జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

'హోండా కార్స్ ఇండియా' అందిస్తున్న పాపులర్ సెడాన్ 'హోండా సిటీ' లో కంపెనీ కొత్తగా బిఎస్6 వెర్షన్‌ను ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే నెల ఆరంభంలో కానీ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కొత్త 2020 హోండా సిటీ సెడాన్ ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి.

జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

కొత్త 2020 హోండా సిటీ సెడాన్‌కి సంబంధించి తాజాగా కొన్ని వివరాలు ఇంటర్నెట్‌లో రిలీజ్ అయ్యాయి. జపనీస్ కటానా బ్లేడ్ (సాయుధులు వాడే పదునైన ఖడ్గం) నుంచి స్ఫూర్తి పొంది ఈ సరికొత్త తరం సిటీ కారును డిజైన్ చేశారు. ఆ కత్తి మాదిరిగా డిజైన్ కూడా పదునుగా ఉంటుంది. కొత్త హోండా సిటీ హెడ్‌ల్యాంప్‌ని గమనిస్తే ఇది అర్థమవుతుంది.

జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

తొమ్మిది లైట్లను సిరీస్‌లో కలిపినట్లుగా ఉండే సరికొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, అందులోనే అమర్చబడిన డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ ఆకారంలో ఉండే టర్న్ ఇండికేటర్స్‌తో పాటుగా వెనుక వైపు జెడ్ ఆకారంలో ఉండే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్‌ను ఇందులో గమనించవచ్చు. ఇందులో కొత్తగా డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో తయారు చేసిన కొత్త 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

MOST READ: హ్యార్లీ డేవిడ్‌సన్ ఐరన్ 883 ధర పెంపు, వివరాలు

జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. ఈ ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌లో ఉపయోగించిన ఇంటీరియర్ డిజైన్ సిద్ధాంతాన్ని కంపెనీ 'ఆంబీషియస్ బ్యూటీ' అనే పేరుతో పిలుస్తోంది. మరింత ప్రీమియం లుక్‌తో ప్రయాణీకుల అత్యంత సౌకర్యాన్ని అందించేలా కొత్త సిటీ కారులోని ఇంటీరియర్స్ తీర్చిదిద్దారు. ఇందులోని 8-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేస్తూనే సెగ్మెంట్లో కెల్లా మొదటిసారిగా అలెక్సా రిమోట్ వాయిస్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

అంతేకాకుండా ఇందులో 32కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్ (టిసియూ) అనే హోండా లేటెస్ట్ కనెక్టెడ్ టెక్నాలజీని కూడా ఆఫర్ చేస్తున్నారు. డ్రైవర్ సౌకర్యం కోసం మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో గమనించవచ్చు. పెర్ఫార్మెన్స్ కార్లలో మాత్రమే కనిపించే, కార్నరింగ్ ఫోర్స్‌లను కొలిచే జీ-మీటర్‌ను ఈ కొత్త హోండా సిటీలో జోడించారు. ఇంకా ఇందులో ప్యాడల్ షిఫ్టర్స్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సన్‌షేడ్, యాంబియెంట్ లైటింగ్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ: మహీంద్రా సుప్రో అంబులెన్స్ : ధర & ఇతర వివరాలు

జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

సేఫ్టీ విషయంలో కూడా కొత్త 2020 హోండా సిటీ కారులో అధునాత ఫీచర్లను జోడించారు. ఇందులో బెస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లయిన హ్యాండ్లింగ్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, డ్యూయెల్ ఫ్రంట్ ఐ-ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, ఎడమ చేతి వైపు మిర్రర్ క్రింది భాగంలో అమర్చిన లేన్ మోనిటరింగ్ కెమెరా, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్), ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్ మొదలైన ఫీచర్లున్నాయి.

జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

ఇంజన్‌లో చేసిన మార్పులు విషయానికి వస్తే.. కొత్త హోండా సిటీ కారులోని ఇదివరకటి ఇంజన్లే అధునాతంగా మోడిఫై చేసి బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా మార్చారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

MOST READ: మీకు తెలుసా.. ఈ కారు, బైక్ కంటే చాలా చీప్

జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

ఇందులోని 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ డిఓహెచ్‌సి (డబుల్ ఓవర్-హెడ్ క్యామ్) టెక్నాలజీతో గరిష్టంగా 120 బిహెచ్‌పిల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే డీజిల్ వెర్షన్‌లోని 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. అలాగే పెట్రోల్ వెర్షన్లపై 7-స్పీడ్ ఆటోమేటిక్ సివిటి గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.

జులైలో విడుదల కానున్న కొత్త హోండా సిటీ బిఎస్6; వివరాలు

హోండా సిటీ 2020 మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రానున్న ఈ కొత్త 2020 హోండా సిటీ సెడాన్ ఈ సెగ్మెంట్లోని స్కొడా ర్యాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, టొయోటా యారిస్ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. ఈ కొత్త కారు ఇది వరకటి సిటీ కారు కన్నా ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda has completely revealed the details of the 2020 City ahead of its launch in the Indian market. The company is expected to launch the new sedan by the end of this month. The 2020 City features a host of changes on inside and out over the new model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X