వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

'హోండా కార్స్ ఇండియా' భారత మార్కెట్లో మరో కొత్త బిఎస్6 వాహనాన్ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. హోండా అందిస్తున్న ఆల్ట్రా ప్రీమియం సెడాన్ 'హోండా సివిక్‌' ఇప్పటి వరకూ పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది. కాగా.. ఇందులో కంపెనీ ఇప్పుడు బిఎస్6 డీజిల్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అతి త్వరలో డీజిల్ వేరియంట్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు హోండా ఇటీవలే ప్రకటించింది.

వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

కార్అండ్‌బైక్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, హోండా సివిక్ బిఎస్6 డీజిల్ వెర్షన్ వచ్చే వారం దేశీయ విపణిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. డీజిల్ సెడాన్ కోసం కంపెనీ ఇప్పటికే ప్రీ-బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

హోండా సివిక్ బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన డీజిల్ ఇంజన్‌నే కొత్తగా బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఈ మోడల్‌లో ఉపయోగిస్తున్నారు. బిఎస్4 లోని 1.6 లీటర్ ఐ-డిటిఇసి ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 118 బిహెచ్‌పి శక్తిని మరియు 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేసేది. బిఎస్‌లో కూడా ఇదే రకమైన పెర్ఫార్మెన్స్ ఫిగర్స్ ఉండే ఆస్కారం ఉంది.

వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

డీజిల్ వెర్షన్ హోండా సివిక్ సెడాన్‌లో ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేకుండా కేవలం స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. బిఎస్6 డీజిల్ ఇంజన్ కూడా బిఎస్4 డీజిల్ ఇంజన్ మాదిరిగానే సమానమైన మైలేజ్‌, పవర్, టార్క్‌లను ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

కొత్త హోండా సివిక్ సెడాన్‌లో ఇంజన్ అప్‌డేట్స్ మినహా వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవని తెలుస్తోంది. పెట్రోల్ వెర్షన్లలో లభించే అన్ని ఫీచర్లు డీజిల్ వెర్షన్లలో కూడా లభ్యం కానున్నాయి. ఈ పదవ తరం హోండా సివిక్‌ను న్యూ-ఏజ్ డిజైన్‌తో తయారు చేశారు. ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, సి-ఆకారపు ఎల్‌ఈడి టెయిల్-లాంప్స్, క్రోమ్ సరౌండ్స్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన బూట్ లిప్ స్పాయిలర్ వంటీ డిజైన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

ఇంటీరియర్ భాగాన్ని గమనిస్తే, ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెడ్ కమాండ్‌లు, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, స్టార్ట్ / స్టాప్ ఫంక్షన్ కోసం పుష్-బటన్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

హోండా సివిక్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో పాటు, పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో కూడా లభిస్తుంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి శక్తిని మరియు 174 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

హోండా సివిక్ భారత మార్కెట్లో స్కోడా ఆక్టేవియా మరియు హ్యుందాయ్ ఎలాంట్రా మోడళ్లకు నేరుగా పోటీ ఇస్తుంది. హోండా సివిక్ పెట్రోల్ మోడల్ V, VX మరియు ZX అనే మూడు వేరియంట్లలో ఆఫర్ చేయబడుతోంది. దేశీయ విపణిలో ఈ మోడల్ ధరలు రూ.17.94 లక్షల నుండి 21.25 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

వచ్చే వారంలో విడుదల కానున్న హోండా సివిక్ బిఎస్6 డీజిల్ - పూర్తి వివరాలు

హోండాకు సంబంధించి ఇతర వార్తలను గమనిస్తే, హోండా ఇటీవలే తమ కొత్త 2020 WR-V ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని మరోసారి ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్లలో మార్పులు చేర్పులు చేసి తయారు అప్‌గ్రేడ్ చేశారు. మార్కెట్లో ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ.8.5 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

source :carandbike

More from DriveSpark

Article Published On: Friday, July 3, 2020, 17:56 [IST]
English summary
Honda Cars India is gearing up to launch another vehicle in the India n market. The company is currently selling their flagship sedan, the Civic only in petrol variants. However, automaker recently announced that they will be introducing a diesel variant soon in the Indian market. Read in Telugu.
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+