Just In
- 1 hr ago
టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!
- 4 hrs ago
మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునేందుకు రెనో ఇండియా కొత్త ప్లాన్స్!
- 5 hrs ago
ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కొత్త తరం మహీంద్రా స్కార్పియో: ఫొటోలు!
- 5 hrs ago
కొత్త 2021 స్కొడా కొడియాక్ ఆవిష్కరణ; త్వరలోనే ఇండియా లాంచ్ - డీటేల్స్
Don't Miss
- Finance
బంగారం దిగుమతులు సరికొత్త రికార్డ్, 471 శాతం జంప్
- Sports
ఆ భారీ సిక్సర్‌కు చిన్నప్పటి రబ్బర్ బాల్ ప్రాక్టీసే కారణం: సూర్యకుమార్ యాదవ్
- News
ముంబై: మళ్లీ అదే దృశ్యం... రైల్వే స్టేషన్లకు పోటెత్తిన వలస కార్మికులు.. సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన..
- Movies
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరో న్యూస్: రాజమౌళి చేసిన పని వల్లే.. ఆ ఫొటోతో అనుమానాలు మొదలు
- Lifestyle
మీలో ఇలాంటి లక్షణాలుంటే.. మీ ప్రేమ జీవితాంతం సాఫీగా సాగిపోతుంది...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి
వాహనాలు తప్పనిసరిగా హెచ్‌ఎస్‌ఆర్‌పి నంబర్ ప్లేట్లను కలిగి ఉండాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. (హెచ్‌ఎస్‌ఆర్‌పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు) అయినప్పటికీ వాహనదారులు వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. ఇప్పడు ఢిల్లీలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేనివారికి భారీఆ జరిమానాలు విధిస్తున్నారు.
ఇంతకీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఎందుకు ఉపయోగించాలి, ఈ నెంబర్ ప్లేట్లు ఎలా పొందాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..రండి.

భారతదేశం రాజధాని నగరం ఢిల్లీలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేనివారిపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేని వాహనదారులకు ఏకంగా రూ. 5,500 జరిమానాను విధిస్తున్నారు. 2020 అక్టోబర్ 12 నుండి ఢిల్లీలో పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు.

ఫోర్-వీలర్స్ మరియు ద్విచక్ర వాహనాలలో ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు పొందటానికి bookmyhsrp.com. వెబ్ సైట్ లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేని వాహనదారులు ఈ నెంబర్ ప్లేట్ పొందటానికి ఈ కింది పద్దతులను పాటించాలి.
MOST READ:ఒకే వారంలో రెండుసార్లు జరిమానా చెల్లించిన డిప్యూటీ మేయర్.. ఎవరో తెలుసా ?

ఢిల్లీ వాసులు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ఏవిధంగా చేయాలంటే
స్టెప్ 1: మొదట మీరు "https://www.bookmyhsrp.com/Index.aspx" వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
స్టెప్ 2: హోమ్‌పేజీలో, "ప్రైవేట్ వెహికల్ (నాన్-ట్రాన్స్‌పోర్ట్) - వైట్ ప్లేట్" లేదా "కమర్షియల్ వెహికల్ (ట్రాన్స్‌పోర్ట్) - ఎల్లో ప్లేట్" టాబ్ క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఫ్యూయెల్ టైప్ రకాన్ని అంతే పెట్రోల్ లేదా డీజిల్ లేదా EV లేదా CNG లేదా CNG + పెట్రోల్‌గా ఎంచుకోండి
స్టెప్ 4: మీ వాహన రకాన్ని రెండు లేదా మూడు చక్రాలు లేదా నాలుగు చక్రాలు లేదా వాణిజ్య వాహనాలుగా ఎంచుకోండి.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

