గుడ్‌వుడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్ రద్దు; డిజిటల్ ప్రసారంలో 2020 ఎడిషన్!

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు రద్దు కావటం లేదా డిజిటల్‌గా ప్రసారం కావటాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన 'గుడ్‌వుడ్ స్పీడ్‌వీక్' మోటార్‌స్పోర్ట్ కార్యక్రమాన్ని కూడా భౌతికంగా రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమాన్ని డిజిటల్‌గా నిర్వహిస్తామని, ప్రేక్షకులు ఇంటి నుంచే ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చని ఆర్గనైజర్లు తెలిపారు.

గుడ్‌వుడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్ రద్దు; డిజిటల్ ప్రసారంలో 2020 ఎడిషన్!

ఈ ఏడాది అక్టోబర్ 16 నుండి 18వ తేదీ వరకు జరగాల్సిన ఈ మూడు రోజుల కార్యక్రమం ఇప్పుడు యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే గుడ్‌వుడ్ మోటార్ సర్క్యూట్‌లో జరుగుతుంది. అయితే, ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి ఉండదు. కొద్ది మంది సిబ్బంది మరియు ఇందులో పాల్గొనే అభ్యర్థులతో మాత్రమే దీనిని నిర్వహించనున్నారు.

గుడ్‌వుడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్ రద్దు; డిజిటల్ ప్రసారంలో 2020 ఎడిషన్!

అంతేకాకుండా, సామాజిక దూరాన్ని కొనసాగించడానికి ఈ సీజన్‌లో స్పీడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్‌ను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఈవెంట్ కోసం గుడ్‌వుడ్ రన్‌వే చుట్టుకొలత చుట్టూ రేసింగ్ చేసే కార్లతో 3.86 కిలోమీటర్ల సర్క్యూట్‌ను మాత్రమే ఉపయోగించనున్నట్లు తెలిపారు.

MOST READ:హెల్మెట్ ధరించలేదని నుదుటిపై బైక్ కీ తో పొడిచిన పోలీస్, తర్వాత ఏం జరిగిందంటే

గుడ్‌వుడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్ రద్దు; డిజిటల్ ప్రసారంలో 2020 ఎడిషన్!

రేస్ ట్రాక్‌పై క్లాసిక్ కార్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతాయని, ఆయా కార్లకు సంబంధించిన యజమానులే వాటిని నడుపుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కొంతమంది ప్రముఖులు మరియు ప్రఖ్యాత రేస్ కార్ డ్రైవర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.

గుడ్‌వుడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్ రద్దు; డిజిటల్ ప్రసారంలో 2020 ఎడిషన్!

గుడ్‌వుడ్ స్పీడ్‌వీక్ 2020 ఎడిషన్ కార్యక్రమాన్ని గుడ్‌వుడ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా దాని సోషల్ మీడియా ఛానెల్‌లలో ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కొన్ని కొత్త కార్లు కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

MOST READ:మరో 5 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ : టయోటా

గుడ్‌వుడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్ రద్దు; డిజిటల్ ప్రసారంలో 2020 ఎడిషన్!

ఈ డిజిటల్ కార్యక్రమంలో భాగంగా, నిర్వాహకులు ఆన్‌లైన్ వేలం కూడా పెట్టారు. ఈ డిజిటల్ ఆక్షన్ కార్యక్రమాన్ని ప్రపంచంలోని ప్రముఖ లలిత కళల విలువదారులు మరియు వేలంపాటదారులలో ఒకరైన బోన్‌హామ్స్ నిర్వహించనుంది.

గుడ్‌వుడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్ రద్దు; డిజిటల్ ప్రసారంలో 2020 ఎడిషన్!

ఈ కార్యక్రమం చివరి రోజున ఒక ల్యాప్‌పై విజయం సాధించిన విజేత 'టేక్స్ ఇట్ ఆల్ షూటౌట్' టైటిల్‌ను దక్కించుకుంటారు. అదేవిధంగా, గతంలో పాల్గొన్న కొన్ని వేగవంతమైన కార్లు ఈ ఏడాది సీజన్‌లో కూడా పాల్గొని, సర్క్యూట్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతాయని భావిస్తున్నారు.

MOST READ:కియా మోటార్స్ యొక్క చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్

గుడ్‌వుడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్ రద్దు; డిజిటల్ ప్రసారంలో 2020 ఎడిషన్!

కాగా.. వచ్చే ఏడాది జరగనున్న గుడ్‌వుడ్ స్పీడ్‌వీక్ 2021 ఎడిషన్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని, ఈ కార్యక్రమం జరిగే సమయానికి పరిశ్రమ మరియు ఆర్థిక వ్యవస్థలు సాధారణ స్థితికి వస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే, ఈ సంవత్సరం (2020) ఎడిషన్ కోసం టికెట్లను కొనుగోలు చేసిన అభిమానులు వాటిని వచ్చే ఏడాది నిర్వహించే 2021 ఎడిషన్ గుడ్‌వుడ్ స్పీడ్‌వీక్ కోసం వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

గుడ్‌వుడ్ హిల్ క్లైంబ్ ఈవెంట్ రద్దు; డిజిటల్ ప్రసారంలో 2020 ఎడిషన్!

గుడ్‌వుడ్ స్పీడ్‌వీక్ 2020 ఎడిషన్ బౌతిక రద్దుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అభిమానులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ కార్యక్రమాన్ని నేరుగా వీక్షించలేకపోయినా, డిజిటల్ మాద్యమం ద్వారా పూర్తి వినోదాన్ని పొందే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. అసలు పూర్తిగా కార్యక్రమం రద్దు కావటం కన్నా, భౌతికంగా రద్దయి, డిజిటల్‌గా ప్రసారం కావటం ఉత్తమమే అని చెప్పాలి.

MOST READ:వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

Most Read Articles

English summary
In what comes as refreshing news following cancellation announcements of major motor shows across the globe, the organisers of the Goodwood Speedweek have announced that the 2020 edition of the event has been physically cancelled, but will be held digitally. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X