హోండా కార్లకు హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రాల నుంచి ఈజీ కార్ లోన్స్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలైన కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లతో ఓ కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హోండా కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ఈ రెండు బ్యాంకులు కూడా సులువైన ఫైనాన్సింగ్ స్కీమ్‌లను ఆఫర్ చేయనున్నాయి.

హోండా కార్లకు హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రాల నుంచి ఈజీ కార్ లోన్స్

కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటె్ ప్రత్యేకించి 4వ తరం హోండా సిటీ సెడాన్ కోసం ఓ ప్రత్యేకమైన ఫైనాన్స్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా, కేవలం 6.99 శాతం వడ్డీ (ఇది వరకెన్నడూ ఇలాంటి వడ్డీ రేట్లను ఆఫర్ చేయలేదు) రేటుకే రుణాన్ని మంజూరు చేయనున్నారు. అంతేకాదు ఈఎమ్ఐల విషయంలో కూడా ప్రతి లక్ష రూపాయలకు కేవలం రూ.999ల (అతి తక్కువ) వాయిదాతో ఈ ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రారంభించారు. ఇంకా కస్టమర్లు తమ పాత కార్లను ఎక్సేంజ్ చేయాలనుకుంటే, వారికి అదనంగా ఏక్సేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.

హోండా కార్లకు హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రాల నుంచి ఈజీ కార్ లోన్స్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో ఒప్పందం విషయానికి వస్తే.. కస్టమర్లు స్టెప్-అప్ ఈఎమ్ఐ మరియు బలూన్ ఈఎమ్ఐ (లోన్ వ్యవధి ముగిసే సమయానికి) కాంబినేషన్ యొక్క ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చు. హోండా అందిస్తున్న అన్ని రకాల కార్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

MOST READ: అపాచే ఆర్‌టిఆర్ 160 బిఎస్6 బైక్ ధరను పెంచిన టీవీఎస్

హోండా కార్లకు హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రాల నుంచి ఈజీ కార్ లోన్స్

హెచ్‌డిఎఫ్‌సి అందిస్తున్న ఈ స్పెషల్ లోన్ 7 ఏళ్ల కాల పరిమితితో వస్తుంది, ఈ కాల పరిమితిలో మొదట కొన్ని సంవత్సల పాటు అతి తక్కువ ఈఎమ్‌ఐని చెల్లించాల్సి ఉంటుంది. లోన్ ముగిసే నాటికి ఈఎమ్ఐ పెరుగుతూ వస్తుంటుంది, దీనినే బెలూన్ ఈఎమ్ఐ అంటారు. ఈ లోన్ కోసం వడ్డీ రేటు 9.25 శాతంగా ఉంటుంది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రతి ఏటా ఈఎమ్ఐ మొత్తం పెరుగుతూ వస్తుంది.

హోండా కార్లకు హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రాల నుంచి ఈజీ కార్ లోన్స్

ఇక వేరే హోండా వార్తల్లోకి వెళితే.. ఈ నెలాఖరులో హోండా తమ సరికొత్త 2020 సిటీ సెడాన్‌ను మార్కెట్లో విడదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త మోడల్ ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. కొలతల పరంగా కూడా ప్రస్తుతం డిస్‌కంటిన్యూ చేయనున్న సిటీ సెడాన్‌తో పోలిస్తే కొత్త సిటీ సెడాన్ మరింత పొడవుగా ఉండొచ్చని అంచనా.

MOST READ: హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్‌పై రూ.55,500ల భారీ డిస్కౌంట్

హోండా కార్లకు హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రాల నుంచి ఈజీ కార్ లోన్స్

కొత్త 2020 హోండా సిటీ సెడాన్ సరికొత్త ఎల్ఈడి హెడ్‌లైట్స్, రీవర్క్ చేయబడిన బంపర్స్, కొత్త డ్యాష్‌బోర్డ్, 7-ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అలెక్సా రిమోట్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ వంటి విశిష్టమైన సదుపాయాలతో ఇది రానుంది.

హోండా కార్లకు హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రాల నుంచి ఈజీ కార్ లోన్స్

కొత్త అప్‌గ్రేడెడ్ హోండా సిటీ సెడాన్ కారులో 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇవి స్టాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా లభ్యం కానున్నాయి.

MOST READ: కియా కార్నివాల్ ఎంపివిని కొనుగోలు చేసిన మాజీ ఇండియన్ క్రికెటర్

హోండా కార్లకు హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రాల నుంచి ఈజీ కార్ లోన్స్

ఫైనాన్స్ కంపెనీలతో హోండా ఒప్పందంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర నష్టాల బాటలో సాగుతోంది. ఈ నేపథ్యంలో, కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు దాదాపు అన్ని రకాల బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. హోండా కార్ల కోసం హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా సంస్థలు అందిస్తున్న ఫైనాన్స్ స్కీమ్స్ వినియోగదారులకు చాలా సౌకర్యంగా ఉండబోతున్నాయి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India Limited has announced a partnership with multiple financial institutions in order to make their range of vehicles more affordable for buyers. The brand has partnered with Kotak Mahindra Bank Limited and with HDFC Bank to offer new financial options to customers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X