స్టెప్ 5: మీ వాహనం స్కూటర్, మోటారుసైకిల్, ఆటో రిక్షా, 4 వీలర్ లేదా ఇతర వాహనం తయారుచేసే సంస్థ పేరుతో వెహికల్ ని ఎంచుకోండి.
స్టెప్ 6: రాష్ట్రం పేరును ఎంచుకోండి. మనదేశంలో ఉత్తర ప్రదేశ్ మరియు ఢిల్లీ వంటి రెండు రాష్ట్రాలు ఇప్పటికే హెచ్‌ఎస్‌ఆర్‌పి నమోదు ప్రక్రియను ప్రారంభించాయి.
స్టెప్ 7: దరఖాస్తుదారులు మీ హెచ్‌ఎస్‌ఆర్‌పిని అఫిక్స్ చేయాలనుకుంటున్న చోట నుండి వారి సమీప ప్రదేశం లేదా డీలర్‌ను ఎన్నుకోవాలి.

స్టెప్ 8: బుకింగ్ లేదా అపాయింట్‌మెంట్‌లో భాగంగా దరఖాస్తుదారులు వాహన సమాచారాన్ని నింపాలి
స్టెప్ 9: దరఖాస్తుదారులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, తేదీ, చాసిస్ నంబర్, ఇంజిన్ నెంబర్, ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, వెహికల్ టైప్ ఎంటర్ చేసి "నెక్స్ట్" బటన్ వద్ద క్లిక్ చేయాలి.
మీరు ఇక్కడ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కి పంపిన ఓటీపీ ని ధృవీకరించండి. తేదీ మరియు టైమ్ స్లాట్‌ను ఎంచుకోండి.
MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]

ఢిల్లీ రవాణా శాఖ యొక్క నివేదికల ప్రకారం, ఇప్పటికే 40 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు మరియు ఫోర్ వీలర్స్ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేకుండా నడుస్తున్నాయి. ఇప్పటి వరకూ వాహనాలలో ఉన్న పాత నంబర్ ప్లేట్‌ను మార్చడం మరియు దానిని కొత్త హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌తో భర్తీ చేయడం తప్పనిసరి అంటూ ఢిల్లీ రవాణా శాఖ నవంబర్ 16 న నోటీసు జారీ చేసింది.

2019 ఏప్రిల్ 01 కి ముందు కొనుగోలు చేసిన వాహనాల్లో కొత్త నంబర్ ప్లేట్ మరియు హోలోగ్రామ్ స్టిక్కర్‌ను ఏర్పాటు చేయడం తప్పనిసరి. అయితే 1 ఏప్రిల్ 2019 మరియు తరువాత రిజిస్టర్ చేయబడిన వాహనాలకు డీలర్లు కొత్త నంబర్ ప్లేట్లు మరియు హోలోగ్రామ్ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నారు.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో పొడవైన సింగిల్ లేన్ ఫ్లైఓవర్, ఇదే

హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ వల్ల ఉపయోగాలు :
*వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమర్చుకోవడం ద్వారా స్మగ్లింగ్, దొంగ రవాణా, వాహనాల చోరీ వంటి వాటికి చెక్ పెట్టవచ్చు.
*ఈ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను వాహనానికి అమర్చుకోవడం వల్ల నెంబర్ ప్లేట్లపై పిచ్చిరాతలు, గీతలు, బొమ్మలు, పేర్లు, వంకర తిరిగిన నెంబర్లు రాయడానికి వీలుండదు.
*వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణ నెంబర్ ప్లేట్లను గుర్తించడం కష్టం అవుతుంది. అదే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అయితే, కారు యజమాని చిరుమాతో సహా గుర్తించవచ్చు.

*ప్రభుత్వమే వీటిని నెంబర్‌తో జారీ చేస్తుంది కాబట్టి నెంబర్ ప్లేట్ల విషయంలో ఎలాంటి అవతవకలు జరిగే అవకాశం లేదు.
*హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను ఒక్కసారి అమర్చితే, తిరిగి వాటిని తొలగించడం అంత సులువు కాదు.
*ఒకే వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను వివిధ వాహనాలకు ఉపయోగించడం వీలు కాదు.
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, కావున వాహనదారులు తప్పకుండా తమ వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఏర్పాటు చేసుకుని మీ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకొండి.