గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

గోర్డాన్ ముర్రే ఆటోమోటివ్ తమ సరికొత్త సూపర్‌కారు టి.50 పరదాలను తొలగించింది. ఈ సూపర్‌కారును అతి తక్కువ బరువుతో, కారు మధ్యలో ఇంజన్ ఉండేలా మూడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో తయారు చేశారు. ఇప్పటివరకు తయారు కాని స్వచ్ఛమైన, తేలికైన మరియు అత్యంత డ్రైవర్-సెంట్రిక్ కారు టి.50 అని చెప్పబడుతోంది.

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

ఈ కారును గోర్డాన్ ముర్రే రూపొందించారు, గత శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ సూపర్ కార్లలో ఒకటైన మెక్లారెన్ ఎఫ్ 1ను కూడా ఈయనే డిజైన్ చేశారు. గోర్డాన్ ముర్రే యొక్క 50 సంవత్సరాల కెరీర్‌ను జరుపుకోవడానికి గుర్తుగా ఈ కొత్త సూపర్‌కారుకు 'టి.50' అనే పేరును పెట్టారు. ముర్రే రూపొందించిన 50వ కారు (రోడ్ అండ్ రేస్ రెండూ కలిపి) కూడా టి.50 సూపర్‌కార్ కావటం విశేషం.

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

సరికొత్త గోర్డాన్ ముర్రే టి.50 సూపర్‌కారులో 3.9 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 11,500 ఆర్‌పిఎమ్ వద్ద 654 బిహెచ్‌పి శక్తిని మరియు 9000 ఆర్‌పిఎమ్ వద్ద 467 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను కాస్‌వర్త్ నిర్మించింది. కాస్‌వర్త్ తెలిపిన సమాచారం ప్రకారం, ఈ ఇంజన్ 12,100 ఆర్‌పిఎమ్ వద్ద రెడ్‌లైన్ చేయగా, 71 శాతం గరిష్ట టార్క్ లభిస్తుంది.

MOST READ:జెసిబి ప్రమాదంలో బైకర్ ప్రాణాలు కాపాడిన మహీంద్రా బొలెరో; ఎలాగో తెలుసా ?

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

గోర్డాన్ ముర్రే టి.50 సూపర్ కార్ చాలా తేలికైనది, దీని మొత్తం బరువు కేవలం 986 కిలోలు మాత్రమే. ఇది ప్రపంచంలోనే అత్యంత తేలికైన రోడ్-వెర్షన్ సూపర్ కారు టి.50 టన్నుకు 663 బిహెచ్‌పిల శక్తి-నుండి-బరువు నిష్పత్తి (పవర్-టూ-వెయిట్ రేషియో)ని కలిగి ఉండటుంది.

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

ఇందులోని ఇంజన్ రెండు-స్టేట్-ఆఫ్-ట్యూన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మొదటిది 9000 ఆర్‌పిఎమ్‌కి పరిమితం చేయబడినది మరియు రెండవది 12,100 ఆర్‌పిఎమ్ రెడ్‌లైన్‌కు పరిమితం చేయబడినది.

MOST READ:దొంగిలించిన ఎటిఎం కార్డు పాస్‌వర్డ్ అడగడానికి వచ్చిన దొంగ ; తర్వాత ఎం జరిగిందో తెలుసా !

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

ఈ ఇంజన్ టి.50కి 100 శాతం బెస్పోక్‌గా ఉంటుంది మరియు అసమానమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. గోర్డాన్ ముర్రే టి.50 ఏ కారులో అత్యంత అధునాతనమైన మరియు ప్రభావవంతమైన ఏరోడైనమిక్స్‌ను కలిగి ఉంటుంది. దీనికి వెనుక వైపు 400 మిమీ ఫ్యాన్ మౌంట్ చేయబడి ఉంటుంది. ఈ ఫ్యాన్ 48వి ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, ఇది అధిక డౌన్‌ఫోర్స్‌ను అందించడానికి కారు కింద వాయు ప్రవాహాన్ని వేగవంతం చేయటానికి సహకరిస్తుంది.

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

డౌన్‌ఫోర్స్ మొత్తాన్ని మరింత విస్తరించడానికి ఫ్యాన్ వెనుక డిఫ్యూజర్‌లు మరియు ఏరోఫాయిల్స్ సపోర్ట్ ఇస్తాయి. ఇవి ఈ సూపర్ కారుకు అధిక వేగం వద్ద మరియు కార్నరింగ్స్ వద్ద మరింత స్థిరత్వాన్ని అందిస్తాయి.

MOST READ:బైకర్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన జయ బచ్చన్ : ఎందుకంటే ?

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

గోర్డాన్ ముర్రే టి.50 సూపర్ కార్ ఆరు ఏరోడైనమిక్స్ మోడ్‌లతో వస్తుంది. అవి - హై డౌన్‌ఫోర్స్, విమాక్స్, స్ట్రీమ్‌లైన్ మరియు టెస్ట్. ఈ నాలుగు మోడ్స్‌ను కాక్‌పిట్ నుండి మ్యాన్యువల్‌గా కంట్రోల్ చేయవచ్చు. మిగిలిన రెండు మోడ్స్‌లో ‘ఆటో' మరియు ‘బ్రేకింగ్'లను డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం, యాక్సిలరేషన్ మరియు ఇతర కారకాలపై ఆధారపడి ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేయబడుతాయి.

