Just In
- 18 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
జనసేన-బీజేపీ అభ్యర్థులను మద్దతివ్వండి, ఇక వైసీపీ దాష్టీకానికి ముగింపే: పవన్ కళ్యాణ్
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా కార్లపై ఆగస్ట్ ఆఫర్స్: క్యాష్ డిస్కౌంట్స్ వివరాలు
మరికొద్ది రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, హోండా కార్స్ ఇండియా ఆగస్టు 2020 నెల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆగస్ట్ నెలలో హోండా బ్రాండ్ తమ లైనప్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై ఈ ఆఫర్లను అందిస్తోంది.

ఈ ఆఫర్లలో భాగంగా, భారీ నగదు తగ్గింపులు, ఎక్సేంజ్ బోనస్ మరియు ఇతర ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. ఈ ఆఫర్ కింద కవర్ చేయబడిన మోడళ్లలో సివిక్, సిటీ మరియు అమేజ్ మోడళ్లు ఉన్నాయి. ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలను పొందవచ్చు.

హోండా కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు బ్రాండ్ డీలర్‌షిప్‌లలో లేదా ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా మోడల్‌ను బుక్ చేసినప్పుడు ఈ ప్రత్యేక ఆఫర్‌లను పొందవచ్చు. హోండా అందిస్తున్న బిఎస్6 వాహనాలపై ఈ ఆఫర్లు ఆగస్టు 31, 2020 వరకు అందుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా డిస్కౌంట్ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
MOST READ:డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా

హోండా అమేజ్ కాంపాక్ట్-సెడాన్‌లో అన్ని వేరియంట్లపై కంపెనీ రూ.27,000 రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. కొత్త అమేజ్ కోసం తమ పాత కారును మార్పిడి (ఎక్సేంజ్) చేసుకోవాలనుకునే వినియోగదారులకు నాల్గవ మరియు ఐదవ సంవత్సరానికి పొడిగించిన వారంటీ ప్లస్ రూ.15 వేల అదనపు ఎక్సేంజ్ బోనస్ లభిస్తుంది.

దీనికి ప్రత్యామ్నాయంగా, పాత కార్లను ఎక్సేంజ్ చేయని కస్టమర్లకు నాల్గవ మరియు ఐదవ సంవత్సరానికి అదే పొడిగించిన వారంటీతో పాటుగా కొత్త అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కొనుగోలుపై రూ.3,000 వరకు అదనపు నగదు తగ్గింపు లభిస్తుంది.
MOST READ:అంగారక గ్రహంపైకి నాసా పంపిన స్పేస్ షిప్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

ఇక హోండా సిటీ సెడాన్ విషయానికి వస్తే, కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఐదవ తరం సిటీతో పాటుగా కంపెనీ తమ నాల్గవ తరం సిటీ సెడాన్‌ను కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కంపెనీ ఇప్పుడు తమ నాల్గవ తరం మోడల్‌పై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది.

నాల్గవ తరం హోండా సిటీ సెడాన్ వేరియంట్‌ను బట్టి రూ.1.6 లక్షల వరకు ప్రయోజనాలను కంపెనీ అందింస్తోంది. సిటీ సెడాన్ ఎమ్‌వి ఎమ్‌టి మరియు వి ఎమ్‌టి వేరియంట్‌లపై రూ.45,000 ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు మరియు రూ.20,000 ఎక్సేంజ్ బోనస్‌లు ఉన్నాయి.

మిడ్-స్పెక్ సిటీ వి సివిటి వేరియంట్‌పై రూ.90,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.55,000 నగదు తగ్గింపు మరియు రూ.35,000 వరకు అదనపు ఎక్సేంజ్ బోనస్ ఉన్నాయి. విఎక్స్ సివిటిని రూ.70,000 తగ్గింపు రూ.50,000 ఎక్సేంజ్ బోనస్‌తో ఆఫర్ చేస్తున్నారు.

జెడ్ఎక్స్ ఎమ్‌టి మరియు జెడ్ఎక్స్ సివిటి వంటి టాప్-ఎండ్ మోడళ్లపై అత్యధికంగా వరుసగా రూ.1.3 లక్షలు, రూ.1.6 లక్షల తగ్గింపును అందిస్తున్నారు. ఇందులో జెడ్‌ఎక్స్ ఎమ్‌టిపై రూ.80,000 క్యాష్ డిస్కౌంట్, జెడ్‌ఎక్స్ సివిటిపై రూ.1.1 లక్షల క్యాష్ డిస్కౌంట్లతో పాటుగా ఈ రెండు వేరియంట్లపై రూ.50,000 ఎక్సేంజ్ బోనస్‌లు ఉన్నాయి.
MOST READ:కొడుకు ఇచ్చిన ఐడియాతో తండ్రి సృష్టించిన ఎలక్ట్రిక్ సైకిల్ ; చూసారా..!

ఇక చివరగా, కంపెనీ అందిస్తున్న లగ్జరీ సెడాన్ హోండా సివిక్‌ను కంపెనీ ఇటీవలే కొత్త బిఎస్6 డీజిల్ ఇంజన్ వెర్షన్‌తో అప్‌గ్రేడ్ చేసింది. హోండా సివిక్ డీజిల్ మోడల్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ నెలలో అత్యధిక ప్రయోజనాలను పొందనున్నారు. డీజిల్ వేరియంట్లపై హోండా ఏకంగా రూ.2.5 లక్షల నగదు తగ్గింపును అందిస్తోంది. పెట్రోల్‌తో నడిచే మోడల్‌పై లక్ష రూపాయల వరకు నగదు తగ్గింపును అందిస్తోంది.

హోండా ఆగస్ట్ నెల ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కొత్తగా విడుదల చేసిన ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌పై కంపెనీ ఎలాంటి ఆఫర్లను అందించడం లేదు. అయితే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాత తరం హోండా సిటీ కారుపై కంపెనీ ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ రెండు సిటీ మోడళ్ల మధ్య ధరల వ్యత్యాసాన్ని పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే విడుదలైన చేసిన సివిక్ బిఎస్6 డీజిల్‌పై కంపెనీ అత్యధిక ప్రయోజనాలను అందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.