకి బీఎస్6 వెర్షన్ ఫిగో, ఆస్పైర్ మరియు ఫ్రీస్టైల్ మోడళ్లను లాంచ్ చేసింది. బీఎస్6 వెర్షన్ ఫిగో, ఆస్పైర్ మరియు ఫ్రీస్టైల్ మోడళ్ల వేరియంట్లు, ధరలు, ఫీచర్లు, మైలేజ్ మరియు ఫోటోలతో పాటు పూర్తి వివరాల కోసం.

2020 ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ బీఎస్6 మోడళ్లు విడుదల

బీఎస్6 వెర్షన్ ఫోర్డ్ ఫిగో ప్రారంభ ధర రూ. 5.39 లక్షలుగా ఉంది, బీఎస్4 వెర్షన్‌తో పోల్చుకుంటే దీని ధర సుమారుగా రూ. 14,000 వరకూ అధికంగా ఉంది. టాప్ ఎండ్ టైటానియం బ్లూ వేరియంట్ ధర ఏకంగా రూ. 31,000 వరకూ పెరిగింది. ఫోర్డ్ ఫిగో బీఎస్4 మరియు బీఎస్6 ధరలు వేరియంట్ల వారీగా క్రింది పట్టికలో...

FORD FIGO - 1.2l Ti-VCT PETROL
Variants New Price (BS6) Old Price (BS4)

Ambiente Rs 539,000 Rs 523,000
Trend (New Variant) Rs 599,000 NA
Titanium Rs 635,000 Rs 599,900
Titanium Blu Rs 695,000 Rs 664,900
FORD FIGO - 1.5l TDCi DIESEL
Trend Rs 686,000 NA
Titanium Rs 725,000 Rs 689,900
Titanium Blu Rs 785,000 Rs 754,900
2020 ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ బీఎస్6 మోడళ్లు విడుదల

అయితే బీఎస్6 అప్‌డేటెడ్ ఫోర్డ్ ఫ్రీస్టైల్ ధరలు ఆశ్చర్యకరంగా తగ్గాయి. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ధరల శ్రేణి రూ. 5.89 లక్షల నుండి రూ. 8.19 లక్షల మధ్య ఉంది. పాత మోడళ్లతో పోల్చుకుంటే ఒక్కో వేరియంట్ మీద రూ. 2,000 నుండి రూ. 37,000 వరకూ ధరలు తగ్గాయి. వివిధ వేరియంట్ల వారీగా ఫోర్డ్ ఫ్రీస్టైల్ ధరలు ఇలా ఉన్నాయి...

FORD FREESTYLE - 1.2l Ti-VCT PETROL
Variants New Price (BS6) Old Price (BS4)

Ambiente Rs 589,000 Rs 591,400
Trend Rs 644,000 Rs 681,400
Titanium Rs 694,000 Rs 721,400
Titanium+ Rs 729,000 Rs 756,400
FORD FREESTYLE - 1.5l TDCi DIESEL
Trend Rs 734,000 Rs 745,900
Titanium Rs 784,000 Rs 790,900
Titanium+ Rs 819,000 Rs 836,900
2020 ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ బీఎస్6 మోడళ్లు విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ తరహాలో బీఎస్6 అప్‌గ్రేడ్‌తో వచ్చిన 2020 ఫోర్డ్ ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ధరలు కూడా తగ్గాయి. బీఎస్4 మోడళ్లతో పోల్చుకుంటే ఒక్కో వేరియంట్ మీద రూ.4,000 నుండి రూ. 38,000 వరకూ ఫోర్డ్ ఆస్పైర్ ధరలు తగ్గాయి. 2020 ఫోర్డ్ ఆస్పైర్ పాత మరియు కొత్త ధరలు ఇలా ఉన్నాయి...

FORD ASPIRE - 1.2l Ti-VCT PETROL
Variants New Price (BS6) Old Price (BS4)

Ambiente Rs 599,000 Rs 598,500
Trend Rs 659,000 Rs 663,400
Titanium Rs 709,000 Rs 737,400
Titanium+ Rs 744,000 Rs 782,400
FORD ASPIRE - 1.5l TDCi DIESEL
Trend Rs 749,000 Rs 737,400
Titanium Rs 799,000 Rs 817,400
Titanium+ Rs 834,000 Rs 862,400
2020 ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ బీఎస్6 మోడళ్లు విడుదల

ఈ మూడు వేరియంట్లలో కూడా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఫిగో, ఫ్రీస్టైల్ మరియు ఆస్పైర్ కార్లలో ఉన్నటువంటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 95బిహెచ్‌పి పవర్ మరియు 119ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 100బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లను 5-స్పీడ్ స్టాండర్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

2020 ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ బీఎస్6 మోడళ్లు విడుదల

బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్ అప్‌గ్రేడ్ మినహాయిస్తే ఈ మూడు మోడళ్లలో మరే ఇతర మార్పులు జరగలేదు. అయితే, బీఎస్6 వెర్షన్ ఫోర్డ్ ఫిగో, ఫ్రీస్టైల్ మరియు ఆస్పైర్ కార్లలో ఇది వరకూ లభించే ఫీచర్లు మరియు టెక్నాలజీని యధావిధిగా అందిస్తున్నారు.

2020 ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్ & ఫ్రీస్టైల్ బీఎస్6 మోడళ్లు విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏప్రిల్ 01, 2020 నాటికల్లా అన్ని మోడళ్లలో బీఎస్6 ప్రమాణాలను పాటించే ఇంజన్‌ను భారత ప్రభుత్వ తప్పనిసరి చేసింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బీఎస్6 అప్‌గ్రేడ్ పేరుతో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులు ధరలు పెంచుతుంటే ఫోర్డ్ మాత్రం తమ ఫ్రీస్టైల్ మరియు ఆస్పైర్ మోడళ్ల ధరలు తగ్గించింది. ఇకోస్పోర్ట్ మరియు ఎండీవర్ మోడళ్లను ఇది వరకే బీఎస్6 ఇంజన్‌తో అప్‌గ్రేడ్ చేశారు. ఫోర్డ్ ఇండియా అత్యంత సరసమైన ధరలో విక్రయిస్తున్న మోడళ్లలో ఫిగో, ఫ్రీస్టైల్ మరియు ఆస్పైర్ కార్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
2020 Ford Figo, Aspire & Freestyle BS6 Models Launched In India: Prices Start At Rs 5.39 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more