ఫ్యూయెల్ పంప్ సమస్య, భారత్‌లో హోండా కార్ల రీకాల్

జపాన్ కార్ బ్రాండ్ హోండా భారత్‌లో విక్రయిస్తున్న కొన్ని మోడళ్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య కారణంగా కార్లను వెనక్కి పిలిపించింది (రీకాల్). కంపెనీ విక్రయించిన వివిధ మోడళ్ల కార్లలో దాదాపు 65,000 కార్లలో ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. రీకాల్ చేసిన కార్లలో ఉచితంగా ఈ సమస్యను పరిష్కరించనున్నారు.

ఫ్యూయెల్ పంప్ సమస్య, భారత్‌లో హోండా కార్ల రీకాల్

గత 2018లో తయారైన కార్లలో ఈ ఫ్యూయెల్ పంప్ సమస్యను గుర్తించినట్లు హోండా పేర్కొంది. కార్ల పనితీరు మెరుగ్గా ఉండేందుకు మరియు వినియోగదారులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను 2018లో తయారైన కార్లలో ఉచితంగా ఫ్యూయెల్ పంప్‌ను రీప్లేస్ చేయనున్నారు.

ఫ్యూయెల్ పంప్ సమస్య, భారత్‌లో హోండా కార్ల రీకాల్

హోండా ప్రకటించిన తాజా రీకాల్ ప్రకారం, రీకాల్ చేయబడిన హోండా కార్లలో ఉపయోగించిన ఫ్యూయెల్ పంప్‌లోని లోపం కారణంగా ఇంజన్‌కు ఇంధన సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఫలింతగా కారు మద్యలో ఆగిపోవటం లేదా స్టార్ట్ కాకపోవటం వంటి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. అంతేకాకుండా కంబస్టియన్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయిన ఇతర ఇంజన్ పార్ట్‌లను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

ఫ్యూయెల్ పంప్ సమస్య, భారత్‌లో హోండా కార్ల రీకాల్

ఈ రీకాల్‌కు గురైన మొత్తం కార్లలో 32,498 హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కార్లు, 16,434 హోండా సిటీ సెడాన్ కార్లు 7,500 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు, 7,057 డబ్ల్యూఆర్-వి కార్లు, 1,622 బిఆర్-వి కార్లు, 360 బ్రయో కార్లు 180 హోండా సిఆర్-వి ఎస్‌యూవీలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

ఫ్యూయెల్ పంప్ సమస్య, భారత్‌లో హోండా కార్ల రీకాల్

హోండా కార్స్ ఇండియా ఈ రీకాల్ గురించి తమ కస్టమర్లకు ప్రత్యేకంగా తెలియజేయనుంది. హోండా నుంచి సమాచారం అందుకున్న కస్టమర్లు తమకు అనుకూలమైన సమయంలో అధీకృత హోండా డీలర్‌షిప్‌ను సందర్శిస్తే ఉచితంగా తమ కారులో ఈ ఫ్యూయెల్ పంప్‌ను రీప్లేస్ చేస్తారు. ఈ రీకాల్‌లో భాగంగా జూన్ 20, 2020వ తేదీ నుండి దశల వారీగా కస్టమర్ల వాహనాల్లో ఫ్యూయెల్ పంపులను రీప్లేస్ చేయనున్నారు.

ఫ్యూయెల్ పంప్ సమస్య, భారత్‌లో హోండా కార్ల రీకాల్

ఒకవేళ హోండా నుంచి సమాచారం రాకపోయినా కస్టమర్లు తమ వాహనానికి సంబంధించిన 17 అంకెల విన్ (వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్)ను హోండా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని తెలుసుకోవచ్చు. ఇందులో హోండా ఓ కొత్త మైక్రో సైట్‌ని కూడా ప్రారంభించింది.

ఫ్యూయెల్ పంప్ సమస్య, భారత్‌లో హోండా కార్ల రీకాల్

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కస్టమర్లు గుంపులు గుంపులుగా హోండా డీలర్‌షిప్‌లను సందర్శించకుండా అపాయింట్‌మెంట్ ప్రాతిపధికన షోరూమ్‌లను సందర్శించాలని హోండా కోరుతోంది. మరోవైపు డీలర్‌షిప్ కేంద్రాలు కూడా పరిమిత సిబ్బందితో పనిచేస్తున్న నేపథ్యంలో కస్టమర్లు పరిస్థితిని అర్థం చేసుకోవాలని హోండా విజ్ఞప్తి చేసింది.

ఫ్యూయెల్ పంప్ సమస్య, భారత్‌లో హోండా కార్ల రీకాల్

ఇక వేరే హోండా వార్తల్లోకి వెళితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోండా ఇటీవలే కస్టమర్ల కోసం కొత్త సర్వీసింగ్ విధానాన్ని ప్రారంభించింది. ఈ డోర్‌స్టెప్ సర్వీస్‌లో భాగంగా నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే నిపుణులైన హోండా మెకానిక్‌లు వచ్చి కార్లను సర్వీస్ చేసి వెళ్తారు. ఈ సమయంలో మెకానిక్‌లు సామాజిక దూరం పాటించడంతో పాటుగా పూర్తి శానిటైజేషన్ నియమాలను కూడా పాటిస్తారని హోండా పేర్కొంది.

ఫ్యూయెల్ పంప్ సమస్య, భారత్‌లో హోండా కార్ల రీకాల్

హోండా ఫ్యూయెల్ పంప్ విషయంలో ప్రకటించిన రీకాల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా పేర్కొన్న ఫ్యూయెల్ పంప్ సమస్య కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. కాకపోతే, పైన పేర్కొన్నట్లుదా భవిష్యత్తులో కసమర్లకు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంగా హోండా కార్స్ ఇండియా ముందుగానే రీకాల్ ప్రకటించింది. అయితే, ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో ఈ ఫ్యూయెల్ పంప్ రీప్లేస్‌మెంట్ ప్రక్రియ కాస్తంత నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, June 13, 2020, 16:12 [IST]
English summary
Honda Cars India has announced a recall on a range of models over a possible fault in the fuel pump. As per the recall report, more than 65,000 cars of various models could have been affected and are being serviced. Read in Telugu.
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+