బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పడిపోయిన హోండా కార్ల విక్రయాలు

హోండా మోటార్స్ జనవరి 2020లో కేవలం బీఎస్6 పెట్రోల్ కార్లను మాత్రమే డెలివరీ చేసింది. డిసెంబర్ 2019 చివరికల్లా బీఎస్4 కార్ల సేల్స్‌ను పూర్తిగా నిలిపేశారు. దాంతో హోండా కార్ సేల్స్ జనవరి 2020లో 71% పడిపోయాయి.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పడిపోయిన హోండా కార్ల విక్రయాలు

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ బీఎస్4 కార్ల విక్రయాలను డిసెంబర్ 2019 చివరికి పూర్తిగా నిలిపేశాము మరియు జనవరి 2020 నుండి కేవలం బీఎస్6 పెట్రోల్ కార్లను మాత్రమే విక్రయించినట్లు తెలిపింది. దీంతో సేల్స్ భారీగా పడిపోయినట్లు పేర్కొన్నారు.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పడిపోయిన హోండా కార్ల విక్రయాలు

ఏప్రిల్ 01, 2020 నుండి అమల్లోకి రానున్న బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా హోండా లైనప్‌లో ఉన్న కార్లను బీఎస్6 ప్రమాణాలతో మార్కెట్లో అందుబాటులో ఉంచింది. గడిచిన జనవరి 2020లో బీఎస్6 వెర్షన్ సిటీ, సివిక్ మరియు సీఆర్‌వి పెట్రోల్ వేరియంట్లను మాత్రమే విక్రయించింది. మిగతా మోడళ్లను అతి త్వరలో బీఎస్6 ప్రమాణాలతో లాంచ్ చేస్తామని ప్రకటించింది.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పడిపోయిన హోండా కార్ల విక్రయాలు

జనవరి 2020లో బీఎస్6 వెర్షన్ హోండా అమేజ్ ఒక్క కారును కూడా విక్రయించలేదు. 2020 హోండా అమేజ్ బీఎస్6 కారును జనవరి నెల చివరలో మార్కెట్లోకి లాంచ్ చేశారు. బీఎస్6 ప్రమాణాలను పాటించే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ వేరియంట్లలో ప్రవేశపెట్టారు. వీటి ధరల శ్రేణి రూ. 6.1 లక్షలు నుండి రూ. 9.96 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పడిపోయిన హోండా కార్ల విక్రయాలు

చివరిసారిగా అప్‌డేట్ చేసిన హోండా సిటీ కారును అప్పుడే బీఎస్6 వెర్షన్‌లో లాంచ్ చేశారు. ప్రస్తుతం బీఎస్6 సిటీ కారు మార్కెట్లో అందుబాటులో ఉంది. కొత్త తరం హోండా సిటీ అంతర్జాతీయ విపణిలో అందుబాటులో ఉంది, దీనిని మరో నెలలో దేశీయంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పడిపోయిన హోండా కార్ల విక్రయాలు

ఢిల్లీకి సమీపంలో ఉన్న గ్రేటర్ నోయిడాలోని తపుకర ప్రొడక్షన్ ప్లాంటులో బీఎస్6 అప్‌డేట్స్ పొందిన కార్ల ఉత్పత్తిని ఇదివరకే ప్రారంభించారు. జనవరి 2020లో దేశవ్యాప్తంగా 5,299 కార్లను విక్రయించినట్లు హోండా పేర్కొంది. జనవరి 2019లో విక్రయించిన 18,261 యూనిట్లతో పోల్చుకుంటే దేశీయ విక్రయాలు 70.98 శాతం క్షీణించాయి.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పడిపోయిన హోండా కార్ల విక్రయాలు

కంపెనీ అన్ని కార్లను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తుండటంతో రానున్న నెలల్లో కూడా డెలివరీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కస్టమర్లకు ఇబ్బంది లేకుండా, డెలివరీ డేట్ సమయానికల్లా హామీ ఇచ్చిన తేదీలోపే డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వారానికి సరిపడా బీఎస్4 కార్ల స్టాక్ డీలర్ల వద్ద మెయింటెన్ చేస్తున్నట్లు హోండా పేర్కొంది.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పడిపోయిన హోండా కార్ల విక్రయాలు

బీఎస్6 అప్‌డేట్స్ మాత్రమే కాదు, 2019లో ప్రారంభమైన మాంద్యం ప్రభావం, 2020లో ప్యాసింజర్ కార్ల మీద అలాగే ఉంది. సేల్స్ పెంచుకునేందుకు ఎన్నో రకాల ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందించి సేల్స్ టార్గెట్స్ పూర్తి చేస్తున్నారు.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పడిపోయిన హోండా కార్ల విక్రయాలు

జనవరి 2020లో మొత్తం రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు 5 లక్షల రూపాయల వరకూ ఇతర ప్రయోజనాలను సీఆర్-వి మోడల్ మీద అందించారు. బీఎస్6 హోండా అమేజ్ ఈ మధ్యనే విడుదల కావడంతో హోండా కంపెనీకి మంచి సేల్స్ సాధించిపెట్టే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India sales decline 71% in Jan 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X