హోండా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ వస్తోంది - వివరాలు

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం భారత మార్కెట్లో మరో సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గడచిన 2015లో అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలై, మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ లేటెస్ట్ ఎస్‌యూవీని ఇండియాలో కూడా విడుదల చేయాలని కంపెనీ భావించింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేకపోయింది.

హోండా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ వస్తోంది - వివరాలు

నిజానికి హోండా హెచ్‌ఆర్-వి మోడల్‌ని గత 2017 లోనే భారత్‌లో విడుదల చేయడానికి కంపెనీ ఆసక్తి కనబరిచింది. కానీ అప్పటి మార్కెట్ పరిస్థితుల్లో ఇది సాధ్యం కాలేదు. ఇప్పుడు కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి విటారా బ్రీజా వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలు మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించిన నేపథ్యంలో హోండా కూడా ఈ విభాగంలో కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

హోండా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ వస్తోంది - వివరాలు

హోండా ఇప్పుడు తమ హెచ్‌ఆర్-వి మిడ్-సైజ్ ఎస్‌యూవీలో నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌ను పరిచయం చేసే పనిలో ఉంది. గాడివాడి నివేదిక ప్రకారం, హోండా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఈ ఎస్‌యూవీ విడుదల కార్యక్రమాన్ని కంపెనీ కొన్ని నెలల పాటు (మే 2021) వరకు వాయిదా వేసినట్లు సమాచారం.

MOST READ: చూడటానికి కార్ లాగా కనిపించే కొత్త ఎలక్ట్రిక్ బైక్

హోండా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ వస్తోంది - వివరాలు

హోండా హెచ్‌ఆర్-వి మిడ్-సైజ్ ఎస్‌యూవీ సుమారు 4,400 మిమీ పొడవు, 1,790 మిమీ వెడల్పు మరియు 1,590 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఇది పొడవులో 4 మీటర్ల కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి రాదు, ఫలితంగా దీనిలో ఇంటీరియర్ క్యాబిన్ స్పేస్ కూడా అధికంగా ఉండనుంది. దీని వీల్‌బేస్ 2,610 మి.మీ గా ఉంటుంది.

హోండా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ వస్తోంది - వివరాలు

ఇంజన్స్ పరంగా చూస్తే, కొత్త-తరం హోండా హెచ్ఆర్-వి పెట్రోల్ మరియు డీజిల్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉండొచ్చని సమాచారం. ఇందులో పూర్తి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లాంప్స్, 16 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనున్నాయి. ఇందుసో వెబ్‌లింక్ కనెక్టివిటీ కూడా ఉంటుందని అంచనా.

MOST READ: భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

హోండా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ వస్తోంది - వివరాలు

ఇంకా ఇందులో 32 కనెక్ట్-కార్ టెక్, అలెక్సా రిమోట్‌లను సపోర్ట్ చేసే 7.0 ఇంచ్ ఎమ్ఐడి హోండా కనెక్ట్ టెలిమాటిక్స్ సిస్టమ్, ప్యాడల్ షిఫ్టర్స్ (సివిటి వేరియంట్ కోసం మాత్రమే), రియర్ సన్‌షేడ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

హోండా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ వస్తోంది - వివరాలు

ఇక హోండాకి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే, హోండా ద్విచక్ర వాహన విభాగం 'హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్' ఇండియా తన ద్విచక్ర వాహనాల కోసం వారంటీ నమోదు వ్యవధిని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హోండా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు కస్టమర్లు, చేసిన రోజు తర్వాత నుంచి 550 రోజులలో (లేదా 1.5 సంవత్సరాల కన్నా తక్కువ సమయం లోపుగా) అధనంగా మూడేళ్ల పాటు పొడగించబడిన (ఎక్స్‌టెండెడ్) వారంటీ కోసం నమోదు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ: సాహస యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన మోటార్ రహదారులు ఇవే

హోండా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ వస్తోంది - వివరాలు

ఈ పథకం దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుందని, ఇప్పటికే దెబ్బతిన్న ప్రధాన భాగాలను కనీస ఖర్చుతో కవర్ చేస్తుందని హోండా వివరించింది. అధనపు వారంటీని కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా వాహనాన్ని విక్రయించినట్లయితే, ఆ వారంటీని కూడా బదిలీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ సదుపాయం వలన ద్విచక్ర వాహనాల రీసేల్ వ్యాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది.

హోండా నుంచి మరో సరికొత్త ఎస్‌యూవీ వస్తోంది - వివరాలు

భారత్‌లో హోండా హెచ్ఆర్-వి మోడాల్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అమెరికన్ కార్ మార్కెట్లో మోస్ట్ డిమాండెడ్ మిడ్-సైజ్ ఎస్‌యూవీగా ఉన్న ఈ హోండా హెచ్ఆర్-వి భారత మార్కెట్లో విడుదలైతే మంచి విజయాన్ని సొంత చేసుకోవటం ఖాయం. హోండా హెచ్‌ఆర్-వి ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్ మరియు ఎంజి హెక్టర్ వంటి మోడళ్లకు కూడా పోటీ ఇచ్చే ఆస్కారం ఉంది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర సుమారు 13 లక్షలు, ఎక్స్‌షోరూమ్ వరకూ ఉండొచ్చని అంచనా.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
The launch of the Honda HR-V in the Indian market has been in the pipeline for quite a while now. Honda had first showcased an interest in launching the SUV back in 2017 but did not. However, now the company is working introducing the new-gen version for the HR-V mid-size SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X