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

గోర్డాన్ ముర్రే టి .50 వెనుక భాగంలో ఉన్న ఏరోఫాయిల్స్ సూపర్ కార్ యొక్క సున్నితమైన రూపకల్పనలో సజావుగా కలిసిపోతాయి. టి.50 డిజైన్ చాలా క్లీన్‌గా, అందంగా మరియు స్వచ్ఛమైనదిగా ఉంటుంది. ఇతర ఆధునిక సూపర్ కార్లలో కనిపించే వింగ్స్, స్కర్ట్స్ మరియు ఏరో ఫ్లాప్‌ల వంటివి ఇందులో ఉండవు.

MOST READ:వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

టి.50 పూర్తిగా ఇన్-హౌస్ డిజైన్‌తో తయారు చేయబడినది, ఈ జట్టుకు గోర్డాన్ ముర్రే స్వయంగా నాయకత్వం వహించారు. గోర్డాన్ ముర్రే డిజైన్ కావడంతో, ఐకానిక్ మెక్‌లారెన్ ఎఫ్ 1 సూపర్ కార్‌కు టి.50కి స్పష్టమైన పోలిక ఉంది. ఇందులో క్లీన్ లైన్స్, డైహెడ్రల్ డోర్స్, కాంపాక్ట్ సైజింగ్, టికెట్ విండోస్, సెంట్రల్ మౌంటెడ్ రూఫ్ ఎయిర్-స్కూప్ మరియు సెంట్రల్-పొజిషన్డ్ డ్రైవర్ సీట్ వంటివి ఉన్నాయి.

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

గోర్డాన్ ముర్రే టి.50 క్యాబిన్ విషయానికి వస్తే, ఈ సూపర్ కారు ఎక్స్‌టీరియర్ మాదిరిగానే అదే స్వచ్ఛమైన డ్రైవర్-సెంట్రిక్ తత్వాన్ని కలిగి ఉంటుంది. సెంట్రల్-పొజిషన్డ్ డ్రైవర్ సీటులోకి ప్రవేశించడం చాలా సులభం (మెక్లారెన్ ఎఫ్ 1తో పోల్చితే), ఇరువైపులా మరో ఇద్దరు ప్రయాణీకులకు కూడా తగినంత స్థలం ఉంటుంది. ఆశ్చర్యకరంగా, టి.50 సూపర్ కార్ కూడా విశాలమైన 300-లీటర్ బూట్ సామర్థ్యంతో వస్తుంది.

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

కాక్‌పిట్‌లో రెండు స్క్రీన్‌లతో ఫైటర్-జెట్ ద్వారా ప్రేరణ పొంది డిజైన్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మెయిన్ ఎక్విప్‌మెంట్ కన్సోల్ ఉంటాయి. డ్రైవర్ కోసం ఎసి వెంట్స్‌ను తెలివిగా రెండు స్క్రీన్లపై అమర్చారు, ప్యాసింజర్ల కోసం ఎసి వెంట్స్‌ను తలుపుల మీద అమర్చారు. కాక్‌పిట్ చుట్టూ అనలాగ్ స్విచ్ గేర్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉంటాయి, ఇవి వివిధ ఇతర విధులను కూడా నియంత్రించడానికి సహకరిస్తాయి.

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

గోర్డాన్ ముర్రే తన టి.50 సూపర్ కార్ కేవలం కాన్సెప్ట్‌గానే మిగిలిపోకుండా, ఉత్పత్తి దశకు వెళుతుందని, జనవరి 2022 నాటికి మార్కెట్లో లభిస్తుందని తెలిపారు. ఈ సూపర్ కార్ ధర జిబిపి 2.36 మిలియన్ (ప్లస్ టాక్స్) ఉంటుందని మరియు ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లకు పరిమితం చేయబడుతుందని చెప్పారు.

గోర్డాన్ ముర్రే టి.50 - కారు మధ్యలో ఇంజన్, లైట్-వెయిట్, 3 సీట్లు మాత్రమే

గోర్డాన్ ముర్రే టి.50 సూపర్‌కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రపంచానికి మెక్లారెన్ ఎఫ్ 1 లాంటి అధ్భుతమైన కార్లను పరిచయం చేసిన వ్యక్తి గోర్డాన్ ముర్రే. ఇప్పుడు ఆయన బుర్ర నుంచి పుట్టుకొచ్చినదే ఈ కొత్త టి.50 సూపర్ కార్. కేవలం 986 కిలోల బరువు మరియు అత్యంత శక్తివంతమైన వి 12 ఇంజన్‌తో రూపుదిద్దుకున్న సూపర్‌కారు ఈ గోర్డాన్ ముర్రే టి.50.

Most Read Articles

English summary
Gordon Murray Automotive has taken the wraps off the all-new T.50 - an ultra-lightweight, mid-engined, three-seater supercar. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X