ఇండియన్ మార్కెట్లో ఒకే సారి నాలుగు కార్లను ఆవిష్కరించిన గ్రేట్ వాల్ మోటార్స్
చైనా కార్ల తయారీదారు అయిన గ్రేట్ వాల్ మోటార్స్ ఎట్టకేలకు తమ ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆటో ఎక్స్‌పో 2020 లో హవల్ బ్రాండ్ తమ శ్రేణి నుంచి నాలుగు మోడళ్లను ఆవిష్కరించింది. ఇప్పుడు హవల్ బ్రాండ్ నుంచి ఇండియన్ మార్కెట్లోకి హవల్ హెచ్ 9, హవల్ ఎఫ్ 7, హవల్ ఎఫ్ 5 మరియు హవల్ ఎఫ్ 7 ఎక్స్ లు విడుదలయ్యాయి.

భారతీయ మార్కెట్లో ప్రవేశించే ప్రణాళికను కంపెనీ ఇటీవల కాలంలో ధ్రువీకరించింది. జిడబ్ల్యుఎం కూడా తమ వాహనాలను ఈ సంవత్సరం ఇండియాలో విడుదల చేయాలనీ ఆలోచిస్తోంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన హవల్ యొక్క మోడల్స్ మిడ్ సైజ్ ఎస్‌యూవి విభాగంలో భాగంగా ఉంటాయి. హవల్స్ మోడల్స్ ఇప్పుడు మార్కెట్లో కియా సెల్టోస్, టాటా హారియర్ మరియు ఎంజి హెక్టర్ వంటి వాటికి పోటీగా నిలుస్తున్నాయి.

గ్రేట్ వాల్ మోటార్స్ ఇప్పుడు భారతదేశంలో పెట్రోల్ ఇంజన్ ఎంపికలను ప్రవేశపెట్టనుంది. హవల్ ఎఫ్ 5 లోని ఇంజన్ ఎంపికలలో ఒకే 1.5 లీటర్ టర్బోపెట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇంజిన్ 166 బిహెచ్‌పి మరియు 285 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

హవల్ ఎఫ్ 7 మరియు ఎఫ్ 7 ఎక్స్ మోడల్స్ కూడా అదే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంటుంది. ఇది హెచ్ 5 లాగ అదే శక్తిని మరియు టార్క్ ఫిగర్స్ ని ఉత్పత్తి చేస్తుంది. హవల్ ఎఫ్ 7 కూడా పెద్ద 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 221 బిహెచ్‌పి మరియు 385 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఈ రెండు మోడళ్లలోనూ 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటాయి.

హవల్ బ్రాండ్స్ యొక్క కొలతలను గమనించినట్లయితే హవల్ ఎఫ్ 5 కారు 4,470 మిమీ పొడవు, 1,857 మిమీ వెడల్పు, 1,638 మిమీ ఎత్తుని కలిగి ఉండటమే కాకుండా 150 ఎంఎం వీల్‌బేస్‌ని కూడా కలిగి ఉంటుంది.

హవల్ ఎఫ్ 5 తో పోలిస్తే హవల్ ఎఫ్ 7 మరియు ఎఫ్ 7 ఎక్స్ కొంత పెద్దవిగా ఉంటాయి. ఇవి 4,620 మిమీ పొడవు, 1,846 మిమీ వెడల్పు, 1,690 ఎంఎం ఎత్తుని కలిగి ఉంటుంది. హవల్ ఎఫ్ 7 మోడల్లో 169 మిమీ పెద్ద బేస్ కూడా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
చైనా మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థలలో గ్రేట్ వాల్ మోటార్స్ ఒకటి. ఇది ప్రతి విభాగంలోనూ అనేక ఉత్పత్తులను అందిస్తున్నాయి. భారతదేశంలో ఎంజి బ్రాండ్స్ విజయవంతం కావడంతో జిడబ్ల్యుఎం ఇప్పుడు హవల్ శ్రేణి ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన హవల్ యొక్క అన్ని మోడల్స్ మిడ్ సైజు ఎస్‌యూవి విభాగంలో ఉంటాయి. ఇవి ఇండియన్ మార్కెట్లో కియా సెల్టోస్, టాటా హారియర్ మరియు ఎంజి హెక్టర్ వంటి వాటికి ధరలో కూడా ప్రత్యర్థిగా ఉంటూ పోటీని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








