హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న సివిక్ సెడాన్ మరియు సిఆర్-వి ఎస్‌యూవీ మోడళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు ప్రధాన కారణంగా, కంపెనీ తమ వాహనాల ఉత్పత్తిని వేరే ప్లాంట్‌కు తరలించాలని నిర్ణయించడమే.

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

హోండా ఇప్పటి వరకూ ఈ వాహనాలను గ్రేటర్ నోయిడాలోని ప్లాంట్లో ఉత్పత్తి చేసేది. కాగా, ఇప్పుడు ఆ ప్లాంట్‌లో వీటి ఉత్పత్తిని ముగించి, తమ మొత్తం ఉత్పత్తి యూనిట్‌ను రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న హోండా తపుకర ప్లాంట్‌కు తరలించాలని కంపెనీ నిర్ణయించింది.

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

అయితే, ఆటోమొబైల్, టూ వీలర్ మరియు పవర్ ప్రొడక్ట్ వ్యాపారం కోసం అన్ని హెడ్ ఆఫీస్ కార్యక్రమాలు అలాగే ఇండియా ఆర్ అండ్ డి సెంటర్ మరియు స్పేర్ పార్ట్స్ ఆపరేషన్లు (గిడ్డంగితో సహా) గ్రేటర్ నోయిడా నుండే కొనసాగుతాయని కంపెనీ నిర్ధారించింది.

MOST READ:మళ్ళీ బయటపడిన లంచం తీసుకుంటూ దొరికిన పోలీస్ వీడియో.. మీరు చూసారా ?

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

దేశంలో కోవిడ్-19 లాక్డౌన్ తర్వాత హోండా తమ కార్యకలాపాలు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభించింది. హోండా గడచిన సెప్టెంబర్ 2020 నుండి తమ రోజువారీ ఉత్పత్తి పరిమాణాన్ని విజయవంతంగా కోవిడ్ రాకమునుపు ఉన్న స్థాయికి పెంచింది. అంతేకాకుండా, గడచిన మూడు నెలలుగా హోండా తన నెలవారీ అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని చూస్తోంది.

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

ఈ నేపథ్యంలో, హోండా వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, సప్లయ్‌ని అందించేందుకు కంపెనీ ఇప్పుడు మరింత అధిక సామర్థ్యం కలిగిన ప్లాంట్‌వైపు దృష్టి సారించింది. ఇందులో భాగంగానే, కంపెనీ మొత్తం వాహనాల ఉత్పత్తిని రాజస్థాన్‌కు తరలించింది.

MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

ఇక హోండా సివిక్ విషయానికి వస్తే, ఈ ప్రీమియం సెడాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమయ్యేది. పెట్రోల్ వెర్షన్‌లో 1.8-లీటర్ ఐ-విటిఇసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 139 బిహెచ్‌పి పవర్‌ను మరియు 174 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

ఇకపోతే, డీజిల్ వెర్షన్ హోండా సివిక్ సెడాన్‌లో 1.6-లీటర్ ఐ-డిటిఇసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఇకపై ఈ వెహికల్ నెంబర్స్ నిషేధం.. ఎందుకో తెలుసా ?

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యమయ్యేది. ఇందులో 2.0-లీటర్, 4-సిలిండర్, ఎస్‌ఓహెచ్‌సి ఐ-విటిఇసి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 152 బిహెచ్‌పి శక్తిని మరియు 4,300 ఆర్‌పిఎమ్ వద్ద 189 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

హోండా ప్రోడక్ట్ లైనప్‌లో హోండా సివిక్ మరియు సిఆర్-విలు రెండూ కూడా చాలా మంచి కార్లు. కానీ దురదృష్టవశాత్తు ఇవి భారత మార్కెట్లో ఆశించిన రీతిలో అమ్ముడుకాలేకపోయాయి. వీటి అధిక ధర కూడా ఇందుకు ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరి భవిష్యత్తులో హోండా వీటిని తిరిగి ప్రవేశపెడుతుందా లేదా అనేది వేచి చూడాలి.

MOST READ:మైండ్‌తో కంట్రోల్ చేయగల నిస్సాన్ కాన్సెప్ట్ కార్ ; పూర్తి వివరాలు

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

ఇదిలా ఉంటే.. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 2020 సంవత్సరం ముగింపును పురస్కరించుకొని ఈ డిసెంబర్ నెలలో తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. హోండా బ్రాండ్ లైనప్‌లోని అమేజ్, ఐదవ-తరం హోండా సిటీ, డబ్ల్యూఆర్-వి, జాజ్ మరియు సివిక్ మోడళ్లపై కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది.

హోండా సివిక్, సిఆర్-వి మోడళ్లు డిస్‌కంటిన్యూ; కారణం ఏంటో తెలుసా?

అంతేకాకుండా, హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్, అమేజ్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ మరియు డబ్ల్యూఆర్-వి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్లపై కూడా కంపెనీ ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తోంది. కస్టమర్ ఎంచుకున్న మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి గరిష్టంగా ఈ డిసెంబర్ నెలలో గరిష్టంగా రూ.2.5 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. - మోడల్ వారీగా హోండా అందిస్తున్న ఆఫర్ల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda To Discontinue Civic And CR-V In India Due To Production Shifting To New Plant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X