కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

జపనీస్ కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్లో ఇటీవలే తమ సరికొత్త (ఐదవ) తరం హోండా సిటీని మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, కొత్త తరం సిటీ సెడాన్‌తో పాటుగా పాత (నాల్గవ) తరం సిటీ సెడాన్‌ను కూడా మార్కెట్లో విక్రయిస్తామని కంపెనీ ప్రకటించిన విషయం కూడా తెలిసినదే.

కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

ఈ నేపథ్యంలో, హోండా తాజాగా తమ మునుపటి (నాల్గవ) తరం హోండా సిటీ సెడాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. నాల్గవ తరం హోండా సిటీ సెడాన్ ఇప్పుడు కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే 'ఎస్‌వి ఎమ్‌టి' మరియు 'వి ఎమ్‌టి' లభ్యం కానుంది. మార్కెట్లో నాల్గవ తరం హోండా సిటీ సెడాన్ ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి:

-> హోండా సిటీ ఎస్‌వి ఎమ్‌టి - రూ.9.29 లక్షలు

-> హోండా సిటీ వి ఎమ్‌టి - రూ.9.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)

కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

పాత తరం (ఓల్డ్-జెన్) హోండా సిటీ సెడాన్ కేవలం పెట్రోల్ ఇంజన్ మరియు మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్ల కంపెనీ భారీగా ధరలను తగ్గించింది. ఎస్‌వి ఎమ్‌టి వేరింట్‌పై రూ.60,000 మరియు వి ఎమ్‌టి వేరియంట్‌పై రూ.66,000 ధరను తగ్గించింది.

MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్

కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

ఓల్డ్-జెన్ హోండా సిటీ ప్రస్తుతం ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6600 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 118 బిహెచ్‌పి శక్తిని మరియు 4600 ఆర్‌పిఎమ్ వద్ద 145 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

నాల్గవ తరం హోండా సిటీ సెడాన్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా బ్రాండ్ యొక్క స్వంత కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, బహుళ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి.

MOST READ:త్వరలో భారత్‌కి రానున్న రూ. 6.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్.. మీరు చూసారా

కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

నాల్గవ తరం హోండా సిటీ సెడాన్‌ను కంపెనీ తొలిసారిగా 2014 జనవరిలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ అప్పటి నుండి ఇప్పటి వరకూ సుమారు 3.5 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొత్త ఐదవ-తరం సిటీ సెడాన్‌తో పాటుగా నాల్గవ తరం సిటీ సెడాన్ అమ్మకాలు కూడా కొనసాగుతాయ కంపెనీ పేర్కొంది.

కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

ఇటీవలే మార్కెట్లో విడుదలైన ఐదవ తరం హోండా సిటీ కూడా మార్కెట్లో మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది. మార్కెట్లో ఈ మోడల్ ధరలు రూ.10.90 లక్షల నుండి రూ.14.65 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. ఈ రెండు తరాల మోడళ్ల ఎంట్రీ లెవల్ వేరియంట్‌ల మధ్య ధర వ్యత్యాసం గమనించినట్లయితే సుమారు రూ1.6 లక్షలు, టాప్-ఎండ్ వేరియంట్‌ల మధ్య ధర వ్యత్యాసం రూ. 90,000 లుగా ఉంది.

MOST READ:ఆగస్ట్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

పాత తరం హోండా సిటీని రీలాంచ్ చేసిన సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మరియు డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ, "మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో సరికొత్త 5వ హోండా సిటీ అత్యధిక అమ్మకాలతో అగ్ర స్థానాన్ని ఆక్రమించి, ఈ విభాగంపై ఆధిపత్యం చలాయిస్తూ కొత్త బెంచ్ మార్కును సృష్టించింది. ఈ విభాగంలో నాల్గవ తరం హోండా సిటీ సెడాన్‌కు కూడా మంచి క్రేజ్ ఉంది, ఈ నేపథ్యంలో ఇందులో బిఎస్6 వెర్షన్ అమ్మకాలను కొనసాగించాలని మేము నిర్ణయించుకున్నామని" అన్నారు.

కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

"ఎస్‌వి మరియు వి వేరియంట్లలో ఫోర్త్ జనరేషన్ హోండా సిటీని కొనసాగించడంతో, మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో ఈ మోడల్ విభిన్న ధరలతో అనేక వేరియంట్లలో లభ్యమవుతుంది. ధరల పరంగా సిటీ బ్రాండ్ విస్తృతమైన కస్టమర్లకు అందుబాటులో ఉంచాలని మేమూ ఈ నిర్ణయం తీసుకున్నామ"ని ఆయన అన్నారు.

MOST READ:మినీ క్లబ్‌మన్ స్పెషల్ ఎడిషన్ కారు కొన్న మలయాళ సినిమా యాక్టర్, ఎవరో తెలుసా ?

కొత్తగా రీలాంచ్ అయిన పాత హోండా సిటీ; కన్ఫ్యూజ్ అయ్యారా..?

పాత (నాల్గవ) తరం హోండా సిటీ సెడాన్ రీలాంచ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పాత (4వ) తరం హోండా సిటీ సెడాన్ కంపెనీ గతంలో మంచి అమ్మకాలను తెచ్చిపెట్టింది. ప్రీమియం డిజైన్, ఫీచర్లు, కంఫర్ట్‌లతో ఇది ఈ విభాగంలో అనేక మంది కస్టమర్లను ఆకర్షించింది. ఈ మోడల్ అమ్మకాలను కొనసాగించాలని కంపెనీ తీసుకున్న నిర్ణయంతో హోండా సిటీ ఇప్పుడు రెండు డిజైన్లలో విభిన్న ధరలు మరియు వేరియంట్లలో కస్టమర్ల అవసరాలకు, బడ్జెట్‌కు తగినట్లుగా అందుబాటులో ఉండనుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India has relaunched the fourth-generation City in the country. The old-gen sedan will be offered in two variants: 'SV MT' and 'V MT'. Prices for the fourth-generation City start at Rs 9.29 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X