ఇండియన్ మార్కెట్లో హోండా అమేజ్ బిఎస్-6, ధర రూ. 6.09 లక్షలు

ఇండియన్ మార్కెట్లో అమ్మకాలపరంగా పరుగులు తీస్తున్న హొండా కంపెనీ తన బ్రాండ్ నుంచి మరో కొత్త కారుని విడుదల చేసింది. దీని పేరే హొండా అమేజ్. ఈ హొండా యొక్క ఫీచర్స్, ప్రైస్ వంటి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియన్ మార్కెట్లో హోండా అమేజ్ బిఎస్-6, ధర రూ. 6.09 లక్షలు

హోండా అమేజ్ బిఎస్ 6 మోడల్స్ భారతదేశంలో రూ. 6.09 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి ప్రారంభమయ్యాయి. ఇందులో పెట్రోల్ మరియు డీజిల్ రెండు వేరియంట్లలో విడుదలయ్యాయి. ఇవి బిఎస్-4 వెర్షన్ కంటే 27,000 నుంచి 51,000 రూపాయల ఎక్కువ ధరను కలిగి ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో హోండా అమేజ్ బిఎస్-6, ధర రూ. 6.09 లక్షలు

బిఎస్-6 మరియు బిఎస్-4 కార్ల మధ్య ధరలలో ఉన్న డిఫరెన్స్ మనం ఈ క్రింది పట్టికలో చూడవచ్చు

వేరియంట్ బిఎస్ 6 ప్రైస్

బిఎస్ 4 ప్రైస్

డిఫరెన్స్
1.2P E MT Rs 6.10 Lakh Rs 5.93 Lakh Rs 17,000
1.2P S MT Rs 6.82 Lakh Rs 6.73 Lakh Rs 9,000
1.2P V MT Rs 7.45 Lakh Rs 7.33 Lakh Rs 12,000
1.2P VX MT Rs 7.93 Lakh Rs 7.81 Lakh Rs 12,000
1.2P S CVT Rs 7.72 Lakh Rs 7.63 Lakh Rs 9,000
1.2P V CVT Rs 8.35 Lakh Rs 8.23 Lakh Rs 12,000
1.2P VX CVT Rs 8.76 Lakh Rs 8.64 Lakh Rs 12,000
1.5D E MT Rs 7.56 Lakh Rs 7.05 Lakh Rs 51,000
1.5D S MT Rs 8.12 Lakh Rs 7.85 Lakh Rs 27,000
1.5D V MT Rs 8.75 Lakh Rs 8.45 Lakh Rs 30,000
1.5D VX MT Rs 9.23 Lakh Rs 8.93 Lakh Rs 30,000
1.5D S CVT Rs 8.92 Lakh Rs 8.65 Lakh Rs 27,000
1.5D V CVT Rs 9.55 Lakh Rs 9.25 Lakh Rs 30,000
1.5D VX CVT Rs 9.96 Lakh Rs 9.66 Lakh Rs 30,000
ఇండియన్ మార్కెట్లో హోండా అమేజ్ బిఎస్-6, ధర రూ. 6.09 లక్షలు

హొండా అమేజ్ బిఎస్-6 పెట్రోల్ వెర్షన్ 1.2 లీటర్ నాలుగు సిలిండర్ల నాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది బిఎస్-4 మోడల్స్ లాగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5- స్పీడ్ మాన్యువల్ ఆటోమోటివ్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో హోండా అమేజ్ బిఎస్-6, ధర రూ. 6.09 లక్షలు

హోండా అమేజ్ బిఎస్ 6 డీజిల్ మోడళ్లలో 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో ఉంటుంది. ఇందులో (ఎన్‌ఎస్‌సి) నైట్రోజన్-ఆక్సిజన్ స్టోరేజ్ క్యాటలిస్ట్ మరియు డీజిల్ పార్టికల్ ఫిల్టర్ ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానించబడినప్పుడు పవర్ మరియు పెర్పామెన్స్ యొక్క గణాంకాలు 100 బిహెచ్‌పి / 200 ఎన్ఎమ్ టార్క్ వద్ద ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో హోండా అమేజ్ బిఎస్-6, ధర రూ. 6.09 లక్షలు

బిఎస్-6 డీజిల్ ఎంటి మోడళ్లలో 2.7 కిలోమీటర్లు మరియు డీజిల్ సివిటి మోడళ్లలో 2.8 కిలోమీటర్ల సామర్థ్యం తగ్గుతుంది. కానీ బిఎస్-4 మోడల్స్ లో అవుట్గోయింగ్ లీటరుకి 27.4 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. సివిటి మోడల్స్ లో లీటరుకు 23.8 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది.

ఇండియన్ మార్కెట్లో హోండా అమేజ్ బిఎస్-6, ధర రూ. 6.09 లక్షలు

హొండా అమేజ్ కారులో ఎటువంటి మార్పులు పెద్దగా చేయలేదు. ఈ బిఎస్-6 కంప్లైంట్ మోడల్స్ యొక్క ధరలను గమనించినట్లయితే రూ. 6.09 లక్షల నుంచి రూ. 9.96 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో హోండా అమేజ్ బిఎస్-6, ధర రూ. 6.09 లక్షలు

హొండాకి సంబంధించిన వార్తల ప్రకారం ఇటీవల తమ సంస్థ గ్రేటర్ నోయిడా తయారీ కర్మాగారంలో శాశ్వత ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ పథకాన్ని ప్రకటించింది. హొండా కంపెనీ రాబోయే ఆటో ఎక్స్‌పోలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నది. ఎందుకంటే రాబోయే రెండు సంవత్సరాల్లో విక్రయించిన మూలధనాన్ని మొత్తం తిరిగి పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

ఇండియన్ మార్కెట్లో హోండా అమేజ్ బిఎస్-6, ధర రూ. 6.09 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హొండా అమేజ్ బిఎస్-6 యొక్క ధర చాలా కన్వీనెంట్ గా ఉందని భావిస్తున్నాము. ఈ వాహనం వినియోగదారులకు సౌకర్యవంతగా ఉండటమే కాకుండా , అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఇది మార్కెట్లో మారుతి డిజైర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 30, 2020, 13:58 [IST]
English summary
Honda Amaze BS6 Models Launched In India Starting At Rs 6.10 Lakh Ex-Showroom. Read in Telugu.
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+