Just In
Don't Miss
- News
డీఎంకెతో ఎంఐఎం పొత్తు..? కుదరకపోతే ఒంటరిగానే... తమిళ గడ్డపై మజ్లిస్ మ్యాజిక్ పనిచేస్తుందా?
- Sports
బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు
భారత మార్కెట్లో హోండా విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'సిఆర్-వి'లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. మార్కెట్లో హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ ధరను రూ.29.50 లక్షలుగా నిర్ణయించారు. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్‌లో అనేక కొత్త ఫీచర్లు లభ్యం కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్ స్టాండర్డ్ మోడల్ కంటే రూ.1.23 లక్షల అధిక ధరను కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది. హోండా ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఫేస్‌లిఫ్టెడ్ హోండా సిఆర్-విని ఆధారంగా చేసుకొని ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను తయారు చేశారు.

కొత్త సిఆర్-వి లిమిటెడ్ ఎడిషన్ మోడల్ రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇందులో రెగ్యులర్ మోడల్‌లో కనిపించే క్రోమ్-ఫినిష్డ్ యూనిట్ స్థానంలో కొత్త గ్లోస్ బ్లాక్ గ్రిల్ ఉంటుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ ఇప్పుడు మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే

వెనుక భాగంలో రీడిజైన్ చేసిన బంపర్ ఎస్‌యూవీ యొక్క ప్రీమియం రూపాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇందులో ఎల్ఈడి కాంబినేషన్ ల్యాంప్స్, బూట్ లిడ్ పొడవు అంతటా ఉన్న క్రోమ్ స్ట్రిప్ ఉంటాయి. ఈ ఎస్‌యూవీలో ఫంకీగా కనిపించే 18 ఇంచ్ డ్యూయెల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

స్పెషల్ ఎడిషన్ సిఆర్-వి మోడల్ ఎక్స్టీరియర్‌లో కొద్దిపాటి మార్పులు చేసినప్పటికీ, దాని ఓవర్ సిల్హౌట్ మాత్రం స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్ కూడా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే దాని బోల్డ్ డిజైన్‌తో మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.
MOST READ:బాలీవుడ్ నటి చేసిన పనికి ఆనందంలో మునిగిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఎం చేసిందో తెలుసా?

స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే స్పెషల్ ఎడిషన్ హోండా సిఆర్-విలో కొన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి. ఇందులో కార్నరింగ్ లైట్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 4-వే పవర్-అడ్జస్టబల్ ప్యాసింజర్ సీట్, హ్యాండ్స్ ఫ్రీ పవర్డ్ టెయిల్‌గేట్ మరియు ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెగ్యులర్ సిఆర్-విలో లభించే అన్ని ఇతర ఫీచర్లు ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లోనూ కనిపిస్తాయి. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రిమోట్ ఇంజన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

ఇంకా ఇందులో డ్రైవర్ అసిస్ట్ మోనిటర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, లేన్ వాచ్ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఆటో హిల్-హోల్డ్ అసిస్ట్, డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ కోసం డ్యూయల్ ఐ-ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి యాక్టివ్ అండ్ ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

సిఆర్‌వి-వి స్పెషల్ ఎడిషన్‌ను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ ఓ ప్రత్యేకమైన కిట్‌ను కూడా అందిస్తోంది. స్పెషల్ ఎడిషన్ కిట్‌గా పిలిచే ఈ కిట్‌లో రన్నింగ్ బోర్డ్స్ కోసం కాస్మెటిక్ బిట్స్, డోర్ మిర్రర్ కోసం గార్నిష్ మరియు స్టెప్ ఇల్యుమినేషన్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి.
MOST READ:నీటిపై ల్యాండ్ అయ్యే విమానం మీరు ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఇంజన్ విషయానికి వస్తే, సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్, ఫోర్-సిలిండర్, ఎస్ఓహెచ్‌సి ఐ-విటెక్ ఇంజన్ గరిష్టంగా 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 154 బిహెచ్‌పి పవర్‌ను మరియు 4,300 ఆర్‌పిఎమ్ వద్ద 189 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ మోడల్ ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. ఇందులో ఆఫర్ చేసే అదనపు ఫీచర్లు ధరకు తగిన విలువను జోడిస్తాయి. కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ అప్‌గ్రేడ్‌లతో వచ్చిన ఈ లిమిటెడ్ ఎడిషన్ సిఆర్-వి ఈ ఏడాది పండుగ సీజన్‌లో హోండా అమ్మకాలను పెంచడంలో సహకరించే అవకాశం ఉంది.