దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

భారతదేశంలో క్రమక్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం కూడా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొత్త పథకనాలను మరియు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే, దేశంలోని చమురు కంపెనీల సహాయంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను వేగంగా విస్తరించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

ఇటీవలి నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు మద్దతుగా ఛార్జింగ్ స్టేషన్ల కియోస్క్‌ను పొందవచ్చు. దేశంలో సుమారు 69,000 లకు పైగా ఇంధన కేంద్రాలు ఉన్నాయని ప్రభుత్వం నివేదించింది మరియు ప్రతి పెట్రోల్ పంపు వద్ద కనీసం ఒక ఈవీ ఛార్జర్‌నైనా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు వేధించే ప్రధాన సమస్య చార్జింగ్ మరియు ఆయా వాహనాల రేంజ్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విజయవంతమైతే, ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉన్న కస్టమర్లు మరియు భవిష్యత్తులో ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల అతిపెద్ద భయాన్ని (రేంజ్/చార్జింగ్ సమస్యను) తొలగిస్తుంది.

MOST READ:భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

కంపెనీ-ఓన్డ్, కంపెనీ-ఆపరేటెడ్ (కోకో) పెట్రోల్ పంపులన్నీ తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈవీ ఛార్జర్‌లను కలిగి ఉండాల్సి రావచ్చు. వీటితో పాటుగా, కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇకపై ఎవరైనా కొత్త ఇంధన పంపులను ఏర్పాటు చేయాలంటే వారు కనీసం ఒక రూపంలోనైనా ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందించాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, దేశంలో కొత్త పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయబడుతున్నాయి, అవి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఎంచుకుంటున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే, దేశంలో ఇకపై కొత్తగా ఏర్పాటు చేయబడే పెట్రోల్ పంపులు ప్రభుత్వ చొరవతో సంబంధం లేకుండా ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

MOST READ:అంబులెన్స్ ముందుకు వెళ్ళడానికి దారి ఇవ్వని కార్ డ్రైవర్‌కి ఏం జరిగిందో చూసారా ?

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

విద్యుత్ శాఖా మంత్రి ఆర్ కె సింగ్ ఇటీవలి విలేకరుల సమావేశంలో చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను ఉద్దేశించి "దేశంలోని అన్ని కోకో పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయడానికి వారి పరిపాలనా నియంత్రణలో ఉన్న తమ చమురు మార్కెటింగ్ సంస్థలకు (ఒఎంసి) ఆర్డర్ ఇవ్వవచ్చు" అని అన్నారు.

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల గురించి ఇటీవల జరిగిన చర్చలో, మంత్రిత్వ శాఖ తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ప్రారంభ దశలో, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడానికి టైర్ 1 నగరాలపై దృష్టి సారించనున్నారు. ఈ జాబితాలో ఢిల్లీ మరియు ఎన్‌సిఆర్, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వడోదర మరియు భోపాల్ నగరాలు ఉన్నాయి.

MOST READ:కార్ డ్రైవ్ చేసి అమ్మమ్మ ప్రాణాలను కాపాడిన 11 ఏళ్ల బాలుడు [వీడియో]

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

ఈ కొత్త నియమం నగరాలు మరియు హైవేలలోని ఇంధన స్టేషన్లకు వర్తిస్తుంది, ఇది ఇప్పటికే కొనుగోలు చేసిన ఈవీ యజమానులకు అలాగే కొత్తగా కొనుగోలు చేయబోయే వినియోగదారులకు వారి ఎలక్ట్రిక్ వాహనాలతో అంతర్రాష్ట్ర ప్రయాణాన్ని పరిగణలోకి తీసుకునేలా ప్రోత్సహిస్తుంది.

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

సాధారణంగా ఛార్జింగ్ స్టేషన్లు చైనా వంటి అంతర్జాతీయ మార్కెట్ల నుండి దిగుమతి అవుతాయి. అయితే, ప్రధాన మంత్రి మేక్-ఇన్-ఇండియా ఉద్యమానికి మద్దతుగా, దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లను మరియు సంబంధిత పరికరాలను తయారు చేయాలని, ఇలాంటి వాటిని దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించాలని విద్యుత్ మంత్రి సూచించారు.

MOST READ:నీటిపై నడిచే బైక్.. వీడియో చూసారా ?

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

ఇలా చేయటం వలన, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడి, ఇలాంటి వాహనాలను వినియోగించే వారి అవసరాలు కూడా తీరుతాయి. అంతేకాకుండా, చార్జర్లను లోకలైజ్ చేయటం ద్వారా స్థానిక తయారీదారుల వ్యాపారాన్ని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇది దేశంలో వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి మరియు స్థిరమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి సహాయపడుతుంది.

దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లు

దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, ఇది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు అతిపెద్ద అడ్డంకిగా ఉన్న రేంజ్/చార్జింగ్ సమస్యను తొలగిస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కువ ఛార్జర్లు కలిగి ఉండటం వలన, ఎలక్ట్రిక్ వాహన యజమానులు తమ వాహన రేంజ్‌తో పనిలేకుండా నగరం లోపల తరచుగా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా, వాహన కాలుష్యం కొంతవరకైనా తగ్గుతుంది. హైవేలలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లయితే, ఎలక్ట్రిక్ వాహనాల్లో కస్టమర్లు మైళ్ల దూరాన్ని సైతం సులువుగా చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Most Read Articles

English summary
The India Government plans to rapidly expand the number of charging stations throughout the country with the help of oil companies. According to recent reports, petrol pumps across the country could get charging stations kiosk to support EV adoption in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X